దళితులపై దాడులు అమానుషం | Attacks on Dalits | Sakshi
Sakshi News home page

దళితులపై దాడులు అమానుషం

Published Tue, Jul 26 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

Attacks on Dalits

ఇన్‌బాక్స్
 రాజకీయ, ఆర్థిక,సామాజిక సమానత్వం, సోదరభావం ధ్యేయంగా రాజ్యాంగం రూపు దిద్దుకుంది. ఆ స్ఫూర్తిని కాపాడేందుకు అవస రమైన వ్యవస్థని స్వతంత్ర భారత్ ఏర్పాటు చేసు కుంది. చట్టాల రూపంలో అందుకు తగ్గ ఆయుధాలు పాలకులకు అందుబాటులోనే ఉన్నాయి.
 
  అయితే విస్తృత సామాజిక లబ్ధిస్థానే, సంకుచిత రాజకీయ లబ్ధిని వివిధ పక్షాలు ముఖ్యమైనదిగా భావిస్తున్న కారణంగానే సామాజిక సమస్యలకు పరిష్కారాలు దొరకడంలేదు సరిగదా సమస్యలు సంక్లిష్ట రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుతం దళితులపై జరు గుతున్న దాడులు, వాటిపై నేతల మౌనం నాగరిక దేశానికి సిగ్గుచేటు. వాటిపై కఠినంగా వ్యవ హరించాల్సిన కేంద్ర ప్రభుత్వం నీళ్లు నమలడం బాధ్యతా రాహిత్యం. ఉత్తర్రపదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతిపై ఆ రాష్ర్ట బీజేపీ ఉపాధ్యక్షుడు చేసిన సంస్కార రహితమైన వ్యాఖ్యలు రాజకీయ కాలుష్యానికి అద్దం పడుతున్నాయి.
 
 కొంతమంది పనిగట్టుకుని మరీ వ్యాపింపజేస్తున్న ఈ రకమైన విష పూరిత కాలుష్యం సమాజాన్ని తీవ్రంగా నష్ట పరుస్తోంది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా సమర్ధవంతంగా సామాజిక కాలుష్య నివా రణా చర్యలు చేపట్టాలి. రాజ్యాంగ రక్షణల్ని అర్హులకు అందించడంతో పాటు నేరస్తుల్ని నియం త్రించాలి. అన్ని పక్షాలూ తమ స్వలాభాలకు అతీ తంగా ఆలోచించి దేశాన్ని సుస్థిరపర్చాలి. కుల, మతాలపై రాజకీయ భవిష్యత్ నిర్మించుకునే కౌటి ల్యాన్ని విడనాడాలి.
  డాక్టర్ డీవీజీ శంకరరావు
 మాజీ ఎంపీ, పార్వతీపురం
 
 శ్రీశైలం జలాలు రాయలసీమకే...
 పట్టిసీమ నుంచి విజయవాడకు ప్రభుత్వం గోదావరి నీళ్లను పాక్షికంగా మళ్లించి అదే ఘన విజయమంటూ సంబరపడిపోయింది. మరింత చిత్తశుద్ధితో శ్రీశైలం నుంచి రాయలసీమకు పోతి రెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా నీరు అందిస్తే రాయలసీమ ప్రజలకు నిజమైన ప్రయో జనం లభిస్తుంది. అయితే మాటవరుసకు మాత్రమే నదుల అనుసంధానం చేసిపడేశా నని గొప్పలు చెప్పుకుంటే ఏ ప్రాంత ప్రజలూ నమ్మరు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం ప్రయోజనాలు అటు కోస్తా ప్రజలకు, ఇటు రాయలసీమ ప్రజలకు కూడా సమప్రాతిపదికన అందాలి. గత రెండేళ్లుగా తెలు గుగంగ ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక రాయలసీమలో కరువు తాండవిస్తోంది.
 
 దానికితోడు తాగునీరు కూడా కరువై పోయింది. రాయలసీమకు నిజంగా న్యాయం చేయాలంటే శ్రీశైలం నీటిని ఇచ్చిన మాట ప్రకారం తెలు గుగంగ, కేసీ కెనాల్ వంటి వాటికి అందించే ప్రయత్నం చేయాలి. త్వరలో కృష్ణానదికి వర దలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇకనుంచైనా శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల మేరకు నీటిని నిల్వచేసి అంతకు తగ్గకుండా తగు చర్యలు తీసుకోవాలి. కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలకు మళ్లించకుండా సంవత్సరం పొడవునా శ్రీశైలం డ్యాంలో నీరు నిల్వ ఉంటే రాయలసీమ ప్రజలకు మేలు జరుగుతుంది. శ్రీశైలం డ్యాం నీటిని మొత్తంగా రాయలసీమకు మాత్రమే కేటాయిస్తే సీమ దిశా, దశా పూర్తిగా మారినట్లే. కావలసిందల్లా ప్రభుత్వం నుంచి కాస్త చిత్తశుద్ధి, నిజాయితీ మాత్రమే.
 ఈశ్వర్, పొద్దుటూరు, కడపజిల్లా
 
 మల్లన్న సాగర్‌పై మంకుపట్టు ఎందుకు?
 మల్లన్న సాగర్ రిజర్వాయర్‌పై తెలంగాణ ప్రభుత్వం మంకుపట్టు ముంపుప్రాంత రైతులపై పాశవిక దాడితో పరాకాష్టకు చేరుకున్నట్లయింది. ప్రతిపక్షాన్ని ఏకమొత్తంగా తమ ప్రభుత్వంలో, పార్టీలో కలుపుకున్నంత సులభంగా.. అన్నం పెట్టే రైతును ముంపుకు గురి చేయటం సాధ్యం కాదని నయాదొరలకు అర్థం అవుతున్నట్లు లేదు. అనేక ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన తెలం గాణ ప్రజలను మభ్యపర్చి సాగునీటి ప్రాజెక్టుల పేర్లు మార్చి, లక్షన్నర కోట్ల రూపాయలను ఈ రెండేళ్లలోనే ఖర్చు చేయడం ప్రజలు కోరుకున్నది కాదు.
 
 గతంలో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పరిధిలోనే సమీపంలోని తడ్కపల్లి వద్ద 1.5 టీఎంసీల నీటి నిల్వ స్థాయి సరిపోతుందని నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించగా, దాన్ని పక్కనపెట్టి కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టులో 50 టీఎంసీల నీటి నిల్వతో నిర్మించాలనుకోవడంలో ప్రజాప్రయోజ నాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు ప్రజలపై పోలీసు దాడులకు కూడా సిద్ధమైపోవడం తెలంగాణ ప్రజాస్వామ్యంలో భాగమేనా?
 మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గత 45 రోజులుగా దీక్షలు చేపడుతున్న ఏటిగడ్డ కిష్టా పూర్, వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాల్లో సందర్శించి వారెందుకు రిజర్వాయర్‌ను వ్యతిరేకి స్తున్నారు అని అడిగితే ఊళ్లు పోతే సావేనంటూ ముక్తకంఠంతో చెప్పారు.
 
 జీవనోపాధిని కోల్పో వటం ఒకటైతే, ప్రజల స్థిర నివాసాన్నీ, వారి మధ్య ఏనాటి నుంచో ఏర్పడ్డ సంబంధాలను తుంచివేయడం దేనికోసం? పైగా భూమి ఉన్న వారికి పరిహారమంటున్నారు కానీ భూమి లేని కులవృత్తులవారిని గాలికి వదిలేశారు. ఊరు విడవాలన్న ఊహనే భరించలేకపోతున్నామని ప్రజలుమొత్తుకుంటుంటే పోలీసు భాషను తప్ప పాలకులు ప్రజల భాషను అర్థం చేసుకోవటం లేదు. తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా రెండు పంటలు పండుతూ పట్టుపరిశ్రమ వంటి ఉపాధి అవకాశాలతో స్వయంపోషితంగా ఉన్న 14 గ్రామాలను ముంచే రిజర్వాయర్‌ను ఏ ప్రయోజనాలకోసం నిర్మిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వాల మాదిరి గానే తెలంగాణ ప్రభుత్వం కూడా బహుళజాతి సంస్థలకు భూమిని కట్టబెట్టడం కోసం నేలమీద వ్యవసాయం చేసుకుని బతికే ప్రజల జీవనో పాధిని దెబ్బతీయడం మానవహక్కుల ఉల్లం ఘనే. అందుకే మల్లన్న సాగర్ రిజర్వాయర్ పేరుమీద జరిగే భూసేకరణను వెంటనే నిలిపే యాలని డిమాండ్ చేస్తున్నాం.
 అనంతుల రమేష్, అధ్యక్షులు
 పౌరహక్కుల సంఘం, వరంగల్
 
 బియ్యమొక్కటే చాలా?
 నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి పోతున్నాయి, బియ్యం ధరలు రూ. 45 నుంచి రూ.55లకు చేరాయి. సన్న బియ్యం కొని తినలేని పరిస్థితి ఉంది, పప్పుల ధరలు కొండె క్కాయి. నూనె ధరలు భగ్గుమంటున్నాయి. వచ్చే పండుగల సీజన్లో సామాన్యులు పండుగలు ఎలా జరుపుకోవాలో అర్థం కావటం లేదు. బతుకమ్మ పండుగ, వినాయక చవితి, దసరా ఇలా వరుసగా పండుగలు ఉన్నాయి. ధరలు అదుపులో లేకపోతే పేదవారి పరిస్థితి ఎట్లా, గతంలో  రేషన్‌షాప్‌లో తక్కువ ధరకే ప్యాకేజీగా కొన్ని వస్తువులు ఇచ్చేవారు. ఇప్పుడు బియ్యం ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా ధరలు అదుపు చేయవలసిన బాధ్యత ప్రభు త్వంపై ఉంది.
 జైని రాజేశ్వర్ కాప్రా, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement