ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి: వైరల్‌ | Youth Falls off Into Steep Slope While Trying To Click Selfie | Sakshi
Sakshi News home page

ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి: వైరల్‌

Published Fri, Aug 2 2019 6:57 PM | Last Updated on Fri, Aug 2 2019 7:20 PM

Youth Falls off Into Steep Slope While Trying To Click Selfie - Sakshi

ముంబై : సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. వంద అడుగుల మేర లోయలో పడి కొన్ని గంటల పాటు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సి వచ్చింది. ఈ సంఘటన గురువారం మహారాష్ట్రలోని లోనావాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లోనావాలకు చెందిన నిలేశ్‌ భగవత్‌ అనే యువకుడు గురువారం అక్కడి లోనావాల హిల్‌ స్టేషన్‌కు వెళ్లాడు. సరదాగా అంతా తిరుగుతూ ఓ లోయవద్దకు చేరుకున్నాడు. లోయ మీదనుంచి కింద ప్రాంతం మొత్తం అందంగా కనిపిస్తుండటంతో సెల్ఫీ తీసుకోవటానికి ముచ్చట పడ్డాడు. సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో పట్టుతప్పి వంద అడుగుల వరకు లోయలో పడిపోయాడు.

కొద్దిసేపటి తర్వాత అతడ్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో శ్రమకు ఓడ్చి ట్రెక్కింగ్‌ తాడు సహాయంతో అతడ్ని లోయలోనుంచి బయటకు లాగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement