మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి హైదరాబాద్లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
క్షతగాత్రుల వివరాలు: శ్రీకర్ పద్మారావునగర్ (సికింద్రాబాద్ ), రాజేష్ బీహెచ్‌ఈఎల్ ఓల్డ్ ఎమ్‌ఐజీ (ఇన్ఫోటెక్ ఉద్యోగి),
యోగేష్ గౌడ బెంగళూరు ( టోలిచౌకి ) మాదాపూర్ గోల్ప్ కోర్ట్ కోచ్, జయసింగ్, బాషా ( ఉత్తరప్రదేశ్ ) ....
వీరిలో యోగేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మిగతా నలుగురు 30 శాతం గాయపడినట్లు అపోలో ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ తమిల్లా తెలిపారు. ఎమర్జెన్సీ విభాగంలో వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44 మంది ప్రయాణీకులు సజీవ దహనమైయారు. కొత్తకోట మండలం పాలెం ఎన్హెచ్ 44పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాధమిక సమాచారం అందింది. వేగంగా వెళ్లి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
బస్సులో ఉన్న 49 మందిలో కేవలం నలుగురు మాత్రమే బతికి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణీకులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ప్రయాణీకుల ఆర్తనాదాలు విన్న సాక్షి ప్రతినిధి 108కి సమాచారం అందించారు.
గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 49 మంది ప్రయాణీకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 44 మంది సజీవ దహనమైనట్టు సమాచారం.
నలుగురైదుగురు బస్సు అద్దాలు పగలకొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగే సమయంలో ప్రయాణీకులు గాఢ నిద్రలో ఉన్నారు. వారంతా నిద్రలోనే మృత్యువడికి చేరుకున్నారు. బస్సు డ్రైవర్, క్లీనర్ కూడా ప్రాణాలు దక్కించుకున్నారు.