బీజేపీ దూకుడుకు బ్రేక్‌.. కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌ | Congress gives shock to BJP in local body elections | Sakshi
Sakshi News home page

బీజేపీ దూకుడుకు బ్రేక్‌.. కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌

Published Fri, Oct 13 2017 12:02 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress gives shock to BJP in local body elections - Sakshi

సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

నాందేడ్‌: నాందేడ్‌–వాఘాలా మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌డబ్ల్యూ ఎంసీ)కు ఇటీవల జరిగిన  ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. 54 స్థానాలకు గురువారం ఫలితాలు ప్రకటించగా అందులో  గాను 49 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీకి మూడింటిని గెలుచుకోగా శివసేన ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. దీంతో ఈ ఎన్నికల్లో ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలోని శివసేన మూడోస్థానానికి పరిమితమైంది. మరోవైపు అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎంకు కూడా దెబ్బతగిలింది. ఈ పార్టీకి ప్రస్తుతం 11 మంది కార్పొరేటర్లు ఉండగా అది ఇప్పుడు శూన్యమైపోయింది. ఎన్నికల సందర్భంగా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న మహారాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు అశోక్‌చవాన్‌కు ఈ ఫలితాలు ఎనలేని సంతోషాన్నిచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement