సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో వర్షం, పిడుగుపాట్లు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. రాజస్థాన్, యూపీని మెరుపులతో కూడిన భారీ వర్షాలు ముంచెత్తి వందమంది మరణించిన నేపథ్యంలో ఐఎండీ మరో రెండు రోజుల పాటు వాతావరణం ఇదే తరహాలో ఉంటుందని పేర్కొంది.
తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాలతో పాటు ఈశాన్యరాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఛత్తీస్‌ఘర్, ఢిల్లీ, పంజాబ్, బీహార్, జార్ఖండ్, సిక్కిం, ఒడిషా, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇక పశ్చిమ బెంగాల్, ఒడిషా, బిహార్, ఉత్తర్ ప్రదేశ్‌లో రానున్న రోజుల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు ముంచెత్తుతాయని హోంమంత్రిత్వ శాఖ శుక్రవారం తాజా హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment