సోషల్ మీడియాలో ప్రజల స్పందన గమనించండి: మోడీ
న్యూఢిల్లీ: దేశ ప్రజల మనోగతాన్ని గమనించాలని కేంద్ర సమాచార ప్రసారశాఖా మంత్రిత్వ శాఖకు ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖాలోని సోషల్ మీడియా వింగ్ సోషల్ మీడియా వెబ్ సైట్స్ ఫేస్ బుక్, ట్విటర్ లపై దృష్టిపెట్టింది. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో స్పందన, ప్రజల అభిప్రాయాలను, ఇతర పరిణామాలపై ఇటీవల ప్రధాని మోడీకి, కెబినెట్ సెక్రెటరీకి ఓ నివేదికను అందించారు.
అయితే రోజువారి నివేదికలు అందించాలని.. రానున్న రోజుల్లో నివేదికల్ని పంపే కార్యక్రామన్ని మరింత పెంచాలని పీఎంవో నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కీలక విషయాలపై సోషల్ మీడియాలో వచ్చే ప్రజల ఫీడ్ బ్యాక్, స్పందన, సెంటిమెంట్స్, అభిప్రాయాలు,సూచనల్ని ఎప్పటికప్పుడు గమనించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియాను మోడీ పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో మంత్రులు, ఇతర అధికారులు కూడా అదే దారిలో నడిచి ప్రజలతో కనెక్ట్ అవ్వాలని ప్రధాని సహచరులకు కూడా సూచించినట్టు అధికారులు తెలియచేస్తున్నారు.