
గల్ఫ్ డెస్క్: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35(ఏ)ను రద్దుచేసి ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించిన నేపథ్యంలో ఈ అంశంపై సర్వత్రా చర్చజరుగుతోంది. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు కూడా ఈ వార్తల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటి వరకు కశ్మీర్‌లో అమలైన విధానాలే గల్ఫ్‌లో ఉన్నాయని చర్చించుకుంటున్నారు.
కశ్మీర్‌కు, గల్ఫ్ దేశాలకు పోలికలు ఇలా..
♦ ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకశ్మీర్‌లో ఇతర రాష్ట్రాల వారు భూములు, ఆస్తులూ కొనలేరు. ఈ విధానం గల్ఫ్‌లో కూడా ఉంది.
♦ కశ్మీర్‌కు చెందిన యువతి ఆ రాష్ట్రంలో శాశ్వత నివాసికాని వ్యక్తిని పెళ్లిచేసుకుంటే, ఆమెతోపాటు తన సంతానం కూడా శాశ్వత నివాస హక్కు కోల్పోయి, వారసత్వ స్థిరాస్తులను పొందలేరు. గల్ఫ్ దేశాల్లో కూడా ఇదే పద్ధతి కొనసాగుతోంది.
♦ రాష్ట్ర సర్వీసుల్లో నియామకాలకు అక్కడి శాశ్వత నివాసులు మాత్రమే అర్హులు.
♦ కశ్మీర్‌లో శాశ్వత నివాసులు మాత్రమే స్థిరాస్తులు కొనుగోలు చేయాలి. ఇతరులు కొనుగోలు చేయరాదు. అయితే, గల్ఫ్ దేశాల్లో ఇటీవల సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు ఇతర దేశస్తులకు భూమి, భవనాలను లీజుకు ఇస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment