జార్ఖండ్ సీఎంగా యశ్వంత్ సిన్హా సరైన అభ్యర్థి | Yashwant Sinha 'right person' to be Jharkhand chief minister, says L K Advani | Sakshi
Sakshi News home page

జార్ఖండ్ సీఎంగా యశ్వంత్ సిన్హా సరైన అభ్యర్థి

Published Wed, Jun 18 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

జార్ఖండ్ సీఎంగా యశ్వంత్ సిన్హా  సరైన అభ్యర్థి

జార్ఖండ్ సీఎంగా యశ్వంత్ సిన్హా సరైన అభ్యర్థి

* బీజేపీ అగ్ర నేత అద్వానీ ఉద్ఘాటన
* యశ్వంత్ సిన్హాతో జైల్లో 2 గంటలకు పైగా భేటీ

 
 హజారీబాగ్: జార్ఖండ్ సీఎంగా బీజేపీ నేత యశ్వంత్ సిన్హా సరైన అభ్యర్థని ఆ పార్టీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ ఉద్ఘాటించారు. వచ్చే ఏడాది జార్ఖండ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నాయకత్వం వహించాలని సిన్హాను కోరారు. తక్షణమే బెయిల్‌పై బయటకు రావాలని కోరారు. విద్యుత్ ఉద్యమం నేపథ్యంలో ఆ శాఖ అధికారిపై చేయి చేసుకున్నారనే ఆరోపణలపై ప్రస్తుతం హజారీబాగ్‌లోని కేంద్ర కారాగారంలో ఉన్న యశ్వంత్ సిన్హాను అద్వానీ మంగళవారం కలిశారు. ఇరువురు నేతలూ దాదాపు 2 గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించుకున్నారు.
 
 అనంతరం అద్వానీ మీడియాతో మాట్లాడుతూ.. జార్ఖండ్‌కు చెందిన యశ్వంత్ సిన్హా ఆరాష్ట్ర సీఎం అభ్యర్థిగా సరైన వ్యక్తని పేర్కొన్నారు. ‘బీజేపీ నేతల నుంచి యశ్వంత్ సిన్హాకు మద్దతు లభిస్తోంది. ఇప్పుడు ఆయనకు బీజేపీ నేతల అభిప్రాయాలను గౌరవించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక్క జార్ఖండ్ నేతల నుంచే కాదు. దేశ వ్యాప్తంగా పార్టీ నుంచి ఆయనకు మద్దతు లభిస్తోంది. ఇక ఆయన జైలు నుంచి బయటకు వచ్చి జార్ఖండ్‌లో బీజేపీ పగ్గాలు చేపట్టాలి’ అని అద్వానీ అన్నారు. హజారీబాగ్‌లోని విద్యుత్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై అక్కడి కుగ్రామాల ప్రజలకు మద్దతుగా యశ్వంత్ సిన్హా చరిత్రాత్మక ఉద్యమం ప్రారంభించారని కొనియాడారు. ఆయనకు పార్టీ సహా అందరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement