Union Budget 2019 LIVE in Telugu | మధ్యంతర బడ్జెట్‌ Highlights & Analysis 2019 -20 - Sakshi
Sakshi News home page

Published Fri, Feb 1 2019 8:29 AM | Last Updated on Fri, Feb 1 2019 1:28 PM

Union Budget 2019 Live Updates - Sakshi

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తరుణంలో ఓటర్లను ఊరించే నిర్ణయాలతో మోదీ సర్కారు బడ్జెట్‌ ఉంటుందన్న భారీ అంచనాల నేపథ్యంలో తాత్కాలికంగా ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పీయూష్‌ గోయల్‌ శుక్రవారం పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు గోయల్‌ తన బడ్జెట్‌ చిట్టాను విప్పారు. విపక్షాల నిరసనల మధ్య బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన పీయూష్‌ గోయల్‌.. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న సీనియర్‌ మంత్రి అరుణ్‌ జైట్లీ త్వరగా కోలుకోవాలని ఆకా‍ంక్షించారు.

పీయూష్‌ గోయల్‌ బడ్జెట్‌ ప్రసంగంలోని ప్రధానాంశాలు.. (సాక్షి లైవ్‌ కవరేజ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

మధ్యంతరం కాదు.. అభివృద్ధికి రోడ్‌ మ్యాప్

  • తాత్కలికంగా ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన పీయూష్‌ గోయల్‌ తన బడ్జెట్‌ ప్రసంగంతో ఆకట్టుకున్నారు. మధ్యంతరం కాదిది.. అభివృద్ధికి రోడ్‌ మ్యాప్‌ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సభలో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా వేతన జీవుల ఆదాయపు పన్ను మినహాయింపు ప్రకటించే సందర్భం సభికులను, టీవీల ముందున్న సాధారణ ప్రజలను ఆకట్టుకుంది.

సమయం: 12.45: ముగిసిన పీయూష్‌ గోయల్‌  బడ్జెట్‌ ప్రసంగం. లోక్‌ సభ సోమవారానికి వాయిదా

ఆదాయపు పన్ను పరిమితి పెంపు

  • ఎన్నికల ముందు వేతన జీవులకు భారీ ఊరట
  • రూ.5లక్షల వరకు ఆదాయపు పన్ను పరిమితి పెంపు
  • ఇప్పటివరకు ఇస్తున్న పన్ను మినహాయింపు రెట్టింపు
  • గృహరుణాలు, ఇంటిఅద్దెలు,. ఇన్సురెన్స్‌లు కలిపి 6.50 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు.
  • 3 కోట్ల ఉద్యోగులకు లబ్ది
  • స్టాండర్డ్‌ డిడక‌్షన్‌ రూ.50 వేలకు పెంపు
  • పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ 10 వేల నుంచి 40 వేలకు పెంపు
  • నెలకు 50 వేల జీతం వరకు టీడీఎస్‌ ఉండదు.
  • సొంతిల్లు అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయంపై రూ. 2.50 లక్షల వరకు పన్నులేదు.

సినిమా టికెట్లపై జీఎస్టీ తగ్గింపు

  • సినీనిర్మాణానికి సింగిల్‌ విండో అనుమతులు
  • సినిమా టికెట్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు
  • పైరసీ అరికట్టడం కోసం యాంటీ కామ్‌ కార్డింగ్‌ ప్రొవిజన్‌ యాక్ట్‌

అతి తక్కువ ఖర్చుతో డేటా, వాయిస్‌ కాల్స్‌

  • టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు
  • ప్రపంచంలోనే అతి తక్కవ ఖర్చుతో డేటా, వాయిస్‌ కాల్స్‌ సేవలు
  • 24 గంటల్లో ఐటీఆర్‌ ప్రాసెస్‌, రిఫండ్‌
  • 2030 నాటికి భారత్‌లో ఎలక్ట్రానిక్‌ వాహనాలు 

రైల్వే బడ్జెట్‌ రూ. 64,587 కోట్లు

  • రేల్వేశాఖకు రూ. 64, 587 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు
  • రైల్వే చరిత్రలోనే ప్రమాదాలు జరగని ఏడాది 
  • బారీగేజ్‌లో కాపలా లేని గేట్లను తొలగించాం.
  • త్వరలోనే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు

ప్రతి ఒక్కరికి ఇళ్లు

  • సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో 10 రెట్ల వృద్ధి
  • 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్లు
  • దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ విద్యుత్‌ సౌకర్యం కల్పించాం
  • దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన 150 జిల్లాలపై ప్రత్యేక దృష్టి
  • దేశంలో ప్రస్తుతం 21 ఎయిమ్స్‌, త్వరలోనే హరియాణలో 22వ ఎయిమ్స్‌
  • అంగన్‌వాడీ టీచర్ల జీతం 50 శాతం పెంపు
  • జాతీయ గ్రామీణుపాధి హామీ పథకానికి రూ. 60వేల కోట్ల కేటాయింపు
  • ఈఎస్‌ఐ పరిధి 15 వేల నుంచి 21 వేలకు పెంపు
  • రక్షణ రంగానికి భారీ కేటాయింపులు
  • రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్లు కేటాయింపు
  • సైనికులకు ప్రత్యేక అలవేన్స్‌లు
  • అవసరమైతే రక్షణ శాఖకు అదనంగా నిధులు
  • ఆవుల సంరక్షణకు ప్రత్యేక పథకం
  • ఆవుల సంరక్షణకు కమిషన్‌ ఏర్పాటు

కార్మికుల కోసం పెన్షన్‌ పథకం

  • ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్‌ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛన్‌.
  • 60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు పింఛన్‌ వచ్చే విధంగా పథకం.
  • నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్‌. 
  • అసంఘటిత రంగంలోని 10కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తింపు
  • బోనస్‌ పరిమితి 21వేల పెంపు
  • ఉపాది అవకాశాలు మెరుగుపరడటంతో ఈపీఎఫ్‌వో సభ్యులు పెరిగారు.
  • బోనస్‌ పరిమితి 21వేల పెంపు
  • గ్రాట్యూటీ పరిధి 10 లక్షల నుంచి 30 లక్షల పెంపు
  • ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు కార్మికులు, ఉద్యోగులకు అందాలి
  • ఎన్‌పీఎస్‌ విధానంలో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు
  • రైతులపై వరాల జల్లు
  • చిన్నసన్నకారు రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. 
  • ఈ పథకం ద్వారా చిన్నసన్నకారు రైతులకు ఏడాదికి రూ. 6వేల సాయం అందజేస్తాం. 
  • ఐదెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఈ పథకం వర్తింపు
  • రైతు సాయం కోసం 75 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయింపు
  • నేరుగా ఖాతాలోకే కేంద్రం నగదు సాయం. మూడు విడతల్లో నగదు అందజేత. తొలి విడతగా తక్షణమే రూ.2వేల సాయం.
  • రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ నగదు నేరుగా రైతుల ఖాతాలోకి మళ్లింపు
  • 12 కోట్ల రైతులకు లబ్ధి
  • కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల కింద రుణాలు
  • రైతు పెట్టుబడి సాయం 2018 డిసెంబర్‌ నుంచే అమలు
  • రుణాలు సకాలంలో చెల్లించినవారికి రాయితీలు
  • ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయినవారికి రుణాల రీషెడ్యూల్‌
  • పాడిపరిశ్రమ రుణాలు సకాలంలో చెల్లించే వారికి అదనపు మూడు శాతం వడ్డీ రాయితీ

