సాక్షి, హైదరాబాద్: రైతుల కష్టాలు అర్థం కావాలంటే సీఎం పొలంబాట పట్టాలని బీజేపీ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఈ ఏడాది చాలా మంది రైతులు పత్తిసాగు చేశారు.
కాయ పగిలే సమయంలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి వారికి తగిన పరిహారం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ భీమా పథకాన్ని రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment