భారత్‌లో ఇటీవల ఆఫ్రికన్ జాతీయులపై జరుగుతున్న దాడులను వర్ణవివక్షగా, విదేశీయులంటే భయంగా భావిస్తున్నామని భారత్‌లో ఆఫ్రికన్ మిషన్ చెప్పింది.
న్యూఢిల్లీ: భారత్‌లో ఇటీవల ఆఫ్రికన్ జాతీయులపై జరుగుతున్న దాడులను వర్ణవివక్షగా, విదేశీయులంటే భయంగా భావిస్తున్నామని భారత్‌లో ఆఫ్రికన్ మిషన్ చెప్పింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని తీవ్రంగా విమర్శించింది. భారత ప్రభుత్వం తీరును ఘాటుగా విమర్శిస్తూ రాసిన లేఖను మిషన్ అధికారులు సోమవారం విడుదల చేశారు.
వరుస ఘటనలపై మానవ హక్కుల కమిషన్ స్వతంత్ర విచారణ చేపట్టాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఈ విచారణ లేఖను ఆఫ్రికన్ యూనియన్ కమిషన్‌కు అందజేయాలని కోరారు.