శ్రీనగర్: చొరబాటుదారులు, భారత సైన్యానికి మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు కలిగిన ఓ ముష్కరుల బృందం ఆదివారం ఉదయం కశ్మీర్ కుప్వారా జిల్లాలోని తగ్ధార్ సెక్టార్ వద్ద ఎల్వోసీ దాటి భారత్లోకి చొరబడేందుకు యత్నించింది. వీరిని గుర్తించి హెచ్చరికలు చేసిన భారత సైన్యంపైకి ముష్కరులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో ఆదివారం అర్ధరాత్రి సమయంలో సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు మృతి చెందారు. కడపటి వార్తలు అందేవరకు కూడా హోరాహోరీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.