తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యత్నిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
నిజామాబాద్: తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యత్నిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
తమ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. బుధవారం ఆయన నిజామాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. పట్టిసీమ, పోలవరం నికర జలాలకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం వాడుకుంటామని మంత్రి హరీష్ రావు తేల్చిచెప్పారు.