
సాక్షి, ప్రత్తిపాడు/తూర్పుగోదావరి : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 231వ రోజు మంగళవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి శంఖవరం, శృంగవరం, బంగారయ్యపేట మీదుగా రౌతులపూడి వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. కాగా, వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ పాదయాత్ర సాగిస్తున్నారు.ఇప్పటి వరకు ఆయన 2666.9 కిలోమీటర్లు నడిచారు.