
రోజా (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి/చిత్తూరు : ప్రజా సమస్యలపై గళమెత్తిన నేతలపై టీడీపీ ప్రభుత్వం కన్నెర్రె చేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగిరి ఎమ్మెల్యే ఆర్.కే రోజాపై అక్రమ కేసులు పెట్టి అణిచివేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల 27న నగిరిలో ఇసుక క్యారీ లారీ ఢీకొని మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. దానికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి రోజా నిరసన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారంటూ ఎమ్మెల్యేపై అభియోగం మోపారు. ప్రజల పక్షాన పోరాడుతున్న నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.