
సాక్షి, విజయవాడ : కొడంగల్ ఎమ్మెల్యే, టీటీడీపీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాజీనామాపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనూహ్యంగా స్పందించారు. రేవంత్ రాజీనామా విషయం తనకు తెలియదని, ఒకవేళ అలా జరిగినా పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘పార్టీలో అప్పుడప్పుడూ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొందరు.. వాళ్ల వాళ్ల భవిష్యత్ అవసరాలను బట్టి వెళ్లిపోతుంటారు. అయినా పార్టీలోకి ఎంతో మంది వస్తుంటారు.. పోతుంటారు! అలాంటివాళ్లతో ఎలాంటి నష్టం ఉండదు’’ అని చంద్రబాబు పరోక్షంగా రేవంత్‌ను ఉద్దేశించి అన్నారు.
బాబును కలవకుండానే రాజీనామా! : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు శనివారం విజయవాడ వెళ్లిన టీటీడీపీ నేతల బృందంలో రేవంత్ కూడా ఉన్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రితో ముఖాముఖి కాకుండానే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం పేషీలో కార్యదర్శికి రేవంత్ తన రాజీనామా లేఖను ఇచ్చేసి బయటికి వచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment