ఢిల్లీ: పీఎమ్‌కేఎస్ కింద తెలంగాణ రాష్ట్రంలోని 9 ప్రాజెక్ట్‌లను చేర్చాలని కేంద్రాన్ని కోరినట్టు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన జలవనరుల శాఖ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సమావేశం ముగిసిన అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ.. ఈ నెల 28న రాష్ట్రాలలోని ప్రాజెక్ట్‌ల వివరాలు పంపాలని సమావేశం కోరినట్టు తెలిపారు. ఏప్రిల్ 10న రాజస్థాన్ లోని జోథ్‌పూర్‌లో మరోసారి సమావేశం అవుతామని అన్నారు. రాజస్థాన్‌లోని సుచార్ ప్రాజెక్ట్ పనితీరును కమిటీ అధ్యయనం చేస్తోందని తెలిపారు. నాబార్డ్ నుంచి ఎఫ్‌ఆర్‌బీఎమ్‌కు అదనంగా రుణాలు ఇచ్చే అంశంపై చర్చించామని చెప్పారు. ఏప్రిల్ నెలలో నిధులు ఇవ్వగలిగితే రాష్ట్రాలు పురోగతి సాధించే అవకాశం ఉందని తెలిపారు. పీఎమ్‌కేఎస్‌వై తొలి దశలో 60 ప్రాజెక్ట్‌లను తీసుకుంటున్నామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.
మిషన్ కాకతీయలో అవినీతి ఆరోపణలపై మంత్రి హరీష్రావు స్పందించారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరుతో కాంగ్రెస్సే రూ. 1500 కోట్లు దోచుకుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్స్‌లను రద్దు చేసిందన్నారు. టెండ్లర్లను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని హరీష్‌రావు వెల్లడించారు.
'ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం'
Published Sun, Mar 20 2016 5:51 PM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM
Advertisement
Advertisement