అవినీతి సర్కార్‌పై పోరుకు సిద్ధంకండి | DCC President Katakam Mruthyunjayam Criticize On KCR | Sakshi
Sakshi News home page

అవినీతి సర్కార్‌పై పోరుకు సిద్ధంకండి

Published Wed, Jul 11 2018 11:56 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

DCC  President Katakam Mruthyunjayam Criticize On KCR - Sakshi

మాట్లాడుతున్న శ్రీనివాసన్‌ క్రిష్ణన్‌

కరీంనగర్‌: రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని, అవినీతి సర్కార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు అంతిమపోరుకు సిద్ధం కావాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సమావేశం మంగళవారం డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగింది. 13 నియోజక వర్గాలకు సంబంధించిన బూత్,మండల, పట్టణ అధ్యక్షులతో పాటు ఆయా నియోజక వర్గాల ఇన్‌చార్జీలతో ఏఐసీసీ జాతీయ కార్యదర్శి, పది జిల్లాల ఇన్‌చార్జి శ్రీనివాసన్‌ క్రిష్ణన్‌ కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడంతో పాటు రానున్న ఎన్నికల్లో పార్టీ సంస్థాగతంగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన విషయాలపై దిశా నిర్దేశనం చేశారు. సమావేశానికి పీసీసీ నుంచి జిల్లా ఇన్‌చార్జీలుగా బి.మహేశ్‌కుమార్‌గౌడ్, గడుగు గంగాధర్, నర్సింహారెడ్డిలు హజరయ్యారు.

కరీంనగర్‌ నుంచే టీఆర్‌ఎస్‌ అంతం: జీవన్‌రెడ్డి 
తెలంగాణ ఉద్యమానికి పురుడుపోసి టీఆర్‌ఎస్‌ పార్టీకి అండగా నిలిచిన కరీంనగర్‌ జిల్లా నుంచే అధికార పార్టీని అంతమొందించాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రం ఏర్పడకముందు 60 వేల కోట్ల అప్పులో ఉన్న రాష్ట్రాన్ని నాలుగేళ్లల్లో రూ.2లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దింపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎద్దేవా చేశారు. ప్రజల నడ్డివిరుస్తున్నా టీఆర్‌ఎస్‌కు కరీంనగర్‌ నుంచే ఘోరి కట్టాలని పిలుపునిచ్చారు.
 
కేటీఆర్‌ తీరు మార్చుకోవాలి: శ్రీధర్‌బాబు 
తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీయేనని ఢిల్లీలో సోనియాగాంధీ ఇంటికి వెళ్లి కేసీఆర్‌ కుటుంబం కాళ్లు మొక్కిన విషయాన్ని మరిపోవద్దని, మంత్రి కేటీఆర్‌ మాట్లాడే తీరు మార్చుకోవాలని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అవలంబిస్తున్న వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నడుం బిగించాలని కోరారు. రానున్న రోజుల్లో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలనిత పిలుపునిచ్చారు.
 
ఎన్నికల హామీలపై నిలదీయండి: పొన్నం 
టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హా మీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న టీఆర్‌ఎస్‌ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా తయారు కావాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కోరారు. 60 ఏళ్లల్లో జరిగిన అభివృద్ధి అంతా తామే నాలుగేళ్లల్లో చేశామని టీఆర్‌ఎస్‌ జబ్బలు చర్చుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

అవినీతి సర్కార్‌కు చరమగీతం 
పాడండి: ఆరెపల్లి 
గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతి పాలన కొనసాగిస్తుందని టీపీసీసీ ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ టీఆర్‌ఎస్‌ తీరుపై «ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలను లెక్కచేయకుండా నియంతపాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌కు రానున్న ఎన్నికల్లో పుట్టగతులు లేకుండా చేయాలని కార్యకర్తలకు సూచించారు.
 
కాంగ్రెస్‌దే అధికారం: కటుకం 
టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, నాలుగేళ్లల్లో ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని డీసీసీ అధ్యక్షులు కటుకం మృత్యుంజయం అన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు చిన్నచిన్న విభేదాలు ఉంటే విడనాడి పార్టీ పటిష్టతకై పనిచేయాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, సుద్దాల దేవయ్య, బొమ్మ వెంకన్న, సీహెచ్‌ విజయరమణారావు, కోడూరి సత్యనారాయణగౌడ్, కోమిరెడ్డి రాములు, వేణుగోపాల్‌ హర్కార్, ఆయా నియోజక వర్గాల నాయకులు చల్మెడ లక్ష్మినర్సింహారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, గజ్జెల కాంతం, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, కొనగాల మహేశ్, గీట్ల సబితారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, పారిపాటి రవీందర్‌రెడ్డి, ప్యాట రమేశ్, రేగులపాటి రమ్యరావు, చేతి ధర్మయ్య, ఈర్ల కొమురయ్య, వెంకట్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కొమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ అనుబం«ధ విభాగాల అధ్యక్షులు  దిండిగాల మధు, ఉప్పరి రవి, నాగి శేఖర్, రాంచందర్‌నాయక్, కర్ర రాజశేఖర్, ఆకుల ప్రకాష్, అంజనీకుమార్, గందె మాధవి మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

వారసుల కోసమే రాజకీయ సన్యాసం

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

పాల్గొన్న 13 నియోజకవర్గాల నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement