
గుణపాఠం దేవుడెరుగు... చర్చలే మెరుగు
సరిహద్దులకవతల పాకిస్తాన్ పౌరులను అధికంగా హతమార్చడం ద్వారా ఆ దేశానికి గుణపాఠం నేర్పామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇది నిజంగా గుణపాఠమే అయితే ఈ ఒక్క ఘటనతో సరిహద్దు అవతల నుండి కాల్పులు శాశ్వతంగా ఆగిపోతాయని ఆయన హామీ ఇవ్వగలరా?
పాకిస్తాన్ వ్యవహారాలపై భారతీయ మీడియాలోని నిపుణులను విస్తృతార్థంలో రెండు బృందాలుగా విభజించవచ్చు. వీరిలో మొదటి బృందాన్ని అవతలి పక్షం మెతకవైఖరితో కూడుకున్నదిగా చూస్తుం టుంది. తొలి బృందంలోని వారు అన్ని సందర్భాల్లోనూ పాక్ ప్రభుత్వంతో నిల కడైన సంభాషణలను కొనసాగించాలని ప్రబోధిస్తుంటారు. పాకిస్తాన్‌లో సైన్య, రాజకీయ రంగాల మధ్య ఘర్షణ వాస్తవ మని, ఈ ఘర్షణే భారత్‌పై ప్రభావం చూపుతుంటుందని వీరి భావన.
ఈ బృందం అభిప్రాయం ప్రకారం భారత్ ప్రయోజనాల కోసం పాకిస్తాన్ రాజకీయ నేతలు శాంతి, పురోగతి మార్గంలో ఉండేలా చూడవలసిన అవసరముంది. దీనర్థం ఏమిటంటే కశ్మీరీ వ్యక్తులతో, బృందాలతో పాకిస్తాన్ హై కమిషనర్ చర్చలు జరపడం వంటి చికాకు కలిగించే ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ, పాక్ రాజకీయ నేతలతో మనం వ్యవహారాలు నడుపుతూనే ఉండాలి. ముంబయ్‌లో లష్కర్ ఇ తోయిబా దాడులు వంటి నిజమైన దురాగతాలు చోటు చేసుకుంటున్నప్పటికీ మనం పాకిస్తాన్ రాజకీయ వర్గాలతో చర్చలు జరుపుతూనే ఉండాలని ఈ బృందం అభిప్రాయం.
ఇక రెండవ బృందం విషయానికొస్తే దాన్ని అవతలి పక్షం కఠినవైఖరి గల బృందంగా లెక్కిస్తూంటుంది. పాకిస్తాన్ ప్రభుత్వ విధానం శిలాసదృశంగా, మార్పులేనితనంతో ఉంటుందని భావించేవారు ఈ బృందంలో ఉంటారు. భారత్ పట్ల విధానం, అభిప్రాయాలపై పాకిస్తాన్ సైన్యం ఎల్లప్పుడూ ఆధిపత్యం చలాయిస్తూంటుందని వీరి విశ్వాసం. ఈ చట్రంలో, పాకిస్థానీ రాజకీయనేతలు దుష్ట లేదా అసంబద్ధ స్వభావంతో ఉంటారు. పైగా భారత్ పట్ల పాకిస్తాన్ శాశ్వత శత్రుత్వాన్ని కొనసాగిస్తుందని ఈ బృందం అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో, దానికి గుణపాఠం నేర్పడం సాధ్యపడినప్పుడు, పాకిస్తాన్‌ను పట్టించుకోకుండా ఉండాలి. దాంతో నిజమైన ప్రయోజనం లేనందున, అన్ని వేళల్లో ఆ దేశంతో వ్యవహారాలకు దూరంగా ఉండాలి అని రెండో బృందం ఆలోచన.
గత రెండు దశాబ్దాలుగా భారత ప్రభుత్వ వ్యవస్థ ఆలో చనా ధోరణిపై ఈ రెండో బృందమే ఆధిపత్యం చలాయిస్తూ వచ్చింది. కొన్ని సందర్భాలను మినహాయిస్తే (పంజాబీలైన ఐకే గుజ్రాల్, మన్మోహన్‌సింగ్ హయాం మినహా) మృదు స్వభా వంతో ఆలోచించే నాయకులే భారత్‌లో లేకుండాపోయారు. భారతీయజనతాపార్టీ పాక్‌పట్ల దృఢవైఖరినే ప్రదర్శిస్తూవచ్చిం ది. అయితే ఇది సానుకూల ఫలితాలను సాధించలేదనుకోండి. బీజేపీ విధానాలు కొన్ని సందర్భాల్లో భారతీయ ప్రయోజనా లకు వ్యతిరేకంగా పరిణమించాయి కూడా.
కార్గిల్‌లో విద్రోహానికి గురైనంతవరకు నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్తాన్ పట్ల మెతకవైఖరి తోనే ఉన్నారని చెబుతుంటారు. కానీ వాస్తవమేమిటంటే, వాజ్ పేయి హయాంలోనే భారత్ తన అణు కార్యక్రమాన్ని ఆయు ధీకరించింది. ఎందుకంటే ఆయన ఆలోచనా విధానం అతివాద దృక్పథంలోనిదే. వాజపేయి హయాంలో జరిగిన రెండో వరుస పోఖ్రాన్ అణు విస్పోటనలు భారత్‌కు ఎలాంటి వాస్తవ ప్రయో జనాలను కలిగించలేదన్న సత్యాన్ని అంగీకరించాలి. నిజానికి దానికి విరుద్ధ ఫలితాలే సంభవించాయి. దీంతో పాకిస్తాన్ వెను వెంటనే అణుపరీక్షలు జరిపి సాయుధ సంసిద్ధతను సాధించింది.
దీంతో సాంప్రదాయిక అణ్వాయుధాలలో తనకున్న అనుకూలతను భారత్ కోల్పోయింది. ఈ అణు చ్ఛత్రం కిందే పాక్ వైపునుంచి మిలిటెంట్ వంచన, దురాగతాలు కొనసాగా యి. చివరకు నాటి దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ దీనికి అంతం పలికారు. డేటా సైతం దీన్ని బలపరుస్తోంది. 2001లో కశ్మీర్‌లో జరిగిన దాడుల, ప్రతిదాడుల ఘటనల్లో 4,507మంది చనిపోగా, 2012 నాటికి అవి 117కు తగ్గిపోయాయి. ఇందులో నూ 84 మంది మిలిటెంట్లు చనిపోయారు. గత సంవత్సరం కశ్మీర్‌లో దాడుల ఘటనల్లో 181 మంది చనిపోగా, ఈ సంవ త్సరం ఇంతవరకు 147 మంది చనిపోయారు. 1990 నుండి ఇంత తక్కువ మంది దాడుల్లో చనిపోవడం ఇదే తొలిసారి. అంటే కశ్మీర్‌లో మిలిటెంట్ హింస తగ్గిపోయినట్లే అని అర్థం.
ఉగ్రవాదాన్ని అనుమతించి చేయూతనిస్తున్న వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరుష పదాలతో ఖండించారు కానీ, పాకిస్తాన్ మద్దతుతో భారత్‌కు వ్యతిరేకంగా సాగుతున్న హింస పెద్దగా తగ్గింది లేదన్నదే వాస్తవం. కశ్మీర్‌లో హింసాత్మక చర్యలకు పాకిస్తాన్ మూలం అనే విషయాన్ని మనం గుర్తించకపోతే తప్ప, సమస్యను రాజకీయంగా పరిష్కరించేవరకు ఇలాంటి చర్యల స్థాయి కొనసాగుతుందని మనం అంగీకరించి తీరాలి.
కఠిన వైఖరికి ప్రతినిధి అయిన నరేంద్రమోదీ తన చర్యల పర్యవసానాలను ఏమాత్రం ఆలోచించకుండానే పాకిస్తాన్‌తో చర్చలను రద్దుచేశారని నా అభిప్రాయం. పాకిస్తాన్ గురించి చాలా కఠినంగా తను మాట్లాడి ఉండవచ్చు కానీ, చర్చల ప్రక్రియ రద్దుపై తన నిర్ణయాన్ని పక్కనబెట్టి ఆయన ఈ వారం శత్రువైన నవాజ్ షరీఫ్‌తో కరచాలనం చేయవలసివచ్చింది. కొందరు అంచనా వేసినట్లుగా తప్పనిసరైంది కాబట్టే మోదీ అలా చేయవలసి వచ్చింది. ఎందుకంటే మోదీ విధానం ఇక్కడో లేదా మరెక్కడో లేదు. ఆయనది కేవలం అంగవిన్యాసం మాత్రమే. భరించలేనప్పుడు, ఆచరణ సాధ్యం కానప్పుడు కఠినంగా వ్యవహరించడం, గడుసుతనాన్ని ప్రదర్శించడమే ఇది. అయితే ఈ అవసరార్థ మండిపాటుతనం భారతీయులకు తీసుకొచ్చే ప్రయోజనం ఏమిటి?
బీజేపీలోకాని, మీడియాలో ఉన్న దాని అతివాద మద్దతుదారులలో కాని ఏ ఒక్కరు కూడా దీన్ని వివరించలేరు. సరిహద్దుల్లోని మన పౌరులను వారు చంపుతున్న దానికంటే అధిక సంఖ్యలో వారి పౌరులను అధికంగా చంపడం ద్వారా తాను పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పానని ఇటీవలివరకు రక్షణ మంత్రిగా వ్యవహరించిన అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇది నిజంగా గుణపాఠమే అని భావించినట్లయితే చాలామంది భారతీయులు దీంతో ఏకీభవించరు. ఈ ఒక్క ఘటనతో సరిహద్దు అవతల నుండి కాల్పులు శాశ్వతంగా ఆగిపోతాయని జైట్లీ హామీ ఇవ్వగలరా? అలాంటి హామీ ఆయన ఇవ్వలేకపోతే, పరిణామాలు వేడెక్కినప్పుడు వాటిని చల్లబర్చడానికి బదులుగా పాకిస్తాన్‌తో చర్చించకుండా, కలసి శాంతికి కృషి చేయకుండా మనం సాధించే ప్రయోజనం ఏమిటి?
శాంతి ప్రతిపాదనల కంటే పాక్ పట్ల కఠినంగా ఉండాలనే వైఖరి ఏమంత దృఢమైంది కాదు. గత 20 ఏళ్లుగా ఇది స్పష్టమవుతూనే వచ్చింది. వాస్తవాలు దీన్ని సూచిస్తున్నాయి కూడా. బీజేపీ ఉపఖండాన్ని అణుయుద్ధ క్షేత్రంగా మార్చింది కాబట్టి, పాకిస్తాన్‌పై కండబలాన్ని ప్రదర్శించేంత బలం భారత్‌కు లేదు. కశ్మీర్‌పై అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని భారత్ తిరస్కరిస్తోంది. కనీసం ఈ క్షణంలో భారత్, పాకిస్తాన్‌తో చర్చించబోదు. అయితే ఈ పరిస్థితి మారనుంది. భారత్ దాంతోపాటు పాక్ పట్ల కఠినవైఖరిని ప్రదర్శిస్తున్న బృందం కాస్త లొంగిపోయే, లోబడే క్రమంలోకి ఇది ప్రయాణించనుంది.
(వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)
- ఆకార్ పటేల్