భర్తతో స్నేహితురాలిపై అత్యాచారం చేయించిన భార్య | Woman, husband arrested over rape charge | Sakshi
Sakshi News home page

భర్తతో స్నేహితురాలిపై అత్యాచారం చేయించిన భార్య

Aug 16 2014 9:53 PM | Updated on Jul 10 2019 7:55 PM

ఓ యువతి ఇంటిపక్కన నివసించే స్నేహితురాలిని తన సమక్షంలోనే భర్తతో అత్యాచారం చేయించింది.

బెంగళూరు: ఓ యువతి ఇంటిపక్కన నివసించే స్నేహితురాలిని తన సమక్షంలోనే భర్తతో అత్యాచారం చేయించింది. బెంగళూరులో జరిగిన ఈ సంఘటనలో పోలీసులు భార్యాభర్తలను ఆరెస్ట్ చేశారు.

అత్యాచారం చేయించిన యువతి, బాధితురాలు చాలా కాలంగా స్నేహితురాళ్లని, ఒకరి ఇంటికి మరొకరు వెళ్లేవారని పోలీసులు తెలిపారు. అయితే గత నెలలో ఆ యువతి తాను చూస్తుండగా భర్తతో శృంగారంలో పాల్గొనాలని స్నేహితురాలిని ఒత్తిడి చేసినట్టు చెప్పారు. అంగీకరించకుంటే తన భర్త చంపేస్తాడని స్నేహితురాలిని బెదిరించి దారుణానికి ఒడిగట్టింది. 15 రోజుల తర్వాత ఆమె మరోసారి బెదిరించడంతో.. బాధితురాలు తన భర్తకు విషయాన్ని చెప్పింది. వీరిద్దరూ పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement