'కోహ్లీ నన్నెలా ఇష్టపడ్డాడో అర్థంకాదు' | Anushka sharma did not write the diary | Sakshi

'కోహ్లీ నన్నెలా ఇష్టపడ్డాడో అర్థంకాదు'

Published Sun, Sep 6 2015 8:41 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

'కోహ్లీ నన్నెలా ఇష్టపడ్డాడో అర్థంకాదు'

'కోహ్లీ నన్నెలా ఇష్టపడ్డాడో అర్థంకాదు'

ఇండియా గెలిచింది! స్వీట్ న్యూస్. ఇరవై రెండేళ్ల తర్వాత, లంకలో భారత్ గెలిచిందట. క్రికెట్‌లో ఈ లెక్కలన్నీ భలే వింతగా ఉంటాయి.

ఇండియా గెలిచింది! స్వీట్ న్యూస్. ఇరవై రెండేళ్ల తర్వాత, లంకలో భారత్ గెలిచిందట. క్రికెట్‌లో ఈ లెక్కలన్నీ భలే వింతగా ఉంటాయి. ప్రతి బాల్‌కీ ఏదో ఒక రికార్డు ఉంటుంది! ప్రతి రన్‌కీ ఏదో ఒక రికగ్నిషన్ ఉంటుంది! కోహ్లీ కెప్టెన్‌గా గెలిచిన ఫస్ట్ మ్యాచ్ అట ఇది! గెలిచిన ఆటైనా, ఓడిన ఆటైనా కెప్టెన్ లేకుండా జట్టు ఉంటుందా? విడ్డూరం కాకపోతే! ఇంకా విడ్డూరం... ఈ ఆటను నేను గెలిపించాననడం. ట్విట్టర్‌లో నాపై ఒకటే నోటి జల్లులు. స్టేడియంలో నేను లేకపోబట్టి ఇండియా గెలిచిందట! క్రియేటివిటీలో ఎంత క్రూయల్టీ!
 
 అప్పుడూ అంతే. వరల్డ్ కప్పులో. సెమీస్‌లో ఆస్ట్రేలియాతో ఆడుతున్నప్పుడు కోహ్లీ ఒక్క రన్ కొట్టి ఔటయినందుకు తప్పంతా నాదేనని విరుచుకుపడ్డారు. అది నాకు ఇష్టమే. కోహ్లీ మీద పడకుండా. కానీ వెతుక్కోవాల్సిన కారణాలు వెతుక్కోకుండా, కారణాలకు మనుషుల్ని వెతుక్కోవడం ఏమిటి? కోహ్లీ, అనుష్కా కలిసి తిరిగితే ఇండియా ఓడిపోతుందా? కోహ్లీ, అనుష్కా ఎదురెదురుగా లేకపోతే ఇండియా గెలుస్తుందా? మరి ఈ ఇషాంత్‌లు, అశ్విన్‌లు ఎందుకు? వాళ్లని అవమానించడం కాదా?
 
 క్రికెట్ గురించి నాకేమీ తెలీదు. మ్యాచ్ చూడ్డం ఇష్టం నాకు. కోహ్లీ పక్కన కూర్చొని చూడ్డం ఇంకా ఇష్టం. కానీ కోహ్లీ ఆడుతున్నప్పుడు పక్కన కూర్చోలేనుగా. ఇంకేదైనా మ్యాచ్ చూడాలి ఇద్దరం కలిసి.. టెన్నిసో, ఫుట్‌బాలో. క్రికెట్టే చూడాలంటే నేను స్టాండ్‌లో కూర్చునే చూడాలి. అలా కూర్చుని చూస్తున్నప్పుడు, కోహ్లీ నన్ను చూడకుండా ఆడాలంటే అతడి కళ్లకు గంతలు కట్టించి ఆడించాలి. అప్పుడు గెలుస్తుందా ఇండియా? గెలుస్తుందేమో మరి... ఈ ట్వీట్లు పెట్టే వాళ్లకే తెలియాలి.
 
 స్వీట్లు పంచి పెట్టినట్టుగా నాకు ట్వీట్లు పంచిపెడుతున్నారు. ఇండియా ఓడినప్పుడు, గెలిచినప్పుడూ. కోహ్లీ సపోర్ట్ లేకపోతే వీళ్ల మాటలకి ఎప్పుడో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయేదాన్ని. కోహ్లీ నా కోసం గట్టిగా నిలబడ్డాడు. నన్ను అన్న ప్రతి మాటా తనను హర్ట్ చేసిందని ప్రపంచానికి ఓపెన్‌గా చెప్పేశాడు. లవ్యూ కోహ్లీ. కోహ్లీ నన్నెలా ఇష్టపడ్డాడో అర్థం కాదు. అతడికి ముక్కు మీద కోపం. నాకు కోపం రాదు. వచ్చినా అది మూతి మీది చిరునవ్వులా వస్తుంది. కోహ్లీ అగ్రెసివ్‌గా ఉంటాడు. అగ్రెసివ్‌గా ఉండేవాళ్లని ఎంకరేజ్ చేస్తాడు. ఈ మ్యాచ్‌లో ఇషాంత్ రెచ్చగొడుతూ ఆడుతుంటే అతడిని ప్రైజ్ చేశాడు.

ఇషాంత్ వల్లే ఇండియా గెలిచిందని అన్నాడు. చివరికి అదీ నాకే వచ్చింది. అప్పుడు అనుష్కా శర్మ ఇండియాని ఓడిస్తే, ఇప్పుడు ఇషాంత్ శర్మ ఇండియాను గెలిపించాడని మళ్లీ ఓ ట్వీటు! ‘రబ్‌నే బనా ది జోడీ’... మై ఫస్ట్ ఫిల్మ్. అందులో నాకు తెలియకుండానే షారుక్‌తో నా పెళ్లి జరిగిపోతుంది. ఇక్కడా అంతే, నా ప్రమేయం లేకుండానే టీమ్ ఇండియా అప్స్ అండ్ డౌన్స్‌కి ప్రతిసారీ నేను టార్గెట్ అవుతున్నాను!
- మాధవ్ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement