సాక్షి, ప్రత్తిపాడు/తూర్పుగోదావరి : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 234వ రోజు శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో మండలంలోని డీజేపురం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి తుని నియోజకవర్గంలో అడుగుపెట్టిన వైఎస్ జగన్‌కు అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తోంది. ఆయన రాకతో నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది.
కొత్త వేలంపేట, సీతయ్యపేట, లోవకొత్తూరు, తాల్లూరు జంక్షన్, జగన్నాథగిరి మీదుగా తుని వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ పాదయాత్ర 2700 కిలోమీటర్ల మైలురాయిని దాటనుండటం విశేషం. అందుకు గుర్తుగా ఆ ప్రాంతంలో వైఎస్ జగన్ పార్టీ జెండాను ఎగురవేసి.. ఒక మొక్కను కూడా నాటుతారు. లంచ్‌విరామం అనంతరం తుని చేరుకోనున్న వైఎస్ జగన్ అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మరో రెండురోజుల్లో తుని నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకుని మంగళవారం నాటికి విశాఖ జిల్లాలోకి అడుగు పెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment