ముంబై: మహారాష్ట్రలో ఆలయాల్లోకి మహిళలను అనుమతించకపోవడం ఇకపై కుదరదు. పూజా స్థలాల్లోకి వెళ్లడం అందరి ప్రాథమిక హక్కు అని, దాన్ని ప్రభుత్వం పరిరక్షించాలని హైకోర్టు పేర్కొంది. శతాబ్దాల నుంచి ఉన్న సంప్రదాయానికి చరమగీతం పాడుతూ, లింగ వివక్షకు పుల్‌స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. శనిశింగ్నాపూర్ లాంటి ఆలయ గర్భగుడిలోకి మహిళలను అనుమతించకపోవడాన్ని చేసిన పిల్‌ను పరిష్కరిస్తూ తీర్పు చెప్పింది. ఆలయంలోకి రాకుండా అడ్డుకుంటే వారికి 6 నెలల శిక్ష విధించేలా చట్టం ఉంది.