ముంబై: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్నా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు మారడం లేదు. సియాన్ ఆస్పత్రిలో మృతదేహాల పక్కనే కరోనా పేషెంట్లకు చికిత్స అందించిన ఘటన మరువకముందే.. మరో ప్రభుత్వాసుపత్రిలో ఇలాంటి ఘటనే పునరావృతమైంది. ఈసారి ముంబైలోని కెమ్ ఆస్పత్రి ఇందుకు వేదికైంది. నీలిరంగు ప్లాస్టిక్ కవర్లలో మృతదేహాలు చుట్టి.. ఆస్పత్రి బెడ్లపైనే ఉంచిన దృశ్యాలు బయటపడ్డాయి.(శవాలు తీసుకువెళ్లడం లేదు.. అందుకే ఇలా)
కాగా ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘‘పేషెంట్ల పక్కన శవాలు చూసేందుకు బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మనల్ని అలవాటు పడేలా చేస్తున్నారు. అంతేతప్ప వారు మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేదు. అక్కడ సేవలు అందిస్తున్న హెల్త్‌వర్కర్ల ఆరోగ్యం గురించి కూడా తలచుకుంటే బాధేస్తోంది’’ అని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment