fundamental right
-
సత్వర విచారణ నిందితుడి ప్రాథమిక హక్కు: సుప్రీం
న్యూఢిల్లీ: కేసుల్లో వేగంగా విచారణ జరగడం, కోర్టు నుంచి సాధ్యమైనంత త్వరగా తీర్పు పొందడం నిందితుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అండర్ ట్రయల్స్‌ను నిరవధికంగా నిర్బంధంలో ఉంచడం సరికాదని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పంకజ్ మిత్తల్‌ల ధర్మాసనం పేర్కొంది. బిహార్‌లో నాలుగేళ్లకు పైగా కస్టడీలో ఉన్న వ్యక్తికి శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణ ఇప్పట్లో పూర్తయే అవకాశం కనిపించడం లేదు గనుక బెయిలిస్తున్నట్టు వెల్లడించింది. -
గాలిలో దీపాలైన ప్రాథమిక హక్కులు!
అన్య మార్గాలలో సాధించిన ‘బ్రూట్ మెజారిటీ’ ద్వారా కోర్టు చెప్పినా పాటించకపోవడం పాలకులకు ‘కూసు విద్య’గా మారింది. లౌకిక రాజ్యాంగ చట్టంలో ప్రజలకు కల్పించామని చెప్పిన పౌర ప్రాథమిక హక్కులు అమలు జరగని పరిస్థితి తలెత్తింది. చివరికి పౌర ప్రాథమిక హక్కు అయిన ‘జీవించే హక్కు’ను ఉన్నత న్యాయస్థానం రక్షించే వరకూ గతి లేని పరిస్థితిని కల్పించి సంకీర్ణ ప్రభుత్వాలు పాలన చలాయిస్తూ వచ్చాయి. ఫలితంగా ప్రజల ప్రాథమిక పౌరహక్కులు సైతం నేడు ‘గాలిలో దీపాలు’గా మారాయి. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన సెక్యులర్ వ్యవస్థకు బదులుగా పాలనా రథాన్ని కుల, మతాలపై ఆధారపడి కాపాడుకోవడానికి పార్టీలు, వాటి సంకీర్ణ పాలనా కూటములు అధికారాన్ని దుర్వినియోగం చేయడానికీ వెనుకాడట్లేదు. ‘‘ప్రపంచంలో తలెత్తుతూ వచ్చిన గొప్ప గొప్ప విప్లవాలన్నింటికీ గొప్పగొప్ప మహాను భావులు కారకులనుకుంటాం. కానీ, వాస్తవానికి ప్రపంచ మహా విప్లవా లకు కారకులు, నాయకత్వం వహించిందీ ప్రజలేనని మరచిపోరాదు. ఇదే నిజమైన మన ఉమ్మడి హైందవ సంస్కృతి కూడా!’’ – ఎరవాడ కేంద్ర కారాగారంలో బందీగా ఉన్న గాంధీజీ ప్రకటన 17.1.1931 ‘‘ఇండియాలో ప్రజా బాహుళ్యాన్ని స్వతంత్రంగా ఆలోచింపనివ్వరు. ఆ స్వేచ్ఛను వారికి దక్కనివ్వరు. ఇది అత్యంత అవమానకర పరిణామం. అందుకే కిరాతకులు ప్రజల్ని చూసి భయపడరు. దయార్ద్ర హృదయులమనుకునే వారికి తెగింపు తక్కువ, తెలివి గలవాళ్లమనుకొనే వాళ్ళు ఎవరెటు పోతే మనకెందుకు లెమ్మని నిర్లిప్తంగా ఉండిపోతారని విలియం మోరిస్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు.’’ – భారత లౌకిక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రజల బతుకులు నేడు ‘ఎండమావుల్లో’ తచ్చట్లాడుతున్నాయి. దీనిక్కారణం – ఏదో ఒక ‘రాజ్యమైతే’ ఉంది గానీ దాని ముక్కు ముఖమూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నలభై ఏళ్లలో అలా అలా ఉన్నప్పటికీ తర్వాతి నుంచీ మెరుగవలేదు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు, వాటి అతుకుల బొంత సంకీర్ణ మంత్రివర్గాలు పాలనకు వచ్చాయి. ఆ వర్గాలు దేశంలో పౌరహక్కుల్ని, ‘భారత ప్రజలమైన మేము’ అన్న సంకల్ప ప్రకటనను ఆచరణ నుంచే గాదు, లౌకిక వ్యవస్థ నుంచే తప్పించేశాయి. ఏనాడైతే ఓహ్రా రిపోర్టు కేంద్ర పాలనా వ్యవస్థలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక చర్యలను బహిర్గతం చేసిందో ఆనాడే ప్రజల లిఖిత పూర్వక సంకల్పానికి చేటు మూడింది. ఓహ్రా రిపోర్టును సమర్థిస్తూ ఆనాడే సుప్రీంకోర్టు ‘‘ప్రభుత్వాలు, పాలకులూ ఎలా పాలన సాగిస్తున్నారో తెలుసుకునే సంపూర్ణ హక్కు ప్రజలకు ఉందని’’ నిర్మొహమాటంగా తీర్పు చెప్పిందని మరచిపోరాదు. అయితే విచిత్రమేమంటే, ఇదే లౌకిక రాజ్యాంగ చట్టం ద్వారా ఆ చట్టంలో దేశ ప్రజలకు కల్పించామని చెప్పిన పౌర ప్రాథమిక హక్కులు (21వ అధికరణ నుంచి 45వ అధికరణ వరకూ) అమలు జరగని పరిస్థితి తలెత్తింది. చివరికి 21వ పౌర ప్రాథమిక హక్కు అయిన ‘జీవించే హక్కు’ ఉన్నత న్యాయస్థానం దయదలచి రక్షించే వరకూ గతి లేని పరిస్థితిని కాంగ్రెస్ – బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలు కల్పించి పాలన చలాయిస్తూ వస్తున్నాయి. ఈ పాలకుల తతంగమంతటికీ కీలకమైన పునాది... ఉత్తరప్రదేశ్‌లోని 80 పార్లమెంట్ సీట్లపై పట్టు సాధించడం ద్వారా కేంద్రంలో తిష్ఠ వేయగల ఎత్తుకు పాలకులు ఈ క్షణం దాకా అలవాటు పడి ఉండటం! పైగా ఈ 80 పార్లమెంట్ స్థానాలను గుప్పిట్లో పెట్టుకొని ఉత్తర – దక్షిణ – తూర్పు భారత రాష్ట్రాల ప్రయోజనాల్ని దెబ్బ తీయడానికి వారు వెనుకాడటం లేదు. ఇందుకు రాష్ట్రపతి స్థాయిని కూడా దిగజార్చడానికి జంకడం లేదు. ఆ మాటకొస్తే తొల్లింటి భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ తర్వాత గవర్నర్ల ప్రతిపత్తిని కాపాడే బాధ్యతను కూడా కాంగ్రెస్ – బీజేపీ పాలకులు, వారి సంకీర్ణ మంత్రి వర్గాలు దిగజార్చుతూ వచ్చాయి. ఫలితంగా ప్రజల ప్రాథమిక పౌర హక్కులు సైతం నేడు ‘గాలిలో దీపాలు’గా మారాయి. క్రమంగా దేశంలో రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన సెక్యులర్ (కులాతీత, మతాతీత) వ్యవస్థకు బదులుగా పాలనా రథాన్ని కుల, మతాలపై ఆధారపడి కాపాడు కోవడానికి ఈ రెండు రాజకీయ పార్టీలు, వాటి సంకీర్ణ పాలనా కూటములు లౌకిక రాజ్యాంగ ప్రతిపత్తిని, అధికారాన్ని భ్రష్టు పట్టిస్తూ వచ్చాయి. కనుకనే, ఈ పౌరుల ప్రాథమిక హక్కుల్ని (జీవించే హక్కు, ప్రశ్నించే హక్కు సహా) ఉభయ కూటముల పాల కులు అమలు చేయించాల్సిన బాధ్యతల (డ్యూటీస్)ను ఆచరణలో పక్కకు నెట్టేశాయి. ఇందులో భాగంగానే, రాజ్యాంగం ప్రాథమిక బాధ్యతగా గుర్తించిన ‘పత్రికా స్వేచ్ఛ రక్షణ’కు (అధికరణం 19(1) (2)కు) తనకు తోచినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తూ ప్రతిబంధకాలు కల్పిస్తూ వచ్చాయి ఈ రెండు రాజకీయ కూటములూ! పౌరహక్కుల రక్షణకై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జీవన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి రంగంలోకి దిగి మాడు పగిలిపోయే తీర్పులు ఇచ్చే వరకూ అంబేడ్కర్ ఆశించిన లౌకిక రాజ్యాంగ విలువలకు న్యాయం నానాటికీ దూరమవుతూ వచ్చింది. అందుకే నెహ్రూ హయాంలోనే గాడి తప్పుతూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి, నెహ్రూ మంత్రివర్గం నుంచి రాజీనామా చేస్తూ డాక్టర్ అంబేడ్కర్ లౌకిక రాజ్యాంగ వ్యవస్థకు క్రమేణా దూరమ వుతున్న భారత పార్లమెంటరీ వ్యవస్థను ఉత్తరోత్తరా భారత ప్రజలు కూల్చివేసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ బయటికి రావలసి వచ్చింది. ఆ తరువాతనే ఆయన ఉత్తరాది పాలకుల ‘80 సీట్ల’ నాట కానికి విరుగుడుగా దక్షిణ భారత రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని ప్రకటించాల్సిన అవసరాన్ని పదే పదే చాటుతూ వచ్చారని మరచి పోరాదు. ఇప్పుడు కోర్టు ధిక్కార నేరాలకు, అన్య మార్గాల ద్వారా సాధించిన ‘బ్రూట్ మెజారిటీ’ ద్వారా పాల్పడడం పాలకులకు ‘కూసు విద్య’గా మారింది. చివరికి ఒక ఖైదీ మరణశిక్షను సైతం సుప్రీంకోర్టు ‘రాజ్యాంగ విరుద్ధం’గా (1980) ప్రకటించింది. ఆదివాసీల భూమి హక్కుల్ని సుప్రీం కోర్టు 1983లోనే రక్షిస్తూ తీర్పు చెప్పినా ఇప్పటికీ పాలకులు తీర్పును ఉల్లంఘిస్తూనే ఉన్నారు, మోతుబరులకు రక్షణ కల్పిస్తున్నారు. రానురాను ఇక రాజ్యమంటే వ్యాపార దిగ్గజాలదిగా ప్రజల్ని అర్థం చేసుకోమంటున్నారు పాలకులే బాహాటంగా! చివరికి మహిళా క్రీడాకారుల్ని వేధించి, అవమానించిన వాళ్ళు పాలక పక్షానికి చెందిన వారైతే శిక్షార్హులు కాకుండా తప్పించుకోగల్గుతున్నారు. మణి పుర్లో ఉనికికి సంబంధించి రెండు జాతుల మధ్య (మైతేయి – కుకీ) ఏర్పడిన తగాదాను ఆసరా చేసుకుని ఒక జాతిని అణచడానికి పాల కులే నడుం కట్టడం స్వార్థ రాజకీయం. గాంధీజీని చంపినవాళ్ళు గాంధీ చాటున దాగి, తిరిగి రాజకీయాలు చలాయించాలని చూడడం కన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉంటుందా?! ఇలాంటి స్థితిని గుర్తు చేస్తూ మహాకవి జాషువా ఏమన్నాడో ఒక్కసారి మరొక్కసారి చెవులారా విందాం: ‘‘ఒకడు రుద్రాక్ష మాలికలు నెత్తికి చుట్టి శివమూర్తిౖయె భూమి కవతరించు ఒక డూర్ధ్వపుండ్రంబు లురువుగా తగిలించి శివలింగమును జూచి చీదరించు ఒకడు రెండునుగాని వికట వేషము దాల్చి పైవారి మీద సవాలు చేయు ఒకడు గంజాయి దమ్ముకు దాసుడైపోయి బూడిద గురవడై పుట్టి వచ్చు మనుజులార మాది ఘనమైన మతమని ఒకడు తరిమి తరిమి ఉగ్గిడించు పెక్కు మతములిట్లు పేచీలు సాగింప మార్గమేది ఐకమత్యమునకు చిలిపి రాళ్ళకు నగిషీలు చెక్కిచెక్కి కాలమెంత యుగాంతాన గలిపిరొక్కొ చదువ నేర్చిన వెర్రిని చంపగలరె ఒక్క బుద్ధుడు, ఒక్క క్రీస్తు, ఒక్క గాంధి?’’! abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకీయులు -
LGBTQI: అసహజమేనా!.. స్వలింగ సంపర్కంపై మారుతున్న దృక్కోణం
స్వలింగ సంపర్కం. అసహజ లైంగిక ప్రవృత్తి. ఇది కొత్తదేమీ కాదు. ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే అన్ని సమాజాల్లోనూ, అన్ని కాలాల్లోలోనూ అనివార్యంగా కన్పించే ధోరణే. కానీ కొన్ని దశాబ్దాల క్రితం దాకా దీనికి సమాజం ఆమోదం లేదు. సరికదా, ఇందుకు పాల్పడే వారిని దోషుల్లా పరిగణిస్తూ హీనంగా చూసే ధోరణే చాలా సమాజాల్లో ఉండేది. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఆస్కార్ వైల్డ్‌ను కూడా గే సెక్స్‌కు పాల్పడ్డారంటూ జైల్లో పెట్టారు! అత్యంత ప్రగతిశీల దేశంగా చెప్పుకునే ఇంగ్లండ్‌లో కూడా వందేళ్ల క్రితం ఇదీ పరిస్థితి! ఇప్పటికీ ఐరాస సభ్య దేశాల్లో 76కు పైగా స్వలింగ సంపర్కులపై వివక్షపూరితమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. అయితే గత పాతికేళ్లుగా ఈ విషయంలో పౌర సమాజం దృక్కోణంలో చెప్పుకోదగ్గ మార్పు కన్పిస్తోంది. లైంగిక ప్రవృత్తి విషయంలో స్వేచ్ఛ కూడా ప్రాథమిక హక్కు వంటిదేనన్న వాదనలూ బయల్దేరాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో ఈ సంబంధాలకు సమర్థన 1990ల్లో 20 శాతం లోపే ఉండగా 2020 నాటికి 70 శాతానికి పైగా పెరిగింది! తాజాగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ అధ్యక్షుడు బైడెన్ సంతకం కూడా చేశారు. ఐక్యరాజ్యసమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు, హక్కుల సంఘాలు కూడా స్వలింగ సంపర్కానికి, ఆ వివాహాలకు కొన్నేళ్లుగా ఎంతగానో మద్దతిస్తున్నాయి. స్వలింగ వివాహాలను తొలిసారిగా 2000లో నెదర్లాండ్స్ చట్టబద్ధం చేసింది. ఆ తర్వాత ఇప్పటిదాకా 34 దేశాల్లో చట్టపరంగానో, కోర్టు ఆదేశాల రూపేణో అందుకు ఆమోదం లభించింది. ఐరాస సభ్య దేశాల్లో భారత్‌తో పాటు మొత్తం 71 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేరాల జాబితా నుంచి తొలగించాయి. ఆసియా దేశాల్లో... దక్షిణ, మధ్య ఆసియాతో పాటు ఆఫ్రికాలోని పలు దేశాల్లో స్వలింగ సంపర్కం, వివాహాలపై తీవ్ర వ్యతిరేకత, నిషేధం అమల్లో ఉన్నాయి. ఆసియాలో ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా తైవాన్ నిలిచింది. అలాగే చైనా కూడా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం లేదు. అయితే వారి వివాహాన్ని మాత్రం నేరంగానే చూస్తోంది. వియత్నాం కూడా ఇవి నేరం కాదని పేర్కొన్నా ఇంకా పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించలేదు. ఆ దేశాల్లో మరణశిక్షే... సౌదీ అరేబియా, సుడాన్, యెమన్, ఇరాన్‌ల్లో స్వలింగ సంపర్కానికి పాల్పడితే మరణశిక్షే! నైజీరియా, సోమాలియాల్లోనూ కొన్ని ప్రావిన్సుల్లో ఇదే పరిస్థితి! అసహజ రతి, వివాహేతర సంబంధాలతో పాటు స్వలింగ సంపర్కులను కూడా రాళ్లతో కొట్టి చంపే శిక్షలు అరబ్ దేశాలతో పాటు పలు ఇరత దేశాల్లో అమల్లో ఉన్నాయి. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, యూఏఈ, ఖతార్ వంటి దేశాల్లోనూ ఇందుకు మరణశిక్ష విధించే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రూనై మాత్రం స్వలింగ సంపర్కాలకు మరణశిక్ష అమలు చేయబోమని ప్రకటించడం విశేషం. భారత్‌లో పరిస్థితి? మన దేశంలో ఆది నుంచీ స్వలింగ సంపర్కంపై చిన్నచూపే ఉంటూ వచ్చింది. బ్రిటిష్ వారి హయాంలో దీనిపై నిషేధం విధించారు. సుప్రీంకోర్టు కూడా ఇది ప్రకృతి విరుద్ధమని, శిక్షార్హమైన నేరమేనని 2013లో తీర్పు చెప్పింది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నాన్ బెయిలబుల్ నేరం. దీనికి పదేళ్ల దాకా జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం ఎంతమాత్రమూ నేరం కాదని పేర్కొంటూ 2018లో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఉన్న దేశాలు చిలీ, స్విట్జర్లాండ్, కోస్టారికా, ఈక్వెడార్, తైవాన్, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, మాల్టా, జర్మనీ, కొలంబియా, అమెరికా, గ్రీన్లాండ్, ఐర్లండ్, ఫిన్లండ్, లగ్జెంబర్గ్, స్కాట్లండ్, ఇంగ్లండ్, బ్రెజిల్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఉరుగ్వే, డెన్మార్క్, అర్జెంటీనా, పోర్చుగల్, ఐస్లాండ్, స్వీడన్, మెక్సికో, నార్వే, దక్షిణాఫ్రికా, స్పెయిన్, కెనడా, బెల్జియం, నెదర్లాండ్స్, తైవాన్ ఏమిటీ ఎల్జీబీటీక్యూఐ? ► రకరకాల అసహజ లైంగిక ప్రవృత్తులున్న వారందరినీ కలిపి ఎల్జీబీటీక్యూఐ అని వ్యవహరిస్తుంటారు. ► ఇది లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్, ఇంటర్ సెక్స్‌కు సంక్షిప్త నామం. ► ఇద్దరు మహిళల మధ్య ఉండే లైంగికాసక్తి లెస్బియనిజం. ఇలాంటివారిని లెస్బియన్‌గా పిలుస్తారు. అదే పురుషుల మధ్య ఉంటే వారిని గే అంటారు. ► సందర్భాన్ని బట్టి ఎవరి మీదనైనా ఆకర్షణ చూపేవారు బై సెక్సువల్. ► ఇక పుట్టినప్పుడు ఆడ/మగగా ఉండి, పెరిగి పెద్దయ్యాక అందుకు భిన్నంగా మారేవారిని/మారేందుకు ఆసక్తి చూపేవారిని ట్రాన్స్‌జెండర్/ట్రాన్స్ సెక్సువల్ అంటారు. అంటే తృతీయ ప్రకృతులన్నమాట. మన దగ్గర హిజ్రాలుగా పిలిచేది వీరినే. దేశవ్యాప్తంగా వీరికి రకరకాల పేర్లున్నాయి. మళ్లీ వీరిలో చాలా రకాల వారుంటారు. ఉదాహరణకు మగ పిల్లాడిగా పుట్టి కూడా తనను తాను అమ్మాయిగా భావించుకుంటూ మరో అబ్బాయిని ఇష్టపడేవాళ్లు ఈ కోవలోకే వస్తారు. ఇలాంటివారిని హెటిరో సెక్సువల్ ట్రాన్స్‌జెండర్ అంటారు. ► క్యూ అంటే క్వీర్. వీరికి తాము ఆడా, మగా, ట్రాన్స్‌జెండరా, మరోటా అన్నదానిపై వాళ్లకే స్పష్టత ఉండదు. అందుకే వీరిని క్వశ్చనింగ్ అని కూడా అంటూంటారు. ► చివరగా ఇంటర్‌సెక్స్. అంటే పుట్టినప్పుడు జననాంగాల స్థితిగతులను బట్టి ఆడో, మగో చెప్పలేనివారు. మళ్లీ వీరిలోనే క్రాస్డ్రెస్సర్స్ అనీ, మరోటనీ పలు రకాలున్నాయి. ► ఎల్జీబీటీక్యూఐ మొత్తాన్నీ కలిపి ఇటీవల కామన్‌గా గే గా వ్యవహరిస్తున్నారు. ► వీరు తమ ఆకాంక్షలకు ప్రతీకగా తరచూ ఆరు రంగులతో కూడిన జెండాను ప్రదర్శిస్తుంటారు. కొన్నేళ్లుగా ఈ జెండా ఒకరకంగా ఎల్జీబీటీక్యూఐ హక్కుల ఉద్యమానికి ప్రతీకగా మారిపోయింది. అమెరికాలో స్వలింగ వివాహాలు ఇక చట్టబద్ధం బిల్లుపై సంతకం చేసిన అధ్యక్షుడు జో బైడెన్ వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మంగళవారం మధ్యాహ్నం వేలాది మంది వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. స్వలింగ వివాహాలకు వీలు కల్పించే బిల్లు చట్టరూపం దాల్చడమే వారి ఆనందానికి కారణం. అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) ఉభయ సభల్లో ఇప్పటికే ఆమోదం పొందిన స్వలింగ వివాహాల(గే, లెస్బియన్ మ్యారేజెస్) బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దీంతో బిల్లు ఇక చట్టంగా మారింది. ఈ చట్టం సమాజంలో పలు రూపాల్లో ఉన్న ద్వేషాలకు ఒక ఎదురుదెబ్బ అని బైడెన్ అభివర్ణించారు. ప్రతి ఒక్క అమెరికన్‌కు ఇది చాలా ప్రాధాన్యం అంశమని అన్నారు. బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేసే కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని పోరాటం చేసిన వారికి ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ కృతజ్ఞతలు తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్వలింగ వివాహం: షాకిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: ఒకే జెండర్ వారి మధ్య జరిగే వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తిస్తూ.. చట్టబద్దత కల్పించాలని కోరుతూ ఢిల్లీ హై కోర్టులో దాఖలైన పిటిషన్‌ని కేంద్రం వ్యతిరేకించింది. అతి పెద్ద శాసన చట్రం కేవలం స్త్రీ, పురుషుల మధ్య జరిగే వివాహాలను మాత్రమే గుర్తిస్తుందని స్పష్టం చేసింది. వ్యక్తిగత చట్టాలు కూడా ఇలాంటి వివాహాలనే గుర్తిస్తాయని.. వీటిలో తల దూర్చితే భారీ వినాశనం తప్పదని హెచ్చరించింది. అంతేకాక ‘‘వివాహం అనేది ఓ ప్రైవేట్ కాన్సెప్ట్ కాదని.. స్వంత ప్రజా ప్రాముఖ్యత కలిగిన సామాజికంగా గుర్తింపు పొందిన వ్యవస్థ అని కేంద్రం తెలిపింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని సెక్షన్ 377 యొక్క డిక్రిమినలైజేషన్ ఉన్నప్పటికీ, పిటిషనర్లు స్వలింగ వివాహాన్ని ప్రాథమిక హక్కుగా పొందలేరు’’ అని సెంటర్ అఫిడవిట్లో పేర్కొంది. జెండర్‌తో సంబంధం లేకుండా ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య జరిగే వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తించాల్సిందిగా కోరుతూ.. గే, లెస్బియన్ కమ్యూనిటీకి చెందిన నలుగరు ఢిల్లీ హై కోర్టు ను ఆశ్రయించారు. జస్టిస్ రాజీవ్ సహై ఎండ్లా, అమిత్ బన్సాల్ ధర్మాసనం ఈ విజ్ఞప్తిపై కేంద్రం స్పందనని కోరింది. దీనిపై కేంద్రం బదులిస్తూ.. ‘‘భారతీయ సమాజంలో వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను కలిపే ప్రకియ కాదు.. స్త్రీ, పురుషుల మధ్య బంధాన్ని ఏర్పరిచే వ్యవస్థ. కనుక స్వలింగ సంపర్కుల మధ్య జరిగే వివాహాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అని వెల్లడించింది. ఈ విషయంలో న్యాయపరంగా జోక్యం చేసుకుంటే ‘‘వ్యక్తిగత చట్టాల సున్నితమైన సమతుల్యత పూర్తి నాశనానికి కారణమవుతుంది’’ అని అభిప్రాయపడింది. భర్త అంటే బయోలాజికల్‌గా పురుషుడు.. భార్య అంటే కేవలం మహిళ మాత్రమే. కనుక ఒకే లింగ వారి మధ్య జరిగే వివాహాలను సమర్థించం అని కేంద్రం తెలిపింది. చదవండి: అంతా ఒక్కటే.. నో ఆడ, నో మగ, నో ట్రాన్స్‌జెండర్ ‘నువ్వు నిజమైన అమ్మాయివి కాదు కదా’ -
చట్టాలకు బ్రేకులేయండి
న్యూఢిల్లీ/చండీగఢ్ : అహింసాయుతంగా నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని సుప్రీంకోర్టు గురువారం ఉద్ఘాటించింది. రైతు సమస్యల పరిష్కారానికి వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలతో ‘నిష్పాక్షిక, స్వతంత్ర’ కమిటీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో.. మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. రైతుల నిరసన తెలిపే హక్కును హరించకూడదని సూచించింది. అయితే, నిరసన ప్రదర్శన అనేది ఇతరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదని, ఎవరికీ ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగరాదని పేర్కొంది. పౌరులు స్వేచ్ఛగా తిరుగాడే, ఇతర సదుపాయాలు పొందే హక్కులకు అడ్డంకి కాకూడదని న్యాయస్థానం అభిప్రాయపడింది. నిరసన తెలిపే హక్కు అంటే అర్థం నగరంలోని రోడ్లన్నీ మూసివేయడం కాదని తేల్చిచెప్పింది. ఇప్పటికిప్పుడు వ్యవసాయ చట్టాల ప్రామాణికత ప్రధానం కాదని స్పష్టం చేసింది. రైతులు చర్చలకు ముందుకు రాకుండా ఆందోళన కొనసాగిస్తున్నంత మాత్రాన ఫలితం ఉండదని, రైతాంగం డిమాండ్లు నెరవేరాలంటే చర్చలు తప్పనిసరి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే పేర్కొన్నారు. ఇతరుల హక్కులకు భంగం వాటిల్లకుండా నిరసనలను నిరోధించే హక్కు పోలీసులకు, అధికారులకు ఉందని గుర్తు చేశారు. జరుగుతున్న పరిణామాలు బాధాకరం రైతు ఆందోళనలకు సంబంధించిన అన్ని వాదనలు, రైతు సంఘాల అభిప్రాయాలను విన్న తరువాత, అలాగే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేసిన తరువాత మాత్రమే రైతు సమస్య పరిష్కారానికి కమిటీ నియమిస్తామని జస్టిస్ బాబ్డే నేతృత్వంలో ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మేము కూడా భారతీయులమే. రైతుల దయనీయ స్థితి గురించి ఆందోళన చెందుతున్నాం. జరుగుతున్న పరిణామాల పట్ల కలవర పడుతున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేస్తే రైతులు చర్చలకు ముందుకు రారని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాలను నిలిపివేయాలని తాము కోరడం లేదని, రైతులు చర్చలకు ముందుకు వచ్చేందుకు వీలుగా తాత్కాలికంగా వాటి అమలును వాయిదా వేయాలని కోరుతున్నట్టు ధర్మాసనం తెలిపింది. రైతు సంఘాలు, నిపుణులతో కమిటీ భారీ సంఖ్యలో రైతులను నగరంలోకి అనుమతిస్తే వారు హింసకు పాల్పడరని ఎవరు హామీ ఇవ్వగలరు? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ హింస జరిగితే కోర్టు అడ్డుకోలేదని, అది కోర్టు పనికాదని గుర్తుచేసింది. పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత పోలీసులు, ఇతర అధికారులపై ఉంటుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వంతో చర్చలు జరపకపోతే నిరసన ఉద్దేశం నెరవేరదని భారతీయ కిసాన్ యూనియన్(భాను)ని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ప్రతినిధులు, రైతు సంఘాలతో పాటు పాలగుమ్మి సాయినాథ్ లాంటి నిపుణులను కమిటీలో నియమించనున్నట్లు వెల్లడించింది. ఆగిన మరో అన్నదాత గుండె సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న మరో రైతు గుండె ఆగిపోయింది. టిక్రీ బోర్డర్లో పంజాబ్‌కు చెందిన 38ఏళ్ల రైతు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. మరణించిన రైతును భటిండా జిల్లాకు చెంది న జై సింగ్‌గా గుర్తించారు. జై సింగ్ కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉ ద్యోగం ఇవ్వాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. నరేంద్రసింగ్ తోమర్ బహిరంగ లేఖ రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని కేం ద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. ఆయన తాజాగా రైతులకు బహిరంగ లేఖ రాశారు. చిన్న, సన్నకారు రైతాంగం ప్రయోజనాల కోసమే కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్లు పునరుద్ఘాటించారు. అభ్యంతరాలుంటే చర్చలకు ముందుకు రావాలని కోరారు. తోమర్ లేఖను అందరూ చదవాలని ప్రధాని మోదీ కోరారు. చట్టాల ప్రతులు చింపిన కేజ్రీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. తాను రైతాంగానికి ద్రోహం చేయలేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కొత్త చట్టాల ప్రతులను అసెంబ్లీలో చించివేశారు. ఈ చట్టాలు బీజేపీ ఎన్నికల నిధుల కోసమే తప్ప రైతుల ప్రయోజనం కోసం కాదని ఆరోపించారు. ‘‘గడ్డకట్టే చలిలో, కేవలం రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య రోడ్లపైనే నా దేశ రైతాంగం నిద్రిస్తుంటే, వారికి నేను ద్రోహం చేయలేను. తొలుత నేను ఈ దేశ పౌరుడిని, ఆ తరువాతే ముఖ్యమంత్రిని’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిరసన ఉద్యమంలో ఇప్పటికే 20 మంది రైతులు మరణించారని, ఇంకెప్పుడు మేల్కొంటారని కేంద్రాన్ని ప్రశ్నించారు. మంత్రులతో అమిత్ భేటీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం పలువురు సహచర మంత్రులతో భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్లతో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. రైతుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు అవగాహనా కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.బీజేపీ శ్రేణులు ఎంతవరకు రైతాంగాన్ని చేరగలిగారనే అంశంపై సమీక్షించినట్టు తెలుస్తోంది. -
ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు కాదు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సౌకర్యం ప్రాథమిక హక్కు అనే అపోహను తొలగించాల్సిన అవసరం ఉందని కేంద్రం తెలిపింది. ఇంటర్నెట్ హక్కుతోపాటు దేశ భద్రతా చాలా ముఖ్యమైన విషయమేనని గుర్తించాలంది. కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, న్యాయశాఖల మంత్రి రవిశంకర్ గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ.. ‘ఇంటర్నెట్ ద్వారా భావాలు, అభిప్రాయాలను తెలుసుకోవడం భావవ్యక్తీకరణ హక్కులో ఒక భాగం. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. కశ్మీర్లో హింస, ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు పాక్ ఇంటర్నెట్ను దుర్వినియోగం చేస్తోందంటూ ఆయన.. ఇంటర్నెట్తోపాటు దేశ భద్రత ముఖ్యమైందేనని అందరూ గుర్తించాలన్నారు. దీనిపై రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ నేత గులామ్ నబీ ఆజాద్ అనుబంధ ప్రశ్నకు సమాధానంగా మంత్రి..‘కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయిన మీరు ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ దుర్వినియోగం అవుతోందని మీకూ తెలుసు’ అని వ్యాఖ్యానించారు. ఇంటర్నెట్పై విధించిన ఆంక్షలను సమీక్షించి సడలించేందుకు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో కమిటీలు పనిచేస్తున్నాయని వివరించారు. కశ్మీర్లో, లడాఖ్‌ల్లో ప్రభుత్వం, బ్యాంకింగ్, పర్యాటకం, ఈ కామర్స్, రవాణా, విద్య తదితర రంగాలకు సంబంధించిన 783 వెబ్సైట్లపై ఎటువంటి నియంత్రణలు లేవన్నారు. ‘నెట్’దుర్వినియోగానికి ఆయా సంస్థలదే బాధ్యత ఇతరుల గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా అశ్లీల వీడియాలు, చిత్రాలను ఉంచడం, పుకార్లు వ్యాపింప జేయడం, హింసను ప్రేరేపించడం వంటి వాటికి యూట్యూబ్, గూగుల్, వాట్సాప్ తదితర సామాజిక వేదికలను వాడుకోవడం ఆందోళన కలిగిస్తోందని రవిశంకర్ అన్నారు. ఇందుకు గాను ఆయా సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వాట్సాప్‌కు సంబంధించి.. అందులోని సమాచారం మూలాలను తెలుసుకోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. యూట్యూట్‌లో ఇతరులపై కక్ష తీర్చుకునేందుకు ఉద్దేశపూర్వకంగా ఉంచే అశ్లీల చిత్రాలు, వీడియోలకు సంబంధించి ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. -
ఇంటర్నెట్ ప్రజల ప్రాథమిక హక్కు
సాక్షి /న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సదుపాయంపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ఇంటర్నెట్ ప్రజల ప్రాథమిక హక్కు అని తెలిపింది. వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ఈ–బిజినెస్ నిర్వహించడం ఇటీవల కాలంలో ఇంటర్నెట్ ద్వారా ఎక్కువగా జరుగుతోందని, ఆ సేవల్ని నిరవధికంగా నిలిపివేయకూడదని స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్పై విధించిన ఆంక్షల్ని వారంలోగా సమీక్షించాలని కశ్మీర్ పాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత ఇంటర్నెట్ తదితరాలపై విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ వాక్యాలతో.. ‘‘అది ఒక వైభవోజ్వల మహాయుగం, వల్లకాటి అధ్వాన శకం, వెల్లివిరిసిన విజ్ఞానం, బ్రహ్మజెముడులా అజ్ఞానం, స్వర్గానికి రాచబాట పుచ్చుకున్న జనం నడుస్తున్నారు నరకానికి’’అంటూ చార్లెస్ డికెన్స్ రాసిన రెండు మహానగరాలు(ఏ టెల్ ఆఫ్ టూ సిటీస్) నవలలోని వాక్యాలను జస్టిస్ ఎన్వీ రమణ తన తీర్పులో ఉటంకించారు. భూతల స్వర్గంగా కశ్మీర్ మన హృదయాల్లో నిలిచినప్పటికీ, ఈ అందమైన ప్రాంతపు చరిత్ర హింస, తీవ్రవాదంతో కూడుకొని ఉంది’ అని వ్యాఖ్యానించారు. పౌరుల స్వేచ్ఛను, వారి భద్రతను సమతుల్యం చేయడమే కోర్టుల పని అని ఆయన పేర్కొన్నారు. ‘భావప్రకటనా స్వేచ్ఛ, ఏదైనా వృత్తిని చేపట్టే స్వేచ్ఛ, ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యాపార లావాదేవీలన్నింటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1), ఆర్టికల్ 19(1)(జీ) రక్షణ కల్పిస్తోందని జస్టిస్ ఎన్వీ రమణ తన 130 పేజీల తీర్పులో పేర్కొన్నారు. ప్రాథమిక హక్కుల్ని కాలరాయకూడదు సీఆర్పీసీ 144వ సెక్షన్ ద్వారా జారీ చేసే ఉత్తర్వులు ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తాయని, వాటిపై నిరవ«ధికంగా ఉక్కుపాదం మోపకూడదని ధర్మాసనం పేర్కొంది. ఈ అధికారాన్ని అతిగా వినియోగిస్తే అక్రమాలకు దారితీస్తుందని పేర్కొంది. అత్యవ సర సేవలైన ఆసుపత్రులు, విద్యాసంస్థలతో పాటుగా ప్రభుత్వ వెబ్సైట్లు, ఈ బ్యాంకింగ్ రంగంలో ఇంటర్నెట్ను తక్షణమే పునరుద్ధరించా లని ఆదేశించింది. ఇంటర్నెట్ సౌకర్యం ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించింది. కశ్మీర్లో విదేశీ రాయబారుల పర్యటన జమ్ము: కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా అమెరికా సహా 15 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. అక్కడ వివి«ధ పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల్ని కలుసుకొని మాట్లాడారు. కశ్మీర్ చీఫ్ సెక్రటరీ బీవీఆర్ సుబ్రహ్మణియన్, డీజీపీ దిల్బాగ్ సింగ్‌లతో కూడిన అత్యున్నత స్థాయి బృందం కశ్మీర్ లోయలో పరిస్థితుల్ని దౌత్యవేత్తలకు వివరించింది. పౌర సంఘాల ప్రతిని«ధుల్లో ఎక్కువ మంది తాము ఆర్టికల్ 370కి మద్దతు ఇస్తున్నట్టుగా దౌత్యవేత్తలకు తెలిపారు. భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్‌తో సహా వీరంతా శ్రీనగర్‌లో ఏడు గంటలకు పైగా గడిపారు. మోదీ సర్కార్‌కు పెద్ద ఝలక్ : కాంగ్రెస్ ఇంటర్నెట్ సదుపాయం ప్రజల ప్రాథమిక హక్కు అని తేల్చి చెప్పడం ద్వారా సుప్రీంకోర్టు మోదీ సర్కార్‌కు గట్టి ఝలక్ ఇచ్చిందని కాంగ్రెస్ పేర్కొంది. ప్రజల అసమ్మతి జ్వాలల్ని నిషే«ధాజ్ఞల ద్వారా ఎక్కువ కాలం తొక్కి పెట్టి ఉంచలేరని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. మోదీ సర్కార్ చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సుప్రీం తీర్పు ద్వారా 2020లో తొలి దెబ్బ తగిలిందన్నారు. మొదటిసారిగా సుప్రీంకోర్టు కశ్మీర్ ప్రజల మనోభావాలపై మాట్లాడిందని కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ అన్నారు. -
ఆధార్ లింక్ సంగతేంటి మరీ?
సాక్షి, ముంబై : ఆధార్ కార్డునే అన్నింటికీ ఆధారం చేస్తున్న క్రమంలో వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులకు, మొబైల్ కంపెనీ సిమ్‌లకు ఆధార్ కార్డు లింక్‌పై సందిగ్ధత ఏర్పడింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని పేర్కొన్న సుప్రీంకోర్టు, ఆధార్‌పై అభ్యంతరాలను ప్రస్తావించలేదు. కానీ ఆధార్ విషయంలోనే ఈ వ్యక్తిగత గోప్యత అంశం తెరపైకి వచ్చింది. ఆధార్ కార్డు లింక్ విషయంపై విచారణ సమయంలో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదని కేంద్రం వాదించింది. దీంతో అసలు కేసు మొదలైంది. ఆధార్ విధానం వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తోందంటూ 2015లో సుప్రీంకోర్టును పిటిషనర్లు ఆశ్రయించారు. వీటిపై పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం ప్రజా బాహుళ్యంలో గోప్యత వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయని ఆగస్టు 2న పేర్కొంది. కానీ నేడు వెలురించిన తీర్పులో మాత్రం ఆధార్ గురించి ప్రస్తావించకపోవడం సందిగ్థత పరిస్థితికి దారితీసింది. బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు వంటి వాటికి తప్పనిసరి చేస్తున్న ఆధార్ కార్డు వివరాలు, వ్యక్తిగత గోప్యత కిందకే వస్తాయని పలువురు న్యాయవాదులంటున్నారు. ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ నిబంధనలు తీసుకురావడం అప్రకటిత ఎమర్జెన్సీ కిందకే వస్తుందన్నారు. ఆధార్ అప్‌లోడ్‌తో అన్ని వివరాలు బహిర్గతమవుతాయని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 80 శాతం ఆధార్ కార్డు ప్రక్రియ పూర్తయింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డును లింక్చేసే గడువు ఈ ఏడాది చివరి వరకు ఉండగా... ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేయాలంటే ఆధార్ నెంబర్ ఉండాలనే నిబంధన దాదాపు పూర్తయింది. పాన్ కార్డులకు ఆధార్‌ను లింక్ చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టింది. ఇవన్నీ వ్యక్తిగత గోప్యత కిందకు వస్తాయా? వస్తే ప్రభుత్వం తప్పనిసరి చేస్తున్న ఆధార్ కార్డు వివరాలు మనం ఇవ్వకపోయినా పర్వాలేదా? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఈ పీటముడిపై ఏర్పడిన సందిగ్థతను తొలగించేందుకు ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గోప్యత అనే ప్రాథమిక హక్కును ఆధార్ కార్డు ఉల్లంఘిస్తుందా? అనే దానిపై తీర్పు చెప్పనుంది. -
గోప్యత ప్రాథమిక హక్కే: సుప్రీం కోర్టు
-
గోప్యత ప్రాథమిక హక్కే: సుప్రీం కోర్టు
- తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు గురువారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గోపత్య ప్రాథమిక హక్కేనంటూ ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. వ్యక్తిగత గోప్యత కూడా రాజ్యంగంలోని ఆర్టికల్ 21(జీవించే హక్కు) కిందకు వస్తుందని చెప్పింది. గోప్యతపై తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సీజేఐ జేఎస్ ఖేహర్, న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, జే చలమేశ్వర్, రోహింటన్ నారీమన్, ఆర్కే అగర్వాల్, సంజయ్ కిషన్ కౌల్, ఎస్ఏ బొబ్డే, ఎస్ అబ్దుల్ నజీర్, ఏఎమ్ సప్రేలు ఉన్నారు. మూడు వారాల్లో ఆరు రోజుల పాటు వాదనలు విన్న ధర్మాసనం ఆగష్టు 2న తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డును తప్పని సరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం ప్రజా బాహుళ్యంలో గోప్యత వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశాలూ ఉన్నాయని ఆగస్టు 2న పేర్కొంది. తీర్పు ప్రభావం ఏంటి? ప్రస్తుతం ఆధార్ కార్డు ఆధారంగా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఆధార్ కార్డు వ్యక్తిగత వివరాలను తెలుపుతుంది కనుక సుప్రీం కోర్టు తీర్పుతో ఇకపై ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డును జతచేయాలా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఆధార్ వివరాల ద్వారా వ్యక్తులపై నిఘా పెట్టడం సాంకేతికంగా సాధ్యం కాదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సుప్రీం కోర్టుకు గతంలో చెప్పింది. ఈ పీటముడిపై సంగ్ధితను తొలగించేందుకు ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గోప్యత అనే ప్రాథమిక హక్కును ఆధార్ కార్డు ఉల్లంఘిస్తుందా? అనే దానిపై విచారణ జరిపి తీర్పు చెప్పనుంది. -
వందేమాతరం ప్రాథమిక హక్కా!
న్యూఢిల్లీ: తమిళనాడులోని అన్ని పాఠశాలలో జాతీయ గీతం ‘వందేమాతరం’ను వారానికోసారైనా ఆలపించాలని, అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో నెలకోసారైనా పాడాలని మద్రాస్ హైకోర్టు మంగళవారం నాడిచ్చిన సంచలన తీర్పుపై న్యాయనిపుణులే అవాక్కవుతున్నారు. ఈ తీర్పుకు, ఈ తీర్పుకు దారితీసిన పిటిషన్‌కు ఎలాంటి సంబంధం లేకపోవడమే అందుకు కారణం. వందేమాతరం గీతాన్ని ముందుగా ఏ భాషలో రాశారంటూ ఓ ఉద్యోగ నియామక పరీక్షల్లో అడిగిన ప్రశ్నకు తాను ‘బెంగాలీ భాషలో’ అంటూ సరైన సమాధానం ఇచ్చినప్పటికీ తనకు మార్కులు పడలేదంటూ ఓ నిరుద్యోగి పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు జడ్జీ మురళీధరన్ పిటిషన్‌తో సంబంధం లేకుండా తీర్పు చెప్పారు. పౌరులుగా జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను గౌరవించడం అందరి బాధ్యతని, అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, క్రీడా మైదానాల్లో విధిగా జాతీయ గీతాన్ని ఆలపించాలని, దీన్ని వివిధ వర్గాల ప్రజలు పాటించాలని ఆయన తీర్పు చెప్పారు. రాజ్యాంగంలోని మూడవ విభాగం, 226వ అధికరణం కింద తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరుడు కోర్టుకు వెళ్లవచ్చని, ఈ కేసులో పిటిషనర్ ఉద్యోగం నియామకం కోసం జరిగిన పరీక్షలో ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినప్పటికీ మార్కులు ఇవ్వకపోవడాన్ని ప్రాథమిక హక్కుల కింద సవాల్ చేయవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు. వందేమాతరం గీతాన్ని ఆలపించడం పౌరల ప్రాథమిక హక్కు కిందకు రానప్పుడు తీర్పు అలా ఎలా ఇస్తారని వారు అశ్చర్యపడుతున్నారు. పైగా సుప్రీం కోర్టు గత ఫిబ్రవరి నెలలో ‘వందేమాతరం’ గీతాలాపన ప్రాథమిక హక్కు కింద తప్పనిసరి చేయాలన్న డిమాండ్‌ను నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చింది. వందేమాతరం అనే జాతీయ గీతాలాపనం గురించి ప్రస్తావన భారత రాజ్యాంగంలో ఎక్కడా లేనందున తాము అలాంటి ఉత్తర్వులను ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీం కోర్టు తీర్పునకు పూర్తి విరుద్ధంగా ఉంది. సరైనా కారణాలుంటే పౌరులు వందేమాతరం పాడకుండా ఉండవచ్చని కూడా హైకోర్టు తెలిపింది. అయితే ఆ సరైన కారణాలేమిటో తెలియజేయలేదు. 2016, నవంబర్ నెలలో సినిమా థియేటర్లు తప్పనిసరిగా జాతీయ గేయం ‘జన గణ మన అధినాయక జయహే’ ఆలపించాలని, అప్పుడు పౌరులందరూ లేచి నిలబడాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత కొన్ని థియేటర్లలో జాతీయ గేయాలాపన వస్తున్నప్పుడు దివ్యాంగులు లేవకపోవడం వల్ల, తమ మతం అనుమతించదంటూ ముస్లింలు లేవకపోవడం వల్ల తోటి ప్రేక్షకుల చేతుల్లో వారు తన్నులు తినాల్సి వచ్చింది. మినహాయింపుకు సరైన కారణాలు సూచించనట్లయితే వందేమాతరం విషయంలో కూడా అలాంటి హింసాత్మక సంఘటనలు జరగవచ్చు. ఈ దేశంలో ‘సబ్ కుచ్ చల్తే హై దేశ్భక్తికే నామ్‌పే’. -
గోప్యత హక్కా కాదా?
ప్రపంచం డిజిటల్ అయిపోతోంది. మనిషికి సంబంధించిన సమస్త సమాచారం డిజిటల్ రూపంలో ఉంటోంది. ఆధార్ నమోదు కోసం, బ్యాంకుల్లో, పాస్‌పోర్ట్ కోసం, ఇతర అవసరాలకు మన వ్యక్తిగత సమాచారాన్ని ఆయా ప్రభుత్వ శాఖలతో, ప్రైవేటు సంస్థలతో పంచుకుంటాం. ఆరోగ్యపరీక్షల నివేదికలు సైతం ఆన్లైన్లో ఇస్తున్నారు. మరి మన వ్యక్తిగత సమాచారం ఎంత వరకు భద్రంగా ఉంటోంది. ఇప్పుడు ప్రతిదానికీ ఆధార్‌తో లింకు పెడుతున్నారు. మన సమాచారం ఇతరుల చేతుల్లో పడితే ఎలా? వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకునే హక్కు మనకు లేదా? ఇప్పుడిదే ప్రశ్న సుప్రీంకోర్టు ముందుంది. ఆధార్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో వ్యక్తిగత వివరాల గోప్యత ప్రాథమిక హక్కని పిటిషనర్లు వాదిస్తున్నారు. రాజ్యాంగంలో దీని ప్రస్తావన లేదు కాబట్టి ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు గత తీర్పులు స్పష్టం చేశాయి. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా... మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని అన్వయించుకోవాల్సి ఉంటుందనేది నిపుణుల వాదన. జీవించే హక్కు, స్వేచ్ఛను కల్పిస్తున్న ఆర్టికల్ 21, భావ ప్రకటనా స్వేచ్ఛను, దేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛను, నచ్చిన ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని చేసుకునే హక్కును, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును కల్పిస్తున్న ఆర్టికల్ 19 స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత వివరాల గోప్యతను ప్రాథమిక హక్కుగా నిర్వచించాలని కోరుతున్నారు. రాజ్యాంగంలో నిర్దిష్టంగా చెప్పకపోయినా... భావ ప్రకటనా స్వేచ్ఛను అన్వయించి సుప్రీంకోర్టు పత్రికాస్వేచ్ఛను ప్రసాదించిందని తొమ్మిదిమంది రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఇటీవల వాదనల సందర్భంగా ఎత్తిచూపారు. ఈ విషయంలో గత తీర్పులేమిటి, తొమ్మిదిమందితో ధర్మాసనం వేయడానికి దారితీసిన పరిస్థితులేమిటో చూద్దాం... ఎం.పి. శర్మ– సతీష్ చంద్ర, ఢిల్లీ కలెక్టరు కేసు.. 1954 దాల్మియా జైన్ ఎయిర్వేస్ లిమిటెడ్ అనే కంపెనీని 1946లో ప్రారంభించి... 1952లో మూసివేశారు. ఇది దాల్మియా గ్రూపునకు అనుబంధ సంస్థ. ఎయిర్వేస్ వ్యవహారాల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని 1953 నవంబరు 19న ఎఫ్ఐఆర్ నమోదైంది. సోదాల కోసం జిల్లా కలెక్టరు అనుమతి పొంది... దాల్మియా గ్రూపునకు చెందిన 34 ప్రదేశాల్లో సోదాలు జరిపారు. కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల రాజ్యాంగబద్ధతను ఎం.పి.శర్మ తదితరులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆర్టికల్ (19)(1)(ఎఫ్)... ఆస్తులు కొనడానికి, కలిగి ఉండటానికి, అమ్మడానికి హక్కు కల్పిస్తుంది. ఆర్టికల్ 20 (3)... నేరాంగీకారానికి నిందితుడిని బలవంతం చేయకుండా రక్షణ కల్పిస్తుంది. నిందితుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అతన్ని దోషిగా తేల్చడానికి వీలుండదు. భారతీయులుగా తమకున్న ఈ రెండు ప్రాథమిక హక్కులకు సోదాలు భంగం కలిగించాయని, తమ వ్యక్తిగత రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారని పిటిషనర్లు వాదించారు. సోదాలు లేదా స్వాధీనం చేసుకోవడమనేది... తాత్కాలికంగా హక్కుల్లో జోక్యం చేసుకోవడమేనని, ఇది చట్టబద్ధంగా నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం జరిగితే తప్పులేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వ్యక్తిగత వివరాల గోప్యత ప్రాథమిక హక్కు కాదని ఎనిమిది మంది జడ్జిల బెంచ్ తేల్చింది. రాజ్యాంగంలో దీని ప్రస్తావన లేదంది. ఖారక్ సింగ్– ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దోపిడి కేసులో తగిన సాక్ష్యం లేదని ఖారక్ సింగ్‌ను విడుదల చేశారు. తర్వాత యూపీ పోలీసులు అతనిపై హిస్టరీ షీట్‌ను తెరిచి... కదలికలపై నిఘా ఉంచారు. తన ప్రాథమిక హక్కులను హరిస్తున్నారంటూ ఖారక్‌సింగ్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆర్టికల్ 19(1)(డి) కల్పిస్తున్న స్వేచ్ఛగా సంచరించే హక్కుకు, ఆర్టికల్ 21 ప్రసాదిస్తున్న జీవించే హక్కుకు, వ్యక్తిగత స్వేచ్ఛకు పోలీసులు భంగం కలిగించారని వాదించారు. వీరి చర్యలు తన వ్యక్తిగత గోప్యతకు భంగకరమన్నారు. 1963లో ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ అతని పిటిషన్‌ను తోసిపుచ్చింది. రాజ్యాంగంలో ఎక్కడా వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా పేర్కొనలేదంది. ఆధార్‌తో మళ్లీ తలెత్తిన ప్రశ్న తర్వాత 1970, 80లలో సుప్రీంకోర్టులో వివిధ బెంచ్‌లు దీనికి విరుద్ధంగా అభిప్రాయపడినా... సంఖ్యాపరంగా అవి చిన్నవి కాబట్టి... 1954లో ఎనిమిది మంది జడ్జిలు వెలువరించిన తీర్పు (వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదు) ఇప్పటికీ చలామణిలో ఉంది. 2015లో ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ వ్యక్తిగత వివరాల భద్రతపై, గోప్యతపై సందేహాలను లేవనెత్తారు. నాటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ... వ్యక్తిగత వివరాల గోప్యత ప్రాథమిక హక్కు కాదని అన్నారు. ఒకవేళ దీనిపై భిన్నాభిప్రాయాలుంటే... తొమ్మిది మంది జడ్డిలతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి... విషయాన్ని నిగ్గుతేల్చాలన్నారు. ఆధార్‌పై కేసులు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముందుకు గతవారం మరోసారి విచారణకు వచ్చాయి. ఆధార్ కోసం తమ బయోమెట్రిక్ వివరాలను సేకరించడం, దాన్ని ఇతరులతో పంచుకోవడం.... ప్రాథమిక హక్కు అయిన వ్యక్తిగత గోప్యతకు భంగకరమని పిటిషనర్లు వాదించారు. ఈ విషయంలో 1954లో ఎనిమిది మంది జడ్జిలు ఇచ్చిన తీర్పును ఆమోదించాలని... లేదంటే తొమ్మిది మంది న్యాయమూర్తులతో ధర్మాసనాన్ని వేసి... ఈ అంశంపై (వ్యక్తిగత వివరాల గోప్యత ప్రాథమిక హక్కా? కాదా?) పునఃపరిశీలన జరపాలని అడ్వకేట్ జనరల్ కె.కె.వేణుగోపాల్ వాదించారు. దీంతో ఎనిమిది మంది జడ్జిలతో కూడిన బెంచ్ ఆరు దశాబ్దాల కిందట ఇచ్చిన తీర్పు... రాజ్యాంగబద్ధతను పరిశీలించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇతరదేశాల్లో... - అమెరికాలో... అమెరికా రాజ్యాంగంలో వ్యక్తిగత గోప్యత ప్రస్తావన లేనప్పటికీ... సుప్రీంకోర్టు పలు రాజ్యాంగ సవరణలను ఆధారంగా చేసుకొని దీన్ని ప్రాథమిక హక్కుగా పేర్కొనవచ్చని తేల్చింది. సరైన కారణం లేకుండా తనిఖీలకు వీల్లేకుండా సవరణ తెచ్చారు. 1974లో తెచ్చిన ప్రైవసీ యాక్టు ప్రకారం... వ్యక్తుల సమాచారాన్ని ఫెడరల్ ఏజెన్సీలు అనధికారికంగా వాడుకోవడానికి లేదు. ఎందుకోసం సమాచారాన్ని కోరుతున్నారో ఫెడరల్ ఏజెన్సీలు స్పష్టంగా చెప్పాలి. రికార్డుల నిర్వహణలోనూ ఏజెన్సీలు కచ్చితత్వం పాటించాలి. - జపాన్‌లో... వ్యక్తిగత సమాచార గోప్యతను కాపాడేందుకు 2003లో జపాన్ ప్రత్యేకంగా చట్టం చేసింది. ఎవరి సమాచారాన్నైనా ఉపయోగిస్తుంటే... ఎందుకు వాడుతున్నామో సదరు వ్యక్తికి స్పష్టంగా చెప్పాలి. సమాచారాన్ని సదరు వ్యక్తి సమ్మతితోనే ఎవరికైనా (సంస్థలకు) ఇవ్వాలి. 2015లో జపాన్ కూడా ‘మై నంబర్’ పేరిట పన్నెండు అంకెల గుర్తింపు సంఖ్యను(ఆధార్‌లాగే) తమ పౌరులకు ఇచ్చింది. 2018 నుంచి దీన్ని ఐచ్చికంగా వాడి... 2021 నుంచి దీన్ని అన్ని లావాదేవీలకు తప్పనిసరి చేయనుంది. - యూరోప్... డాటా భద్రతకు సంబంధించి సభ్యదేశాలకు ఈయూ ఆదేశికసూత్రాలున్నాయి. వ్యక్తిగత సమాచారం ప్రమాదవశాత్తు లేదా చట్టవిరుద్ధంగా తుడిచిపెట్టుకుపోకుండా ఈయూ దేశాలు తగిన వ్యవస్థలను రూపొందించుకోవాలి. అనధికారికంగా సమాచారాన్ని వెల్లడించకూడదు, ఎవరికీ అందుబాటులో ఉండకూడదు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
గోప్యత హక్కా? కాదా?
‘ధర్మ’ సంకటం ప్రపంచం డిజిజల్ అయిపోతోంది. మనిషికి సంబంధించిన సమస్త సమాచారం డిజిటల్ రూపంలో ఉంటోంది. ఆధార్ నమోదు కోసం, బ్యాంకుల్లో, పాస్‌పోర్ట్ కోసం, ఇతర అవసరాలకు మన వ్యక్తిగత సమాచారాన్ని ఆయా ప్రభుత్వ శాఖలతో, ప్రైవేటు సంస్థలతో పంచుకుంటాం. ఆరోగ్యపరీక్షల నివేదికలు సైతం ఆన్లైన్లో ఇస్తున్నారు. మరి మన వ్యక్తిగత సమాచారం ఎంత వరకు భద్రంగా ఉంటోంది. ఇప్పుడు ప్రతిదానికీ ఆధార్‌తో లింకు పెడుతున్నారు. మన సమాచారం ఇతరుల చేతుల్లో పడితే ఎలా? వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకునే హక్కు మనకు లేదా? ఇప్పుడిదే ప్రశ్న సుప్రీంకోర్టు ముందుంది. ఆధార్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో వ్యక్తిగత వివరాల గోప్యత ప్రాథమిక హక్కని పిటిషనర్లు వాదిస్తున్నారు. రాజ్యాంగంలో దీని ప్రస్తావన లేదు కాబట్టి ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు గత తీర్పులు స్పష్టం చేశాయి. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా... మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని అన్వయించుకోవాల్సి ఉంటుందనేది నిపుణుల వాదన. జీవించే హక్కు, స్వేచ్ఛను కల్పిస్తున్న ఆర్టికల్ 21, భావ ప్రకటనా స్వేచ్ఛను, దేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛను, నచ్చిన ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని చేసుకునే హక్కును, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును కల్పిస్తున్న ఆర్టికల్ 19 స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత వివరాల గోప్యతను ప్రాథమిక హక్కుగా నిర్వచించాలని కోరుతున్నారు. రాజ్యాంగంలో నిర్దిష్టంగా చెప్పకపోయినా... భావ ప్రకటనా స్వేచ్ఛను అన్వయించి సుప్రీంకోర్టు ప్రతికాస్వేచ్ఛను ప్రసాదించిందని తొమ్మిదిమంది రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మంగళవారం వాదనల సందర్భంగా ఎత్తిచూపారు. ఈ విషయంలో గత తీర్పులేమిటి, తొమ్మిదిమందితో ధర్మాసనం వేయడానికి దారితీసిన పరిస్థితులేమిటో చూద్దాం... ఎం.పి. శర్మ– సతీష్ చంద్ర, ఢిల్లీ కలెక్టరు కేసు.. 1954 దాల్మియా జైన్ ఎయిర్వేస్ లిమిటెడ్ అనే కంపెనీని 1946లో ప్రారంభించి... 1952లో మూసివేశారు. ఇది దాల్మియా గ్రూపునకు అనుబంధ సంస్థ. ఎయిర్వేస్ వ్యవహారాల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని 1953 నవంబరు 19న ఎఫ్ఐఆర్ నమోదైంది. సోదాల కోసం జిల్లా కలెక్టరు అనుమతి పొంది... దాల్మియా గ్రూపునకు చెందిన 34 ప్రదేశాల్లో సోదాలు జరిపారు. కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల రాజ్యాంగబద్ధతను ఎం.పి.శర్మ తదితరులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆర్టికల్ (19)(1)(ఎఫ్)... ఆస్తులు కొనడానికి, కలిగి ఉండటానికి, అమ్మడానికి హక్కు కల్పిస్తుంది. ఆర్టికల్ 20 (3)... నేరాంగీకారానికి నిందితుడిని బలవంతం చేయకుండా రక్షణ కల్పిస్తుంది. నిందితుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అతన్ని దోషిగా తేల్చడానికి వీలుండదు. భారతీయులుగా తమకున్న ఈ రెండు ప్రాథమిక హక్కులకు సోదాలు భంగం కలిగించాయని, తమ వ్యక్తిగత రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారని పిటిషనర్లు వాదించారు. సోదాలు లేదా స్వాధీనం చేసుకోవడమనేది... తాత్కాలికంగా హక్కుల్లో జోక్యం చేసుకోవడమేనని, ఇది చట్టబద్ధంగా నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం జరిగితే తప్పులేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వ్యక్తిగత వివరాల గోప్యత ప్రాథమిక హక్కు కాదని ఎనిమిది మంది జడ్జిల బెంచ్ తేల్చింది. రాజ్యాంగంలో దీని ప్రస్తావన లేదంది. ఖారక్ సింగ్– ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దోపిడి కేసులో తగిన సాక్ష్యం లేదని ఖారక్ సింగ్‌ను విడుదల చేశారు. తర్వాత యూపీ పోలీసులు అతనిపై హిస్టరీ షీట్‌ను తెరిచి... కదలికలపై నిఘా ఉంచారు. తన ప్రాథమిక హక్కులను హరిస్తున్నారంటూ ఖరాక్సింగ్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆర్టికల్ 19(1)(డి) కల్పిస్తున్న స్వేచ్ఛగా సంచరించే హక్కుకు, ఆర్టికల్ 21 ప్రసాదిస్తున్న జీవించే హక్కుకు, వ్యక్తిగత స్వేచ్ఛకు పోలీసులు భంగం కలిగించారని వాదించారు. వీరి చర్యలు తన వ్యక్తిగత గోప్యతకు భంగకరమన్నారు. 1963లో ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ అతని పిటిషన్‌ను తోసిపుచ్చింది. రాజ్యాంగంలో ఎక్కడా వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా పేర్కొనలేదంది. ఆధార్‌తో మళ్లీ తలెత్తిన ప్రశ్న తర్వాత 1970, 80లలో సుప్రీంకోర్టులో వివిధ బెంచ్‌లు దీనికి విరుద్ధంగా అభిప్రాయపడినా... సంఖ్యాపరంగా అవి చిన్నవి కాబట్టి... 1954లో ఎనిమిది మంది జడ్జిలు వెలువరించిన తీర్పు (వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదు) ఇప్పటికీ చలామణిలో ఉంది. 2015లో ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ వ్యక్తిగత వివరాల భద్రతపై, గోప్యతపై సందేహాలను లేవనెత్తారు. నాటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ... వ్యక్తిగత వివరాల గోప్యత ప్రాథమిక హక్కు కాదని అన్నారు. ఒకవేళ దీనిపై భిన్నాభిప్రాయాలుంటే... తొమ్మిది మంది జడ్డిలతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి... విషయాన్ని నిగ్గుతేల్చాలన్నారు. మంగళవారం ఆధార్‌పై కేసులు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముందుకు మరోసారి విచారణకు వచ్చాయి. ఆధార్ కోసం తమ బయోమెట్రిక్ వివరాలను సేకరించడం, దాన్ని ఇతరులతో పంచుకోవడం.... ప్రాథమిక హక్కు అయిన వ్యక్తిగత గోప్యతకు భంగకరమని పిటిషనర్లు వాదించారు. ఈ విషయంలో 1954లో ఎనిమిది మంది జడ్జిలు ఇచ్చిన తీర్పును ఆమోదించాలని... లేదంటే తొమ్మిది మంది న్యాయమూర్తులతో ధర్మాసనాన్ని వేసి... ఈ అంశంపై (వ్యక్తిగత వివరాల గోప్యత ప్రాథమిక హక్కా? కాదా?) పునఃపరిశీలన జరపాలని అడ్వకేట్ జనరల్ కే.కే.వేణుగోపాల్ వాదించారు. దీంతో ఎనిమిది మంది జడ్జిలతో కూడిన బెంచ్ ఆరు దశాబ్దాల కిందట ఇచ్చిన తీర్పు... రాజ్యాంగబద్దతను పరిశీలించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇతరదేశాల్లో...అమెరికాలో... అమెరికా రాజ్యాంగంలో వ్యక్తిగత గోప్యత ప్రస్తావన లేనప్పటికీ... సుప్రీంకోర్టు పలు రాజ్యాంగ సవరణలను ఆధారంగా చేసుకొని దీన్ని ప్రాథమిక హక్కుగా పేర్కొనవచ్చని తేల్చింది. సరైన కారణం లేకుండా తనిఖీలకు వీల్లేకుండా సవరణ తెచ్చారు. 1974లో తెచ్చిన ప్రైవసీ యాక్టు ప్రకారం... వ్యక్తుల సమాచారాన్ని ఫెడరల్ ఏజెన్సీలు అనధికారికంగా వాడుకోవడానికి లేదు. ఎందుకోసం సమాచారాన్ని కోరుతున్నారో ఫెడరల్ ఏజెన్సీలు స్పష్టంగా చెప్పాలి. రికార్డుల నిర్వహణలోనూ ఏజెన్సీలు కచ్చితత్వం పాటించాలి. జపాన్‌లో... వ్యక్తిగత సమాచార గోప్యతను కాపాడేందుకు 2003లో జపాన్ ప్రత్యేకంగా చట్టం చేసింది. ఎవరి సమాచారాన్నైనా ఉపయోగిస్తుంటే... ఎందుకు వాడుతున్నామో సదరు వ్యక్తికి స్పష్టంగా చెప్పాలి. సమాచారాన్ని సదరు వ్యక్తి సమ్మతితోనే ఎవరికైనా (సంస్థలకు) ఇవ్వాలి. 2015లో జపాన్ కూడా ‘మై నంబర్’ పేరిట పన్నెండు అంకెల గుర్తింపు సంఖ్యను(ఆధార్‌లాగే) తమ పౌరులకు ఇచ్చింది. 2018 నుంచి దీన్ని ఐచ్చికంగా వాడి... 2021 నుంచి దీన్ని అన్ని లావాదేవీలకు తప్పనిసరి చేయనుంది. యూరోప్... డాటా భద్రతకు సంబంధించి సభ్యదేశాలకు ఈయూ ఆదేశికసూత్రాలున్నాయి. వ్యక్తిగత సమాచారం ప్రమాదవశాత్తు లేదా చట్టవిరుద్ధంగా తుడిచిపెట్టుకుపోకుండా ఈయూ దేశాలు తగిన వ్యవస్థలను రూపొందించుకోవాలి. అనధికారికంగా సమాచారాన్ని వెల్లడించకూడదు, ఎవరికీ అందుబాటులో ఉండకూడదు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఈ విధానంతో ఆరోగ్యమెలా?
కొండంత రాగం తీసి సణుగుడుతో చతికిలబడినట్టు రెండేళ్లనుంచి అందరినీ ఊరిస్తున్న జాతీయ ఆరోగ్య విధానం చివరకు నిరాశనే మిగిల్చింది. మన ఆరోగ్య వ్యవస్థకు జవసత్వాలు తీసుకురావడంలో భాగంగా ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు చేయబోతున్నట్టు 2015లో విడుదల చేసిన జాతీయ ఆరోగ్య విధానం ముసాయిదా ప్రకటించింది. జనం సంతోషించారు. ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు చేస్తే వైద్య సౌకర్యాలను నిరాకరించినపక్షంలో న్యాయపరమైన చర్య తీసుకోవడానికి పౌరులకు వీలవుతుంది. ఇందుకోసం జాతీయ ఆరోగ్య హక్కుల చట్టం కూడా తీసుకొస్తామని ముసాయిదా తెలిపింది. కానీ తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన జాతీయ ఆరోగ్య విధానం–2017లో అది కాస్తా గల్లంతైంది. అందుకు బదులు ఆరోగ్య సేవలు పొందడానికి పౌరులందరికీ ‘అర్హత’ ఉంటుందని ఆ విధానం చెబుతోంది. జీవించే హక్కుకు పూచీ పడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణలో ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉన్నట్టే. కానీ ఆరోగ్య సేవలు పొందడమన్నది ఆదేశిక సూత్రాల ఖాతాలోకి వెళ్లింది. దీని పర్యవసానాలెలా ఉన్నాయో అధ్వాన్నంగా ఉన్న ఆరోగ్య సేవల తీరుతెన్నులే చెబుతాయి.స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో మొత్తంగా ఆరోగ్య సేవలకు 4 శాతం ఖర్చవుతున్నదని అంచనా. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల వాటా దాదాపు ఒకటిన్నర శాతం మాత్రమే. ప్రజానీకం తినీ తినకా మిగు ల్చుకున్న సొమ్ము నుంచి... అప్పో సప్పో చేసి తెచ్చుకున్న సొమ్మునుంచి మిగిలిన 3 శాతం ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చవుతున్న సొమ్ములో ఆర్భాటంగా ప్రచారం జరిగే ఆరోగ్య బీమా వాటా నిండా పది శాతం కూడా లేదు. వీటన్నిటి ఫలితం ఎలా ఉంటున్నదో అందరికీ తెలుసు. ప్రజారోగ్యం అనే భావనే పూర్తిగా అటకెక్కింది. వ్యాధుల బారిన పడిన నిరుపేదలకు మరణమే శరణమవుతోంది. అలాగని దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఏం లేదు. మన జీడీపీ 7 శాతమని ఈమధ్యే ప్రకటించారు. అది అందరి అంచనాలనూ మించిపోయింది. ఈ గణాంకా లన్నిటినీ అపహాస్యం చేసేలా వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రాణాలను కబళిస్తు న్నాయి. దేశ జనాభాలో అయిదో వంతుమంది... అంటే 24 కోట్లమంది ప్రజలు మధుమేహం రక్తపోటు, కేన్సర్, హృద్రోగంవంటి వ్యాధులతో బాధపడుతు న్నారు. ఇవి రాను రాను విస్తరిస్తున్నాయి. మధుమేహంలో ప్రపంచ దేశాలతో పోటీ పడు తున్నాం. