TSR
-
చిత్ర పరిశ్రమ అభివృద్ధికి జగన్ భరోసా ఇచ్చారు
‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిగారిని నేను కలిసినప్పుడు సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలపైన చర్చ జరిగింది. తెలుగు పరిశ్రమ అభివృద్ధికి ఏం కావాలన్నా చేస్తానని భరోసా ఇచ్చారు. నంది అవార్డులు గత రెండేళ్లుగా ఇవ్వకుండా ఆపేశారు.. వాటిని మళ్లీ అందివ్వాలని కోరాను. అందుకు ఆయన ‘చెప్పండి అన్నా.. మీరందరూ అనుకుని చెబితే తిరిగి ప్రారంభిద్దామని సుముఖంగా స్పందించారు’’ అన్నారు చిరంజీవి. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’(మా) 2020 డైరీ ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, టీఎస్సాయర్ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ– జగన్ గారితో ‘సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు?’ అని అడిగితే.. ‘ఆ శాఖని ఇంకా కేటాయించలేదు. త్వరలో పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్‌కి లేక మరొకరికి కేటాయిస్తాను. సంబంధిత శాఖ కార్యదర్శిని మీ వద్దకు పంపిస్తా.. ఎలా చేద్దాం ఏంటన్నది మీరందరూ మాట్లాడండి’ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. జగన్‌గారికి చిత్ర పరిశ్రమకు ఎంతో చేయాలని ఉంది. అయితే వారు వెళుతున్న విధానంలోకి మనలాంటి వాళ్లు వెళితే కానీ ఒక రూపం రాదనుకుంటున్నా. మోహన్‌బాబు, మురళీమోహన్గార్లు, నేను... మరికొందరు కలిసి వెళ్లి మార్చికో, ఉగాదికో ‘నంది’ అవార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. అదే విధంగా ‘చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్నా చేస్తాం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చెప్పారు. ‘మా’ సంఘానికి 3 ఎకరాలు స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సాయంతో చిత్ర పరిశ్రమను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ఏకాభిప్రాయంతో వెళ్లాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి తెలుగు ఇండస్ట్రీకి, ‘మా’కి మంచి పేరు తీసుకురావాలి. చిన్న చిన్న సమస్యలుంటే సర్దుకుపోదాం. మంచి ఉంటే మైకులో చెబుదాం.. చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం. ‘మా’లో గతంలో పెద్దగా విభేదాలు లేవు. కానీ మాకంటే ఎక్కువ సేవ చేయాలనే కసితో ప్రస్తుత బాడీ ఉంది. దానివల్ల కొన్ని విభేదాలు తలెత్తాయి. వాటిని సమన్వయం చేసుకుందాం. స్వలాభం కోసం కాకుండా కళామతల్లి గర్వపడే బిడ్డలుగా ముందుకు వెళ్లాలి’’ అన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘అసోసియేషన్ అంటే చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి.. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. ‘మా’ గురించి ఎవరూ బయట మాట్లాడకూడదు. ‘మా’ గౌరవాన్ని నిలబెట్టాలి’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘కళాకారులను గౌరవించి, సాయం చేసే టి.సుబ్బరామిరెడ్డిగారిలాంటి గొప్ప వ్యక్తి ముందు నేడు ఇలాంటి గొడవలు జరగడం బాధాకరం. భగవంతుడి సాక్షిగా నాకు, చిరంజీవికి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నా కుటుంబమే ఆయన కుటుంబం. ఆయన కుటుంబమే నా కుటుంబం. ‘మా’లో గొడవలు జరుగుతున్న మాట వాస్తవం. ‘మా’ ఎవడి సొత్తు కాదు. సవాళ్లు చేసుకోవడం మానేసి కలిసి పనిచేద్దాం’’ అన్నారు. ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ – ‘‘మార్చిలో జరిగిన ‘మా’ ఎన్నికల నుంచి ఇప్పటి వరకూ అసోసియేషన్ కోసం ఎక్కువ సమయం కేటాయించడంతో సినిమా కూడా చేయలేకపోయాను. ‘మా’ కోసం చాలా మెంటల్ టెన్షన్‌తో వర్క్ చేస్తున్నందుకు మా ఇంట్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. వాటివల్లే ఇటీవల నా కారుకి ప్రమాదం చోటు చేసుకుంది. ‘మా’లో ఉన్నవి చిన్న చిన్న సమస్యలే కాబట్టి సర్దుకుపోయి పని చేయాలని చిరంజీవిగారు చెప్పడం సంతోషమే. కానీ ‘మా’లో పెద్ద గొడవలున్నాయి. నిప్పును కప్పిపుచ్చితే పొగ రాకుండా ఉండదు. రీల్ లైఫ్‌లోలా రియల్ లైఫ్‌లోనూ హీరోలా పని చేద్దామంటే కొందరు నొక్కేస్తున్నారు.. తొక్కేస్తున్నారు’’ అన్నారు. ‘‘రాజశేఖర్గారిది చిన్నపిల్లల మనస్తత్వం. ఆయన మాటలకు క్షమాపణ కోరుతున్నా’’ అన్నారు జీవిత. అందుకే రాజీనామా చేశా – రాజశేఖర్ గురువారం ఉదయం ‘మా డైరీ’ ఆవిష్కరణ అనంతరం సాయంత్రం రాజశేఖర్ ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా ఓ ప్రకటన ద్వారా వివరించారు. ‘‘మా’ అసోసియేషన్‌కు ఎంతో మంచి చేయాలనుకున్నాను. కానీ ‘మా’ ప్రెసిడెంట్ నరేశ్‌గారు కమిటీ సభ్యులను కించపరుస్తూ, తక్కువ చేస్తూ వస్తున్నారు. వీటన్నింటినీ పరిష్కరించుకొని ముందుకువెళ్లాలని నా వంతు కృషి చేశాను. కానీ నరేశ్‌గారు పారదర్శకతను మరిచి తనకు నచ్చిన విధంగా నడుచుకుంటున్నారు. ‘మా’ డైరీ వేడుకలో నరేశ్‌గారు మాట్లాడింది ఏదీ కమిటీ సభ్యులతో చర్చించలేదు. జీవితకు వాట్సాప్ మెసేజ్ మాత్రం పంపారు. ఇండస్ట్రీ పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో మాకున్న విభేదాలను చర్చించాం. కానీ ఆయనలో మార్పేం లేదు. అందుకే ఈ రోజు వేడుకలో నా ఎమోషన్స్ బయటపెట్టాను. నేను చాలా సున్నితమైన మనిషిని. ముక్కుసూటిగా వ్యవహరిస్తాను. నరేశ్‌గారు వ్యవహరిస్తున్న తీరు నచ్చడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా పదవికి రాజీనామా చేస్తున్నాను. నా ఎమోషన్స్‌ను సరిగ్గా అర్థం చేసుకుంటారనుకుంటున్నా’’ అని రాజశేఖర్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘మా’ వేడుకలో ఆత్మీయంగా మోహన్‌బాబు, చిరంజీవి చదవండి: హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం మోహన్‌బాబును ఆలింగనం చేసుకున్న చిరంజీవి ‘మా’ విభేదాలు.. స్పందించిన జీవితా రాజశేఖర్ ‘మా’లో రచ్చ.. రాజశేఖర్‌పై చిరంజీవి ఆగ్రహం నాకు పదవీ వ్యామోహం లేదు -
ఎక్కడ తేడా..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల ఓటింగ్ సరళిపై తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం పూర్తిస్థాయిలో విశ్లేషిస్తోంది. తెలం గాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని ఆ పార్టీ అంచనాలు వేసిన సీట్లలో కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి రెండు స్థానాలు ఉన్నప్పటికీ... బీజేపీ బలం పెరగడంపై ఆరా తీస్తోంది. ప్రధానంగా కరీంనగర్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇవ్వడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వేలాది ఓట్ల మెజారిటీ వచ్చిన నియోజకవర్గాల్లో సైతం కమల వికాసం గురించి చర్చలు జరుగుతుండడంపై ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఆందోళనకు కారణమవుతోంది. గ్రామాల నుంచి మండల, అసెంబ్లీ స్థాయిల వరకు పటిష్టమైన యంత్రాంగం టీఆర్ఎస్ సొంతమైతే... పట్టణాల్లో తప్ప పల్లెల్లో పెద్దగా ప్రభావం చూపని పార్టీగా బీజేపీ ఉంది. కాంగ్రెస్‌కు ఉన్న ఓటుబ్యాంకు కూడా గ్రామాల్లో బీజేపీకి లేదు. అలాంటి పార్టీ గెలిచేస్తోంది అనే ప్రచారం జరగడానికి గల కారణాలను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వంతోపాటు ఎమ్మెల్యేలు కూడా విశ్లేషించే పనిలో పడ్డారు. ఏడుగురు ఎమ్మెల్యేలు, 90 శాతానికి పైగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు టీఆర్ఎస్ వాళ్లే ఉండగా, బీజేపీ గెలిచిపోతుందనే ప్రచారం ఎందుకు జరుగుతోందని ఆ పార్టీ నేతలు తల పట్టుకుంటున్నారు. గ్రామాల వారీగా సేకరించిన లెక్కల ప్రకారం టీఆర్ఎస్ 2లక్షల మెజారిటీతో గెలుస్తుందని చెపుతున్నప్పటికీ, అంతు చిక్కని పోలింగ్ సరళితో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్లే