  • 50 కోట్ల మందికి వైద్య సదుపాయాలు
  • గడిచిన ఐదేళ్లలో ఆరోగ్యం రంగం భారీ మార్పులు చూసింది.
  • ప్రధాని మోదీకి ప్రజల ఆరోగ్యంపై ఎంతో ఆందోళన ఉండేది.
  • 50 కోట్ల మందికి వైద్య సదుపాయాలు అందించేందుకు ఆయుష్మాన్‌ పథకం ప్రవేశపెట్టాం.
  • ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద పథకం
  • దేశ ఆత్మవిశ్వాసాన్ని మోదీ ప్రభుత్వం పెంచింది.
  • 2020లోగా నవభారతాన్ని చూడబోతున్నాం
  • దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడింది.
  • జీడీపీ వృద్ధి రేటులో గణనీయ పురోగతి సాధించాం
  • విధాన నిర్ణయాల్లో వేగం పెంచాం
  • గడిచిన ఐదేళ్లలో భారత్‌ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.
  • డబుల్‌ డిజిట్‌ ద్రవ్యోల్పణాన్ని తగ్గించాం.
  • ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశం భారత్‌
  • నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాం
  • రాష్ట్రాలికచ్చే ఆర్థిక వాటాను పెంచాం.
  • సహకార సమాక్యస్పూర్తికి అనుగుణంగా వ్యవహరిస్తున్నాం
  • బ్యాంకింగ్‌ రంగంలో 4ఆర్‌ ప్రవేశపెట్టాం
  • మొండిబకాయిలు మూడు లక్షల కోట్లు వసూలు చేశాం
  • మా చర్యల కారణంగా నిన్నే 3 బ్యాంకులపై ఆంక్షలు తొలిగాయి.
  • బ్యాంకుల సరైన స్థితి ప్రజల ముందుంచాలని ఆర్‌బీఐని కోరాం
  • బ్యాంకుల విలీనాన్ని చేపట్టాం.
  • ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడటమే మా ధ్యేయం
  • మేం అవినీతి రహిత పాలనను అందించాం.
  • స్వచ్ఛభారత్‌ ద్వారా ప్రవర్తనలో మార్పు తెచ్చాం.
  • బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాం.
  • రెరా ద్వారా నియంత్రణను విధించాం.
  • రిజర్వేషన్లను యథాతధంగా ఉంచుతూ కొత్త రిజర్వేషన్లు తీసుకొచ్చాం.
  • సమయం 10:55: విపక్షాల నిరసనల మధ్య మధ్యంతర బడ్జెట్‌ను తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెడుతున్నారు.
  • సమయం 10:55: తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌కు కేంద్రకేబినెట్‌ ఆమోదం తెలిపింది.
  • సమయం 10:35: మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్‌పై మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ హయాంలో నోట్ల రద్దు చేసిన ఏడాదే అత్యధికంగా భారత్‌ వృద్ధి రేటు 8.2 శాతం వచ్చిందని, మరోసారి నోట్ల రద్దు చేయాలన్నారు. ఈ సారి రూ.100 నోట్లు రద్దు చేయమని సూచిస్తూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. 

సమయం 10:16:  రైల్వే శాఖలో ప్రభుత్వ పెట్టుబడులు మరింతే పెరిగే అవకాశం ఉందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి మనోజ్‌ సిన్హా తెలిపారు. ఇప్పటికే సీసీటీవీల ఏర్పాట్లు, వైఫై సౌకర్యాల కోసం పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వం.. ఈబడ్జెట్‌లో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుందని మనోజ్‌ సిన్హా విశ్వాసం వ్యక్తం చేశారు.

సమయం 10:10: మధ్యంతర బడ్జెట్‌ను మరికాసేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ పత్రాలతో ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంట్‌కు చేరుకున్నారు. అంతకుముందు పీయూష్‌ గోయల్‌ రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలుసుకున్నారు.

  • సమయం 10:05: పార్లమెంట్‌ భవనంలో కేంద్ర మంత్రివర్గ సమావేశమైంది. మధ్యంతర బడ్జెట్‌కు  కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.
  • మరి సంప్రదాయం ప్రకారమే అయితే, పదవీకాలం చివర్లో ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్‌లో కీలక విధాన నిర్ణయాలేవీ ఉండవు. పరిమిత కాలానికి ఖర్చులకు సంబంధించి అనుమతి తీసుకోవడం మాత్రమే ఉంటుంది. ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వమే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. అయితే, వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పెంపు, సమస్యల్లో ఉన్న రైతాంగానికి ఉపశమనం కల్పించే ప్యాకేజీ, చిన్న వ్యాపారులకు రుణాలపై వడ్డీ రాయితీతోపాటు పలు ఇతర ప్రజాకర్షక నిర్ణయాలు ఉండొచ్చన్న అంచనాలను విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల కాలానికి ప్రభుత్వ ఖర్చులకు పార్లమెంటు అనుమతి కోరడానికి అదనంగా.. గ్రామీణ, పట్టణ మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించే నిర్ణయాలను పీయూష్‌ గోయల్‌ ప్రకటించొచ్చని భావిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement