ఆన్లైన్లో దుమ్మురేపుతున్న సెల్ఫీ | This Man Clicked A Selfie With A Smiling Sloth And It's Breaking The Internet | Sakshi
Sakshi News home page

ఆన్లైన్లో దుమ్మురేపుతున్న సెల్ఫీ

Published Wed, Jul 6 2016 10:36 AM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

ఆన్లైన్లో దుమ్మురేపుతున్న సెల్ఫీ

ఆన్లైన్లో దుమ్మురేపుతున్న సెల్ఫీ

స్లాత్స్.. ఇవి చాలా అరుదుగా కనిపించి అటవీ జంతువులు. ఎప్పుడు నిద్రమత్తులో ఉండి బద్ధకంగా ఉంటుంటాయి. మిగితా జంతువుల కంటే భిన్నంగా చెట్లకు వేలాడుతుంటాయి. అది కూడా రెండు కాళ్లు చెట్టుకొమ్మకు మెలేసి ఓ చేతిని కిందకి వేలాడేసి మరో చేత్తో ఆ చెట్టుకొమ్మను పట్టుకొని.. ఇవి ఎట్టి పరిస్థితుల్లో నేలపై అడుగుపెట్టవు. ఒక చెట్టుమీద నుంచి మరో చెట్టుమీదకు కొమ్మలద్వారా వెళుతుంటాయి. అది కూడా మన్ను తిన్నపాములాగా నెమ్మదిగా..

అలాంటి స్లాత్స్ కనిపించడమే అరుదవుతుండగా దానితో నికోలస్ హుస్కార్ అనే ఓ యువకుడు ఏకంగా సెల్ఫీనే దిగాడు. ఆ ఫోటోకు స్లాత్ కూడా చక్కగా నవ్వుతూ పోజిచ్చింది. వాస్తవానికి ఈ జంతువు కెమెరాకు చిక్కడం చాలా అరుదు. ఓ అడవిలో ట్రెక్కింగ్ కు వెళుతున్న నికోలస్ తనకు స్లాత్ కనిపించగానే వెంటనే తన సెల్ఫీ స్టిక్ తీస్కొని ఫొటోకు పోజివ్వగా.. అది చూసిన స్లాత్ కూడా నేను కూడా రెడీ అన్నట్లు స్మైల్ తో పోజిచ్చింది. ఈ ఫొటోను ఆన్ లైన్ లో పోస్ట్ చేయగా దుమ్మురేపుతోంది. ఇప్పటికే రెండు లక్షలమంది ఆ ఫొటోను చూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement