
గొంతెమ్మ కోర్కెలొద్దు
ఈసారి తమకు మరిన్ని సీట్లు కేటాయించాలంటూ మహాకూటమి పక్షాలు డిమాండ్ మానేయాలని శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే సూచిం చారు. ప్రతి ఒక్కరూ విజయంపైనే దృష్టి సారించాలని, అత్యాశలు వదు లుకోవాలన్నారు. మహాకూటమిలో సీట్ల పంపకాలపై విబేధాలు కొనసా గుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకు న్నా యి. శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో ఉద్ధవ్ పైవి ధంగా అన్నారు.
దేశవ్యాప్తంగా మోడీ ప్రభావం బలంగా ఉన్నందున, ఈసారి తమకు మరిన్ని సీట్లు కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. మహా కూటమిలోని ఆర్పీఐ, స్వాభిమాన్ శేత్కారీ వంటి ఇతర పార్టీలు కూడా అదనపు సీట్ల కోసం పట్టుబడుతున్నాయి. ఇక సీఎం పదవి గురించి ‘ఆజ్‌తక్’ న్యూస్‌చానెల్ ‘పంచాయత్ మహారాష్ట్ర’ అనే కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ముఖ్యమంత్రి పదవి చేపడితే తప్పేమిటని ప్రశ్నించారు. సీఎం ఎవరనేది నిర్ణయించేది ప్రజలేనని చెప్పారు.
‘దేశ ప్రధానిగా ప్రజలు నరేంద్ర మోడీని కోరుకున్నా రు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజ లు నన్ను కోరుకున్నా తప్పేం లేదు. నేను ముఖ్యమంత్రి అయితే నష్టం ఏం టి?’ అని అన్నారు. మరోవైపు మహా కూటమి సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని, గత 25 ఏళ్లుగా తమ పొత్తు కొనసాగుతుందన్నారు. భవిష్యత్‌లో నూ ఇలాగే కొనసాగుతుం దని భావిస్తున్నామని ఉద్ధవ్ అన్నారు.