తాజ్‌మహల్ వద్ద పాము కలకలం
ఆగ్రా: ప్రపంచవింతల్లో ఒకటైన తాజ్‌మహల్ వద్ద పాము కలకలం సృష్టించింది. దాదాపు ఆరు అడుగులు పొడవున్న పామును చూసిన టూరిస్టులు బెంబేలెత్తిపోయారు. కొంతమంది అక్కడి నుంచి పరుగులు పెట్టగా.. మరికొందరు సాయం చేయాలంటే పెద్దగా అరిచారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులను సమాచారం అందించారు.
పబ్లిక్ వాటర్ సదుపాయం కోసం నాలుగు ఆర్వో ప్లాంట్లను తాజ్‌మహల్ వద్ద నిర్వహిస్తున్నారు. నీరు తాగడానికి వెళ్లిన ఓ వ్యక్తి పామును గమనించడంతో కలకలం చెలరేగింది. భద్రతా సిబ్బంది సమాచారంతో హుటాహుటిన తాజ్‌మహల్‌కు చేరుకున్న నిపుణుడు గంటపాటు శ్రమించి దాన్ని పట్టుకున్నాడు. దాహార్తితో తల్లడిల్లిన పాము చల్లదనం కోసం చారిత్రాత్మక కట్టడం వైపు వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.