రద్దీకి సరి-బేసి పరిష్కారం! | even-add pattern in new delhi | Sakshi
Sakshi News home page

రద్దీకి సరి-బేసి పరిష్కారం!

Published Tue, Dec 22 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 2:21 PM

రద్దీకి సరి-బేసి పరిష్కారం!

రద్దీకి సరి-బేసి పరిష్కారం!

ప్రజా రవాణా కుదించుకు పోవడం అనేది రోడ్లమీద కూడా రద్దీకి దారితీసింది. దానిని సమర్థవంతంగా విస్తరించకుండా సరి, బేసి సంఖ్యలతో వ్యక్తిగత వాహనాలను పరిమితం చేయడం అనేది ఫలితాలనివ్వదు.
 
ఢిల్లీలో కార్లకు సరి-బేసి సంఖ్యల పథకం అమలు చేయడం అనుకుంటున్నంత సులభం కాదు. దేశ రాజధానిలో పెరిగిపోయిన వాయు కాలుష్య నివారణ కోసం సరి సంఖ్య గల కార్లను ఒకరోజు, బేసి సంఖ్య గల కార్లను మరొక రోజు రోడ్లపైకి అనుమతించే ఈ పథకం అమలుకు ముందు జరుగుతున్న చర్చ కూడా అయోమయాన్నే కాకుండా అసంబద్ధతల్ని కూడా ప్రదర్శించింది. ఈ పథకం ‘ఒక నమూనాగా మాత్రమే ఉంటుంద’ని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చెబుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం వెనక్కు తిరిగి చూడలేనంత తారస్థాయికి చేరుకుందని భావిస్తున్న ఔత్సాహికులు కొందరు మాత్రం ఈ పథకం విజయవంతం కావాలనే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇది అమలు కాకపోతే మరెన్నటికీ కాదని వీరు చెబుతున్నారు.

ఇప్పటికే ఈ పథకంలోని మినహాయింపుల గురించి చర్చించుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలను కూడా ఈ కొత్త శాసనం పరిధిలోకి తీసుకురావాలా అనేది కూడా చర్చనీయాంశమైంది. ఇక వీఐపీల విషయానికి వస్తే, కారు సంఖ్యలతో పనిలేకుండా రహదార్లపై హక్కు కలిగి ఉంటారు. వీఐపీలకు మినహాయింపును ఇస్తే అది ఆమ్ ఆద్మీ భావనకే ఎదురు తన్నవచ్చు.
 అయితే శరవేగంతో సాగుతున్న నగరీకరణను, రవాణారంగంలో పేలవమైన పెట్టుబడులను చూసి నట్లయితే.. దేశంలోని ప్రతి నగరం, పట్టణం కూడా త్వరలో నూ, కాస్త ఆలస్యంగానో ఇదే సంక్షోభాన్ని ఎదుర్కొనక తప్పదు. ఎందుకంటే తగినన్ని రైల్వే కోచ్‌లను నిర్మించడం మనకు కష్టమవుతోంది కానీ కారు తయారీ రంగం మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థకే కీలకమైన అంశంగా ఉంటోంది. దేశ ప్రాధాన్యతలను ఇది చూపుతుంది.
 
ఇక అసందర్భాలను ఇక్కడ చూద్దాం...
ఒకటి. కారు యజమానులు ఇప్పుడు రెండో కారు కొం టారు. అప్పుడు ఒక్కోరోజు ఒక్కో కారును వీరు ఉప యోగించగలుగుతారు. ఇది పలు అంశాలను విస్మరిస్తోంది. ప్రతి కొనుగోలుదారూ తన అవసరానికి తగిన నంబర్‌ను పొందుతాడనేందుకు లేదు. అంటే బేసి సంఖ్య గల కారు యజమాని సరి సంఖ్య గల కారును కొంటారని చెప్పడానికి వీల్లేదు. ఈ సంఖ్యలు లాటరీ లాంటివే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వాహనాల సంఖ్యలను వేలం వేస్తున్నారు.
 
దీంతో వాహనదారుడు కొనే రెండో కారు చాలా ఖర్చుతో కూడి ఉంటుంది. చాలా కార్లను తాకట్టు ప్రాతి పదికన కొంటుంటారు. పైగా చాలామంది కారు యజ మానులు పైకి చెప్పుకుంటున్నంత సంపన్నులేం కారు. మధ్యతరగతి ప్రజలు అధిక వ్యయంతో కూడిన ఫ్లాట్లతో పాటు, నాలుగు చక్రాల వాహనాలకు కూడా ఈఎంఐల కింద చెల్లిస్తుంటారు. దీనివల్ల కారును కొనడం, దానికి సరి లేదా బేసి సంఖ్యను కొనడం కష్టసాధ్యమౌతుంది.
 ఇక పార్కింగ్ కష్టాలు వాణిజ్య జిల్లాల్లోనే కాదు.. ఏ పరిమాణంలో ఉన్న ఏ నగరానికైనా తప్పటం లేదు. పైగా, కార్లు కలిగినవారు చోటు లేక వీధుల్లోనే పార్క్ చేస్తుంటారు కనుక నివాస ప్రాంతాల్లో కూడా సంక్షోభం ఉంటోంది. వీధుల్లో మెర్సిడెజ్ లేదా స్కోడా ఉండటం చాలా తరచుగా చూస్తుంటాం. ముంబైలోని కొలాబా, కప్పే పెరేడ్, మలబార్ హిల్స్ వంటి విలాసవంతమైన ప్రాంతాల్లో కూడా వాటిని మీరు చూస్తుంటారు. ఢిల్లీ కూడా దీనికి భిన్నంగా ఉండదు. కొద్ది సంవత్సరాల క్రితం మాత్రమే ముంబైలో కొత్త భవనాలకు తప్పనిసరిగా పార్కింగ్ ప్లేస్ ఉండాలని ఆంక్షలు విధించారు కానీ రియల్టర్లు మాత్రం పార్కింగ్ స్థలాలకు తడిపి మోపెడంత వసూలు చేస్తున్నారు.

ఇక కనెక్టివిటీకి సంబంధించిన సమస్యకూడా ఉంది. చాలామంది ఇప్పటికీ రిక్షాలో ప్రయాణించి భారీ ఎత్తున సాగే రవాణా వ్యవస్థ వద్దకు చేరుకుంటున్నారు. ఢిల్లీలో అయితే మనుషులు తొక్కుతున్న రిక్షాల్లో కూడా ప్రయాణి స్తున్నారు. తర్వాత వారు చేరవలసిన గమ్య స్థానానికి రద్దీగా ఉన్న బస్సుల్లో లేదా ఆటో రిక్షాలో ప్రయాణిస్తున్నారు. నగరంలోపలి ప్రయాణంలో ఉన్న తీవ్ర ఇక్కట్ల కారణంగా కారు కొనుగోలుకే ప్రాధాన్యమిస్తున్నారు.

ఢిల్లీలో రోడ్డు, ట్రాఫిక్  సిగ్నల్స్‌కి వెచ్చిస్తున్న మదుపులు కేవలం పది శాతం ప్రయాణికులకే ఉపయోగ పడుతున్నాయి. ఇక బస్సుల నిర్వహణ ఘోరంగా ఉం టుంది. ముంబైలో బెస్ట్ పేరిట సాగుతున్న ప్రజా రవా ణా వ్యవస్థ ఇప్పటికే మందగించిపోయింది. ఎందుకంటే ప్రైవేట్ కార్లు రోడ్ స్థలాన్ని మొత్తంగా ఆక్రమించి ప్రజా రవాణాను పక్కకు నెట్టేస్తున్నాయి. దీంతో ముంబై రోడ్లమీద బస్సుల కదలిక నెమ్మదిం చిపోయింది. దీంతో మరిన్ని కార్లు రోడ్లమీదికి వస్తున్నాయి.

ప్రజా రవాణా ఇరుగ్గా, రద్దీగా అయిపోవడం అనేది రోడ్లమీద కూడా రద్దీకి దారి తీసింది. ప్రజలు కారు ప్రయాణానికి తొలి ప్రాధాన్యమివ్వడానికి కారణ మవుతున్న పేలవమైన రవాణా యంత్రాంగం, తగినంత స్థాయిలో లేని మాస్ రవాణా కలిసి సంక్షోభాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఈ పరిస్థితి యుద్ధం లాంటి పరిస్థితిగా అభివ ర్ణిస్తున్నారు. కానీ వాయు కాలుష్యానికి పరిష్కారాన్ని మాత్రం ఈ వర్ణన చూపడం లేదు. వ్యక్తిగత వాహనాల కొనుగోలుకు, వాటి ఉపయోగానికి ప్రోత్సాహకాలను అందిస్తున్న నగరాలను ఏలుతున్న  రాష్ట్ర లేదా పారా ప్రభుత్వ సంస్థలే ప్రజా రవాణా దిగజారుడుతనానికి కారణాలని దేశంలోని ఏ విధాన నిర్ణేతా అంగీకరించడం లేదు. చండీగఢ్, థానే వంటి కొన్ని నగరాల్లో రాజకీయ నేతల వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలను ఖూనీ చేస్తున్నారు. ప్రజా రవాణాను సమర్థవంతంగా విస్తరించకుండా సరి, బేసి సంఖ్యలతో వ్యక్తిగత వాహనాలను పరిమితం చేయడం అనేది ఫలితాలనివ్వదు. ఈ పద్ధతిని అమల్లోకి తీసుకురావడానికి చెబుతున్న కారణమే దాన్ని ముందుకు తీసుకుపోకుండా అడ్డగిస్తుంది.        

మహేష్ విజాపుర్కార్, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
 ఈమెయిల్: mvijapurkar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement