సాక్షి, న్యూఢిల్లీ: షికాగోలో స్వామి వివేకానంద ఉపన్యసించి 125 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేయనున్న ప్రపంచ హిందూ కాంగ్రెస్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించనున్నారు. ఇందుకు ఆయన రెండు రోజుల అమెరికా పర్యటనకు శుక్రవారం బయలుదేరి వెళ్లనున్నారు. శనివారం హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ షికాగోలో 14 తెలుగు సంఘాలు ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదివారం ప్రపంచ హిందూ కాంగ్రెస్ మహాసభలో ప్రసంగిస్తారు. తిరిగి అదే రోజు రాత్రి భారత్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment