
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు కృష్ణా జిల్లా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. వేలాది మంది ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు రాజన్న బిడ్డతో కలిసి అడుగులేస్తున్నారు. ప్రత్యేక హోదాకు మద్ధతుగా సోమవారం పాదయాత్రకు విరామం ప్రకటించగా, మంగళవారం నుంచి తిరగి ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా 138వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదలైంది. ముత్యాలంపాడు శివారు నుంచి వైఎస్ జగన్ మంగళవారం పాదయాత్ర ప్రారంభిస్తారు. ముత్యాలంపాడు, ఎత్కూరు, మీదుగా చెవుటూరు చేరుకుంటారు. అనంతరం లంచ్ విరామం తీసుకుంటారు.
మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలను తెలసుకుంటూ ముందుకు సాగనున్నారు. కుంటముక్కల క్రాస్, గుర్రాజు పాలెం మీదుగా మైలవరం చేరుకొని బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను మీడియాకు విడుదల చేశారు.