ఒబామాతో మోదీ సెల్ఫీ వద్దనుకున్నారా? | pm narendra modi intrested to Foreign Travel | Sakshi
Sakshi News home page

ఒబామాతో మోదీ సెల్ఫీ వద్దనుకున్నారా?

Published Tue, May 26 2015 10:48 AM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM

ఒబామాతో మోదీ సెల్ఫీ వద్దనుకున్నారా? - Sakshi

ఒబామాతో మోదీ సెల్ఫీ వద్దనుకున్నారా?

అమెరికా అధ్యక్షుడు ఒబామాతో సమావేశమైనప్పుడు, రోజూ తాను కేవలం 3 గంటలు నిద్రపోతానని చెప్పుకున్నారు నరేంద్ర మోదీ.
అందరు దేశాధిపతులతోనూ సెల్ఫీ తీసుకున్న మోదీ, ఒబామాతో మాత్రం దిగలేదు. విదేశీ పర్యటనల సందర్భంగా మోదీ అక్కడ నేతలతో సెల్ఫీలు దిగిన విషయం తెలిసిందే.
 
వాక్చాతుర్యం దండిగా ఉన్న నరేంద్ర మోదీ కలలను అమ్మి, ఓట్లు తెచ్చుకున్నాడు, ఏడాది పాలనలో ఆయన దేశానికి ఒరగ బెట్టింది ఏమీలేదని కాంగ్రెస్ ప్రముఖుడు కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. మోదీ అంటే (ఇంగ్లిష్ అక్షరమాల ప్రకారం ఎం ఒ డి ఐ అంటే) మర్డర్ ఆఫ్ డెమొక్రసీ అని ఆ పార్టీ విడుదల చేసిన ఐదు అధ్యాయాలు పత్రం లో పేర్కొన్నది. దీనిని కాంగ్రెస్ ప్రముఖుడు జైరాం రమేశ్ విడుదల చేశారు. ఎన్‌డీఏ -2 అంటే ఒకే వ్యక్తి చేస్తున్న తమాషా అని కాం గ్రెస్ తీర్మానించింది. ఆ విమర్శలు-

► మోదీ ఒక గగన విహారి. విదేశీ యాత్ర లతో తన ఇమేజ్‌ను ప్రవాసుల దగ్గర ఇనుమడింప చేసుకోవడమే ఆయన ధ్యేయం. ఆయన విదేశాలలో 53 రోజు లు పర్యటిస్తే, దేశంలో 48 రోజుల పాటే పర్యటించారు.

► మోదీ పాలన చేపట్టిన కొత్తలో ‘స్కిల్ ఇండియా’ గురించి పదే పదే చెప్పే వారు. ఆచరణలో మాత్రం ‘కిల్ ఇండి యా’, ‘కిల్ పార్లమెంట్’, కిల్లింగ్ ఆఫ్ జుడీషియరీ’ అన్న తీరులో వ్యవహ రిస్తున్నారు.

►నెహ్రూ కాలం నుంచి చాలాకాలం పాటు ప్రధానే విదేశీ వ్యవ హారాల శాఖ ను కూడా చూసేవారు. వాజపేయి జన తా హయాంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. అప్పుడు ఆయ నను ‘గగన విహారీ వాజపేయి’ అనే వారు. ఇప్పుడు మోదీని ‘సూపర్ గగన విహారీ’ అనాలి. విదేశీ పర్యటనలలో దేశ రాజకీయాల గురించి ప్రస్తావించిన చెడ్డపేరు కూడా మోదీకే దక్కుతుంది.

► రక్షణ వ్యయాన్ని కుదించడం ద్వారా ప్రధాని జాతీయ భద్రతతో చెలగాటం ఆడుతున్నారు.

► ఈ ఏడాది కాలమంతా ఆయన పార్ల మెంటుకు ముఖం చాటేస్తూనే ఉన్నారు. ఆయన పూర్తిగా పార్లమెంటు మీద శీత కన్ను వేశారు. జీఎస్‌టీ రాజ్యాంగ సవ రణ బిల్లు సమయంలో కూడా ప్రధాని సభలో లేరు. ఈ ఏడాది కాలంలో పార్ల మెంటు ముందుకు 53 బిల్లులు వచ్చా యి. కానీ అందులో ఐదంటే ఐదు మా త్రమే స్థాయీ సంఘం ముందుకు వెళ్లా యి. నిజానికి ముఖ్యమైన బిల్లులు అన్నీ స్థాయీ సంఘం ముందుకు వెళ్లాలి.

►  ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనల ద్వారా భారత్‌లో ఆశ్రీత పెట్టుబడులను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. ప్రతి పర్యటనలోను ఆయన వెంటనే పారి శ్రామికవేత్తలు బృందం ఉంటుంది. వారు అక్కడ వ్యాపార లావాదేవీల పని చూసుకుంటారు.

► దేశంలో చాలా విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్సలర్లు లేరు. భారత వైద్య మండలికి అధిపతిని నియమించలేదు. సీఎస్‌ఐఆర్ పరిస్థితి కూడా అంతే. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అం టే బీజేపీ ప్రకటించిన ‘పాలనలో పార దర్శకత’ మాటలకే పరిమితమవు తున్నది.

► ఈ ఏడాది కాలంలో విద్య, ఆరోగ్యం, తాగునీరు, పారిశుధ్యం, స్త్రీ శిశు సంక్షే మం వంటి వాటికి నిధులు కోత వేయ డంలో మోదీ ప్రభుత్వం నూటికి నూరు మార్కులు సాధించుకుంది.

► 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేయదలచి మోదీ భారత రైతాంగానికి చాలా నష్టం చేశారు. తద్వారా భూ ఆక్ర మణకు దారులు వేశారు. దీనికి వ్యతిరే కంగా పార్టీ పోరాడుతూనే ఉంటుంది.
 
లవ్ జీహాద్ వ్యతిరేక నినాదంతో, ఘర్ వాపసీ విధానంతో బీజేపీ దేశానికి ఎంతో చేటు చేసిందని కాంగ్రెస్ విమర్శించింది. చర్చిలమీద దాడి, క్రైస్తవ సన్యాసినిపై అత్యా చారం వంటి ఘటనలతో దేశం అప్రతిష్ట పాలైంది. ఇక బీజేపీ సభ్యులు కొందరు చేసి న వ్యాఖ్యలు దేశం పట్ల విశ్వసనీయతను దెబ్బతీశాయని పార్టీ ఆరోపించింది.


 కె. రాఘవేంద్ర
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement