అవసరమైతే సవరణలు తీసుకొస్తారు..
టీడీపీ ఎంపీ తోట వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ : ఫిరాయింపుల నిరోధక చట్టానికి అవసరమైతే సవరణలు తీసుకొస్తారని లోక్‌సభలో టీడీపీ పక్షనేత తోట నరసింహం వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంతకుమార్ అధ్యక్షతన ఢిల్లీలో ఆదివారం జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు తేవాలని కోరుతూ ప్రవేశపెట్టనున్న ప్రైవేటు మెంబర్ బిల్లుకు మద్దతిస్తారా? అన్న మీడియా ప్రశ్నకు ఆయన పైవిధంగా బదులిచ్చారు.
విపక్ష ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల అభివృద్ధికోసం అధికారపార్టీలో చేరుతున్నారన్నారు. విభజన హామీల అమలుకు అఖిలపక్షంలో విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం హాస్యాస్పదమన్నారు.