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం వగైరాలవల్ల వచ్చే వ్యాధులు, అంటు రోగాల సంగతి చెప్పనవసరం లేదు. నివారించదగిన డెంగ్యూ, మలేరియా, డయే రియా, టైఫాయిడ్ వంటి వ్యాధులతో ఏటా లక్షలాదిమంది మరణిస్తున్నారు. గర్భస్థ శిశు మరణాలు, నవజాత శిశు మరణాలు, ప్రసూతి మరణాలు నివారించడంలో ఎంతో కొంత మెరుగుదల కనబరుస్తున్నా ఇంకా చేయాల్సింది ఎంతో ఉన్నదని గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో ప్రజారోగ్య వ్యవస్థలో ఎన్నో లోటుపాట్లున్నాయి. నగరాలకూ, పట్టణాలకూ మధ్య... పట్టణాలకూ, పల్లెలకూ మధ్య... మైదాన ప్రాంతాలకూ, ఆది వాసీ ప్రాంతాలకూ మధ్య ఆరోగ్య సేవల లభ్యతలో ఎంతో అగాధం ఉంది. ఉత్త రాది రాష్ట్రాలకూ, దక్షిణాది రాష్ట్రాలకూ మధ్య... ఈశాన్య రాష్ట్రాలకూ, ఇతర రాష్ట్రా లకూ మధ్య సైతం ఇదే స్థితి. సారాంశంలో మెరుగైన వైద్య చికిత్సకు ప్రజలు ఎంతో దూరంలో ఉంటున్నారు. వైద్యుల కొరత అంతా ఇంతా కాదు. ఆ పోస్టుల భర్తీలో దాదాపు అన్ని ప్రభుత్వాలూ విఫలమవుతున్నాయి. కొన్నిచోట్ల 30 శాతం పోస్టులు ఖాళీగా ఉంటే మరికొన్నిచోట్ల 60శాతం వరకూ కూడా ఖాళీలుంటున్నాయని చెబు తున్నారు. ఇక ఇతర సిబ్బంది మాట చెప్పనవసరమే లేదు. అరకొర జీతాలతో, కాంట్రాక్టు ఉద్యోగాలతో వారు తమ డ్యూటీపై ఏమాత్రం శ్రద్ధ పెట్టగలరో ఎవరైనా ఆలోచించుకోవాల్సిందే. అందువల్లే ఆసుపత్రులకొచ్చిన నిరుపేద రోగులను లంచం డబ్బుల కోసం పీక్కు తినే స్థితి నెలకొంది. ప్రతి దేశమూ జీడీపీలో కనీసం 2.5 శాతం ప్రజారోగ్యానికి వెచ్చించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ దశాబ్దాలక్రితం చెప్పింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దాన్ని ఆచరించిన పాపాన పోలేదు. జీడీపీలో 2 శాతం ఖర్చు చేయాలనుకుంటున్నట్టు 2002నాటి జాతీయ ఆరోగ్య విధానం ఘనంగా ప్రకటించుకుంది. కానీ దశాబ్దన్నర కాలం సుదీర్ఘ జాప్యం తర్వాత ఇప్పుడు వెలువరించిన జాతీయ ఆరోగ్య విధానం సైతం 2025 నాటికి జీడీపీలో 2.5 శాతాన్ని ఆరోగ్యరంగానికి వెచ్చిస్తామని చెబుతోంది. సమస్య ప్రాణం మీదికొచ్చినా వాయిదా పద్ధతే తమ విధానమని పాలకులు ప్రకటిస్తు న్నారు. ఎంత సిగ్గుచేటు! మనకంటే ఎంతో వెనకబడి ఉన్న అఫ్ఘానిస్తాన్ తన జీడీపీలో 7.6 శాతం, భూటాన్ 5.2 శాతం రువాండా 10.5 శాతం ప్రజారోగ్యానికి ఖర్చు చేస్తుంటే మన ఆలోచన మాత్రం మారడంలేదు. దేశంలో పేదరికం విస్తరించడానికి గల ప్రధాన కారణాల్లో ఆరోగ్యానికి పెట్టే అపరిమితమైన ఖర్చు ఒకటని జాతీయ ఆరోగ్య విధానం సరిగానే గుర్తించింది. కానీ దాన్ని చక్కదిద్దే పనికి మాత్రం పూనుకోలేదు. ఏటా వైద్యంపై వెచ్చించే సొమ్ము వల్ల పేదరికంలో దిగబడిపోతున్నవారి సంఖ్య దాదాపు ఆరున్నర కోట్లని 2015లో విడుదల చేసిన ఆరోగ్య విధాన ముసాయిదా తెలిపింది. అలాంటివారి కోసం బీమా సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రైవేటు, ప్రభుత్వేతర రంగం తోడ్పాటు తీసుకుంటామని కేంద్ర కేబినెట్ ఆమోదించిన జాతీయ ఆరోగ్య విధా నం–2017 ప్రకటిస్తోంది. నిజానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టపరిస్తే చాలా వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించి అరికట్టడానికి వీలుంటుంది. బీమాపై ఆధారపడే స్థితి తగ్గుతుంది. ఆ దిశగా ప్రభుత్వ చర్యలుంటే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఫైలేరియాసిస్, కాలా–అజర్వంటి వ్యాధుల నిర్మూ లనకు నిర్దిష్ట లక్ష్యాలు నిర్దేశించారు. వాటిని సాధించాలన్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పటిష్టత తప్పనిసరి. ఒకరి అనారోగ్యం మరొకరి మహా భాగ్యంగా మార కుండా చూడటమే ఏ ఆరోగ్య విధానానికి గీటురాయి కావాలి. అప్పుడే ఆరోగ్యం అందరిదవుతుంది. ఆ విషయంలో జాతీయ ఆరోగ్య విధానం విఫలమైంది. -
ప్రాథమిక హక్కుల జాబితాలోకి 'ఆరోగ్యం'
న్యూఢిల్లీ: ప్రాథమిక విద్య అందిరి హక్కులానే అందరికి ఆరోగ్యం త్వరలోనే దేశ పౌరుల ప్రాథమిక హక్కుల్లో ఒకటి కానుంది. ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని రెండేళ్ల క్రితమే నేషనల్ హెల్త్ పాలసీ ప్రభుత్వాన్ని కోరింది. పెండింగ్ లో ఉన్న ఈ ఫైలును ప్రస్తుతం ఆరోగ్యమంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. వచ్చే నెల మొదటివారంలో ఈ ఫైలుకు కేబినేట్ ఆమోదముద్రవేసే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయంపై కేబినేట్ కు నోట్ ను సిద్ధం చేసి పంపినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ డిపార్ట్ మెంట్లు 'ఆరోగ్యం'ను ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చడంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వివరించారు. దీంతో పాటు జాతీయ ఆరోగ్య హక్కు చట్టం(ఎన్ హెచ్ఆర్ఏ) కింద ఆరోగ్యాన్ని విస్మరించడం కూడా నేరంగానే పరిగణించాలని చట్టంలో పొందుపరిచారు.ప్రస్తుతం దేశ స్థూల జాతీయాదాయంలో ప్రజారోగ్యానికి సంబంధించిన ఖర్చులు 1.2 శాతంగా ఉండగా, రాబోయే కాలంలో 2.5 శాతానికి చేరుకుంటుందని ఎన్ హెచ్ ఆర్ఏ తెలిపింది. దేశవ్యాప్తంగా గర్భిణీ, శిశు మరణాలను తగ్గించడం, సామాన్య ప్రజలకు ఉచిత మందులు అందుబాటులో ఉంచడం తదితరాలు బిల్లులో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఆరోగ్యపరంగా ఉన్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని మాత్రమే కేంద్ర ప్రభుత్వం వీటికి మార్పులు చేసే అవకాశం ఉంటుంది. బిల్లు కేబినేట్ లో ఆమోదం పొందిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు మెకానిజమ్స్, గైడ్ లైన్స్, అజెండా తదితరాలను ప్రభుత్వ శాఖలు చూసుకుంటాయని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. -
‘ఆలయంలోకి వెళ్లడం మహిళల హక్కు’
ముంబై: మహారాష్ట్రలో ఆలయాల్లోకి మహిళలను అనుమతించకపోవడం ఇకపై కుదరదు. పూజా స్థలాల్లోకి వెళ్లడం అందరి ప్రాథమిక హక్కు అని, దాన్ని ప్రభుత్వం పరిరక్షించాలని హైకోర్టు పేర్కొంది. శతాబ్దాల నుంచి ఉన్న సంప్రదాయానికి చరమగీతం పాడుతూ, లింగ వివక్షకు పుల్‌స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. శనిశింగ్నాపూర్ లాంటి ఆలయ గర్భగుడిలోకి మహిళలను అనుమతించకపోవడాన్ని చేసిన పిల్‌ను పరిష్కరిస్తూ తీర్పు చెప్పింది. ఆలయంలోకి రాకుండా అడ్డుకుంటే వారికి 6 నెలల శిక్ష విధించేలా చట్టం ఉంది. -
‘ప్రైవసీ’ప్రాథమిక హక్కు కాదు: కేంద్రం
న్యూఢిల్లీ: ‘వ్యక్తిగత రహస్యం(ప్రైవసీ)’ అనేది ప్రాథమిక హక్కు కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో అది లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆధార్ కార్యక్రమాన్ని రద్దు చేసేందుకు దాన్ని కారణంగా చూపలేమని వివరించింది. ఆధార్ అమలుకు లోపరహిత వ్యవస్థను రూపొందించామని పేర్కొంది. ఆర్టికల్ 32 కింద దాఖలైన సంబంధిత పిటిషన్లను కొట్టేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. వ్యక్తిగత రహస్య హక్కుకు పరిమితులున్నాయని, అది పరిపూర్ణ హక్కు కాదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ సందర్భంగా, ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనం పరిశీలనకు పంపించాలనుకుంటున్నామని న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వ్యాఖ్యానించారు. -
'తాగడం ప్రాథమిక హక్కు'
భోపాల్: ''మద్యం తాగడం ప్రాథమిక హక్కు. అదొక స్టేటస్ సింబల్. మద్యం తాగినంత మాత్రాన నేరాల సంఖ్య పెరగదు. ఎందుకంటే తాగిన తర్వాత వారు విచక్షణ కోల్పోతారు. ఇక నేరాలు ఎలా చేస్తారు.. విడ్డూరం కాకపోతేనూ....'' ఈ మాటలు అన్నది మరెవ్వరో కాదు. సాక్షాత్తూ మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్. ''మరీ విపరీతంగా తాగకండి.. ఇది మన ప్రాథమిక హక్కు.. మన గౌరవానికి సంబంధించిన అంశం'' అంటూ ఒక ఉచిత సలహా కూడా పడేశారట. రాష్ట్రంలో మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బాబూలాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈయనే గతంలో మహిళలపై జరుగుతున్నఅత్యాచారాలకు ప్రభుత్వం బాధ్యత వహించదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మహిళా సంఘాల ఆగ్రహానికి గురయ్యారు. తమిళనాడు మహిళలు నిండుగా బట్టలు కట్టుకుంటారు అందుకే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వారిపై హింస, నేరం కేసులు తక్కువగా నమోదవుతున్నాయని గతంలో కామెంట్ చేశారు. ఒక రష్యన్ మహిళనుద్దేశించి అనుచితంగా వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు.