తిరువనంతపురం : గజిబిజి పరుగుల జీవితంలో మనకోసం మనం ఆలోచించుకునే సమయమే దొరకట్లేదు. అలాంటిది పక్కవారి గురించి ఆలోచించడమనేది కలే అవుతుంది. కానీ ఇది అబద్ధమని నిరూపించిందో మహిళ. కళ్లముందు ఓ పెద్దాయన, అదీ.. కంటి చూపు లేని ఓ వృద్ధుడు బస్సు కోసం పరిగెత్తడం చూసింది. అది చూసి ఆమె జాలిపడలేదు. ఆ బస్సు వెనక ఆపమని అరుస్తూ పరిగెత్తింది. దీంతో ఆ బస్సు డ్రైవర్ వాహనాన్ని నిలిపివేశాడు. కానీ ఆమె బస్సు ఎక్కకుండా వెనుదిరిగింది. ఆ పెద్దాయన దగ్గరకు వెళ్లి అతని చేయి పట్టుకుంది. (ఇలాంటి అద్భుతాలు కొందరికే సాధ్యం)
అడుగులో అడుగు వేసుకుంటూ అతన్ని బస్సు దగ్గరకు తీసుకువచ్చి దగ్గరుండి జాగ్రత్తగా ఎక్కించింది. ఈ ఘటన ఆమె కరుణామయ హృదయాన్ని చాటిచెప్పడమే కాదు.. అందరి కనీస ధర్మాన్ని గుర్తు చేసింది. పెద్దలను గౌరవించడమే కాకుండా, వారికి చిన్నచిన్న సహాయాలు చేయడం మన బాధ్యత అని చెప్పకనే చెబుతోంది. కేరళలో చోటు చేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియోను ఐపీసీ అధికారి విజయ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఆమె దయాగుణానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. (ఇల్లు ఖాళీ చెయ్)
Comments
Please login to add a commentAdd a comment