భువనేశ్వర్ : భారత్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతున్నా కొందరికి మాత్రం ఇవేమి పట్టడం లేదు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటించాలని అధికారులు చెబుతున్నా పెద్దగా పట్టించుకోవట్లేదు. సాక్షాత్తూ ఓ క్వారంటైన్ సెంటర్‌లోనే నిబంధనలు గాలికొదిరేశారు. ఏం చేయాలో పాలుపోక టైంపాస్ కోసం టిక్‌టాక్ వీడియోలు చేశారు. వారంతా కరోనా లక్షణాలుతో అక్కడ చేరిన వారే. ఈ ఘటన ఒడిశాలోని బద్రక్ జిల్లాలో చోటుచేసుకుంది.
Tihidi PS case No
— BhadrakPolice (@SpBhadrak) May 4, 2020
172 Dt 4,5.20 u/s 188/269/270IPC/ sec 51 DM Act has been registered against 6 persons for violating social distancing norms in quranitine centre at Bhatapara and uploading the video on Tik Tok.
కరోనా లక్షనాలతో ఒడిశాలోని తిహిడి హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌లో సోమవారం ఆరుగురు వ్యక్తులు టిక్‌టాక్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి కాస్తా వైరల్ అయ్యాయి. సామాజిక దూరం పాటించాలన్న నిబంధనను ఉల్లంఘించిన కారణంగా వీరిపై కేసు నమోదు చేసినట్లు బద్రక్ పోలీసులు తెలిపారు.
( కరోనా: ఆరోగ్య సిబ్బంది మరణిస్తే రూ.50 లక్షలు )
Comments
Please login to add a commentAdd a comment