ఉన్నా... కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అధిష్టానం నుంచి వచ్చిన కచ్చితమైన ఆదేశాలతోపాటు ప్రతీ ఒక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్ విజయం కోసం అహోరాత్రులు శ్రమించారనడంలో ఎలాంటి తేడా లేదు. రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ 20 రోజులుగా వినోద్‌కుమార్ గెలుపు కోసం ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూనే ప్రచారంలో నిమగ్నమయ్యారు. మంత్రి, ఎమ్మెల్యేల సతీమణులు, కుటుంబసభ్యులు కూడా కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేల వరకు టీఆర్ఎస్ అభ్యర్థి కోసం శ్రమించినా, రెండో శ్రేణి నాయకుల్లో కొందరు బీజేపీకి పరోక్షంగా మద్ధతు పలికినట్లు తెలుస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్‌లోని కొందరు కార్పొరేటర్లతోపాటు గ్రామాల్లో కొందరు ప్రజాప్రతినిధులు కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారనే సమాచారాన్ని ఆ పార్టీ నేతలు ఇప్పటికే సేకరించారు. మంత్రి ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌లో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలను బీజేపీ నేతలు కూడా తోసిపారేయడం లేదు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్కు పోటీ ఇచ్చారే తప్ప బీజేపీ కాదనేది స్పష్టమవుతోంది. అలాగే సిరిసిల్ల, హుస్నాబాద్‌లలో కూడా టీఆర్ఎస్కు మొగ్గు ఉంటుందని చెబుతున్నారు. మిగతా నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం టీఆర్ఎస్తో బీజేపీ నువ్వా నేనా అనే స్థాయిలో ఢీకొట్టిందని పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతోంది. కరీంనగర్ అసెంబ్లీ పరిస్థితులకు మిగతా చోట్లకు తేడా ఉన్నా... కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ 2009, 2014లలో పోటీ చేసి ఓడిపోయారు. 48వ డివిజన్ కార్పొరేటర్‌గా కూడా వ్యవహరిస్తున్న సంజయ్‌కు కరీంనగర్లో గట్టిపట్టు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే గెలిచినంత పనిచేసిన సంజయ్ 14వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ మైనారిటీ వర్గం బలంగా ఉండడంతో మెజారిటీ వర్గాల్లో బీజేపీ పట్ల సానుకూలత ఉంది. కానీ గ్రామీణ ఓటర్లు అధికంగా ఉండే మానకొండూరు, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్లు పడ్డట్టు వస్తున్న సమాచారం టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడడం లేదు. ఈ నియోజకవర్గాల్లో పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామాల్లో కూడా బీజేపీకి ఓట్లు పడ్డాయా అన్నదే ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాలు ఆరా తీస్తున్న అంశం. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఓట్లు రాలుస్తాయని టీఆర్ఎస్ భావిస్తుండగా, యువత, కొత్త ఓటర్ల ప్రభావం ఆయా కుటుంబాలపై పడిందని, బీజేపీకి గ్రామాల్లో కూడా ఆధిక్యత లభిస్తుందని ఆ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ ‘సాక్షి ప్రతినిధి’తో వ్యాఖ్యానించారు. హిందుత్వం, మోదీ ప్రచారాస్త్రాలుగా.. కరీంనగర్ అసెంబ్లీలో ఓడిపోయిన తరువాత బండి సంజయ్ పార్లమెంటుపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. కరీంనగర్లో 60వేల ఓట్లు కురిపించిన హిందుత్వ నినాదాన్ని గ్రామ స్థాయిలో విస్తరించేందుకు అప్పటి నుంచే పావులు కదిపారు. పార్లమెంటు పరిధిలోని బీజేపీ నేతలు, అనుబంధంగా పనిచేసే ఏబీవీపీ, విశ్వహిందూ పరిషత్, ఆరెస్సెస్ వంటి సంస్థల నాయకులతో సంబంధాలు పెంచుకొని చాపకింది నీరులా విస్తరించే ప్రయత్నం చేశారు. రెండుసార్లు ఓడిపోయాడనే సానుభూతితోపాటు హిందుత్వ నినాదం కూడా బలంగా వ్యాపింపజేయడంలో కృతకృత్యులయ్యారు. వీటికి తోడు దేశ సరిహద్దుల్లో చోటు చేసుకున్న యుద్ధ వాతావరణం, మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు యువతకు బీజేపీని కొంత దగ్గరికి చేర్చింది. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు కాదనే వాదన కూడా కొంత పనిచేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. వీటన్నింటి పరిణామాల్లో పెరిగిన బీజేపీ ఓట్లు సంజయ్‌ను గట్టెక్కిస్తాయో లేదో తెలియదు గానీ గులాబీ శిబిరంలో మాత్రం తెలియని ఆందోళనకు కారణమవుతోంది. -
టి.ఎస్.ఆర్ అవార్డ్స్ 2019 ప్రెస్ మీట్ ..’చిత్రాలు’…
-
అవినీతి సర్కార్‌పై పోరుకు సిద్ధంకండి
కరీంనగర్: రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని, అవినీతి సర్కార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతిమపోరుకు సిద్ధం కావాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం మంగళవారం డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగింది. 13 నియోజక వర్గాలకు సంబంధించిన బూత్,మండల, పట్టణ అధ్యక్షులతో పాటు ఆయా నియోజక వర్గాల ఇన్‌చార్జీలతో ఏఐసీసీ జాతీయ కార్యదర్శి, పది జిల్లాల ఇన్చార్జి శ్రీనివాసన్ క్రిష్ణన్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు రానున్న ఎన్నికల్లో పార్టీ సంస్థాగతంగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన విషయాలపై దిశా నిర్దేశనం చేశారు. సమావేశానికి పీసీసీ నుంచి జిల్లా ఇన్‌చార్జీలుగా బి.మహేశ్‌కుమార్‌గౌడ్, గడుగు గంగాధర్, నర్సింహారెడ్డిలు హజరయ్యారు. కరీంనగర్ నుంచే టీఆర్ఎస్ అంతం: జీవన్‌రెడ్డి తెలంగాణ ఉద్యమానికి పురుడుపోసి టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచిన కరీంనగర్ జిల్లా నుంచే అధికార పార్టీని అంతమొందించాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రం ఏర్పడకముందు 60 వేల కోట్ల అప్పులో ఉన్న రాష్ట్రాన్ని నాలుగేళ్లల్లో రూ.2లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దింపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎద్దేవా చేశారు. ప్రజల నడ్డివిరుస్తున్నా టీఆర్ఎస్కు కరీంనగర్ నుంచే ఘోరి కట్టాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ తీరు మార్చుకోవాలి: శ్రీధర్‌బాబు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీయేనని ఢిల్లీలో సోనియాగాంధీ ఇంటికి వెళ్లి కేసీఆర్ కుటుంబం కాళ్లు మొక్కిన విషయాన్ని మరిపోవద్దని, మంత్రి కేటీఆర్ మాట్లాడే తీరు మార్చుకోవాలని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నడుం బిగించాలని కోరారు. రానున్న రోజుల్లో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలనిత పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలపై నిలదీయండి: పొన్నం టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హా మీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న టీఆర్ఎస్ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా తయారు కావాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు. 60 ఏళ్లల్లో జరిగిన అభివృద్ధి అంతా తామే నాలుగేళ్లల్లో చేశామని టీఆర్ఎస్ జబ్బలు చర్చుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అవినీతి సర్కార్‌కు చరమగీతం పాడండి: ఆరెపల్లి గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పాలన కొనసాగిస్తుందని టీపీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ టీఆర్ఎస్ తీరుపై «ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలను లెక్కచేయకుండా నియంతపాలన సాగిస్తున్న టీఆర్ఎస్కు రానున్న ఎన్నికల్లో పుట్టగతులు లేకుండా చేయాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్‌దే అధికారం: కటుకం టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, నాలుగేళ్లల్లో ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని డీసీసీ అధ్యక్షులు కటుకం మృత్యుంజయం అన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చిన్నచిన్న విభేదాలు ఉంటే విడనాడి పార్టీ పటిష్టతకై పనిచేయాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, సుద్దాల దేవయ్య, బొమ్మ వెంకన్న, సీహెచ్ విజయరమణారావు, కోడూరి సత్యనారాయణగౌడ్, కోమిరెడ్డి రాములు, వేణుగోపాల్ హర్కార్, ఆయా నియోజక వర్గాల నాయకులు చల్మెడ లక్ష్మినర్సింహారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, గజ్జెల కాంతం, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, కొనగాల మహేశ్, గీట్ల సబితారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, పారిపాటి రవీందర్‌రెడ్డి, ప్యాట రమేశ్, రేగులపాటి రమ్యరావు, చేతి ధర్మయ్య, ఈర్ల కొమురయ్య, వెంకట్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కొమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అనుబం«ధ విభాగాల అధ్యక్షులు దిండిగాల మధు, ఉప్పరి రవి, నాగి శేఖర్, రాంచందర్‌నాయక్, కర్ర రాజశేఖర్, ఆకుల ప్రకాష్, అంజనీకుమార్, గందె మాధవి మహేశ్ తదితరులు పాల్గొన్నారు. వారసుల కోసమే రాజకీయ సన్యాసం -
మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లోకి
కరీంనగర్ : అలుపెరుగని పోరాటం చేసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణను సమగ్రాభివృద్ధి చేయడంలో ప్రజలంతా భాగస్వాములు కావాల ని, బంగారు తెలంగాణ అభివృద్ధికి బాటలు వేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకులు చిట్టుమల్ల శ్రీనివాస్, నాగమల్ల మధుసూదన్, ఎలగందుల మునీందర్, యాద అంజయ్య, నగునూరి రాజేందర్, ఏవీ మల్లిఖా ర్జున్, మంచాల సుధాకర్‌తోపాటు 2 వేల మంది ఆర్యవైశ్య ప్రముఖులు, కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆర్యవైశ్య నేతలకు, కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు తటస్థంగా ఉంటూ వ్యాపారం చేసుకునే ఆర్యవైశ్యులు టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయం తీసుకోవడం శుభసూచకమని, రానున్న 2019 ఎన్నికల ఫలితాల విజయానికి దిక్సూచిగా మిగిలిపోతుందని అన్నారు. కరీంనగర్ జిల్లా అంటే టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు అత్యంత అభిమానమని, తొలినాళ్లలో సింహగర్జన బహిరంగ సభ మొదలుకొని నేటి వరకు టీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ తెలంగాణ ఆవశ్యకతను ఢిల్లీ పెద్దలకు చాటిచెప్పిన ఘనత కరీంనగర్ జిల్లా ప్రజలదని అన్నారు. 2006 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు పునర్జన్మనిచ్చిన ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయా పార్టీలు టీఆర్ఎస్కు ఉద్యమాలు, ధర్నాలు చేయడం తెలుసు, పరిపాలన మీతో సాధ్యం కాదని హేళన చేశారని గుర్తు చేశారు. ‘కరెంట్ ఉండదు, తెలంగాణ వస్తే చీకటిగా మారుతుందని, తెలంగాణ వారికి తెలివి లేదన్న’ వారి మాటలను పటాపంచలు చేస్తూ నాలుగేళ్లల్లోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతూ గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టిగా తయారు చేస్తూ, ఐటీ రంగాన్ని అభివృద్ధి పరుస్తూ ఇతర రాష్ట్రాలు నివ్వెరపోయే విధంగా పరిపాలన సాగుతుందని అన్నారు. అగ్రకులాల పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని స్పష్టం చేశారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఇదే స్ఫూర్తిని అన్ని జిల్లాల్లో కొనసాగించి టీఆర్ఎస్కు మరింత బలం చేకూర్చాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో కిరాణ అసోసియేషన్ భవన్, ట్రేడర్స్ భవన నిర్మాణం, వైశ్య హాస్టల్, సంఘ భవనం కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని హామీలను అమలు చేసే దిశగా సమష్టిగా బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చేసి అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని జీవించే విధంగా పాలన సాగించడమే టీఆర్ఎస్ లక్ష్యమని అన్నారు. గతంలో కరెంట్ కోతలతో రైస్‌మిల్లులు నడువక ఆర్యవైశ్యులు ఇబ్బందులు పడేవారని, తాజాగా కరెంట్‌కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దామని అన్నారు. ప్రాజెక్టులు త్వరలోనే పూర్తవుతాయని, పంటలు పండుతాయని, రైస్‌మిల్లులకు పని ఎక్కువగా ఉండటమే కాకుండా వ్యాపార వాణిజ్య రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయని భరోసా ఇచ్చారు. ఏ ప్రభుత్వాలు ఆలోచన చేయని విధంగా ఆర్యవైశ్యుల్లో ఉన్న పేదలకు సైతం కళ్యాణలక్ష్మి, వృద్ధాప్య వితంతు పెన్షన్లు అందిస్తున్నామని వెల్లడించారు. పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులంతా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీలో చేరి బాసటగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో భాగస్వాములైన సబ్బండ వర్ణాలు బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందుండాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి తెలుసని, దశల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా ఉండే ఆర్యవైశ్యులు టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరడం శుభపరిణామని అన్నారు. కరీంనగర్ నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, కార్పొరేటర్లు వై.సునీల్‌రావు, బండారి వేణు, బోనాల శ్రీకాంత్, కంసాల శ్రీనివాస్, కన్న కృష్ణ, చల్ల హరిశంకర్, రావికంటి భాగ్యలక్ష్మి, గుర్రం పద్మారెడ్డితోపాటు టీఆర్ఎస్ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేటీఆర్‌కు ఘన స్వాగతం.. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్‌కు విచ్చేసిన సందర్భంగా ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. చిన్నారులు సెల్ఫీలు దిగి సందడి చేశారు. మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడం, ఆర్యవైశ్యులు అదే స్థాయిలో ఉండడంతో వేదికపైకి చేరుకునేందుకు తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని మంత్రిని వేదికపైకి తీసుకొచ్చారు. -
ఆయనే నిజమైన కళాకారుడు – కైకాల సత్యనారాయణ
‘‘ఆ ఈశ్వరుడికి, కళకు సంబంధం ఉంది. కళలో ఈశ్వర శక్తి ఉంది. అందుకే కళలను ప్రేమిస్తాను. ఆరాధిస్తాను. కళాకారులపై అభిమానంతో, వారిని అభినందించి సత్కరిస్తాను. దీనికి రాజకీయంతో సంబంధం లేదు. కళలను ఆరాధిస్తూ అందర్నీ ప్రేమిస్తూ, అజాత శత్రువుగా ఉండాలన్నదే జీవితంలో నా కోరిక అన్నారు’’ కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి. మహా శివరాత్రి సందర్భంగా విశాఖ సముద్ర తీరాన టీయస్సార్ ఆధ్వర్యంలో కోటి శివలింగాల ప్రతిష్ట, మహా కుంభాభిషేకం కార్యక్రమం ఈ నెల 13న జరగనుంది. ఈ సందర్భంగా సీనియర్ నటులు కైకాల సత్యనారాయణకు ‘విశ్వనట సమ్రాట్ బిరుదు’ ప్రదానం చేయనున్నారు. అలాగే యశ్ చోప్రా స్మారక జాతీయ అవార్డును ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకల వివరాలను హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో టి. సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ – ‘‘కోటి లింగాల ప్రతిష్ట, మహా కుంభాభిషేకం కార్యక్రమం ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయింది. ఫిబ్రవరి 13న సిల్వర్ జూబ్లీ చేయనున్నాం. ఆ రోజు 7 గంటలకు ప్రారంభమయ్యే అభిషేకం మధ్యాహ్నం మూడు గంటల వరకు సాగుతుంది. అలాగే సాయంత్రం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు శివజాగారం కొరకు భక్తి రస కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. దాదాపు వెయ్యి చిత్రాల్లో కైకాల సత్యనారాయణ నటించారు. ఎన్టీఆర్ వంటి గ్రేట్ ఆర్టిస్ట్‌తో వర్క్ చేశారు. ఆయనకు ‘విశ్వనట సమ్రాట్’ బిరుదును ప్రదానం చేయనున్నాం. స్వర్ణకంకణ ఘనసన్మానం కూడా జరుగుతుంది. యశ్ చోప్రాగారు దేశం గర్వించదగ్గ ఫిల్మ్‌మేకర్. ఆయనతో కలిసి ‘చాందినీ, లమ్హే’ లాంటి చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్నందుకు ఆనందంగా ఉంది. ఆయన జ్ఞాపకార్థం 2014లో ప్రారంభించిన యశ్ చోప్రా స్మారక జాతీయ పురస్కారాన్ని ఈ ఏడాది గాయని ఆశా భోంస్లేకు అందజేయాలని జ్యూరీ కమిటీ నిర్ణయించింది. త్వరలో మహబూబ్‌నగర్‌లో కాకతీయ కళా వైభోత్సవాన్ని నిర్వహించాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మహాశివరాత్రి రోజున ప్రజల సమక్షంలో విశ్వనట సమ్రాట్ బిరుదుతో నన్ను సత్కరించనుండటం ఆనందంగా ఉంది. కళాకారులు గౌరవాన్ని కోరుకుంటారు. ఏమీ ఆశించకుండా డబ్బును కళాసేవకు వినియోగిస్తున్నారు టి.సుబ్బరామిరెడ్డిగారు. ఆయనే నిజమైన కళాకారుడు. కళామతల్లి ముద్దుబిడ్డ అన్నది నా ఉద్దేశం. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలి. నాకు పద్మశ్రీ, పద్మ విభూషణ్ కంటే ఈ అవార్డు గొప్పదని నేను భావిస్తున్నాను’’ అన్నారు కైకాల సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, పరుచూరి వెంకటేశ్వరరావు, పద్మినీ కొల్హాపురి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అందరం భగవంతుడి సేవ చేద్దాం – మోహన్‌బాబు
‘‘నేను ఎప్పుడూ గుడి చైర్మన్ అవ్వాలనుకోలేదు. మా సంస్థలు, చిత్రాలతో బిజీగా ఉన్న నాకు ఈ అదనపు బాధ్యత ఎందుకనుకున్నా. పైగా నిజాన్ని నిర్భయంగా చెప్పడం నాకు అలవాటు. కానీ, ఆ మహాశివుడు టి.సుబ్బరామిరెడ్డి గారి స్వరూపంలో బాధ్యతలు స్వీకరించమన్నాడు’’ అని నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు సోమవారం ప్రమాణ స్వీకారం చేసారు. విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి ఆధ్వర్యంలో 12 మంది పాలక మండలి కొత్త సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మోహన్‌బాబు మాట్లాడుతూ–‘‘కమ్మ, కాపు, రెడ్డి కులాల వలే బ్రాహ్మణులలో కూడా శాఖలుంటాయి. అందరూ కలిసి ఆ భగవంతుడి సేవ చేద్దాం. నా అల్లుడు కూడా బ్రాహ్మణుడే. దేవుడి డబ్బు పైసా ముట్టుకోకుండా అవసరమైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి సన్నిధానంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సంకల్పిస్తున్నా. సన్నిధానంలోని దేవుళ్ల ఆశీస్సులతో మంచి కార్యక్రమాలు చేపడతామని ఆశిస్తున్నా’’ అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు వీరే.. నటుడు గిరిబాబు, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, కృష్ణంరాజు సతీమణి శ్యామల, చిరంజీవి సతీమణి సురేఖ, చాముండేశ్వరీ నాథ్, వి. రామ్‌ప్రసాద్ ఉన్నారు. కార్యదర్శిగా ఖాజా సూర్య నారాయణ కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎం.పి, ‘కళాబంధు’ టీయస్సార్, రాజమండ్రి ఎం.పి. మురళీమోహన్, హీరోలు విష్ణు, మనోజ్, నటి–నిర్మాత లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
అందుకే మోహన్‌బాబు ‘నట విశ్వ సార్వభౌమ’ – టీయస్సార్
‘‘నటుడిగా నేను 40 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నన్ను తెలుగు తెరకు పరిచయం చేసిన దాసరిగారి సమక్షంలో వైజాగ్‌లో ఫంక్షన్ చేశారు టీయస్సార్. కళాకారులను గౌరవించాలనే ఆలోచన రావడం మామూలు విషయం కాదు. ఈ ఆలోచన వచ్చిన వ్యక్తి నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో వన్ అండ్ వోన్లీ పర్సన్ టీయస్సార్. ఇది డబ్బుతో కూడుకున్న విషయం కాదు. మనసు ఉండాలి. అభినందనలు వేరు కానీ నాకు ఈ బిరుదు (విశ్వ నట సార్వభౌమ) ప్రదానం చేయటం ఇబ్బందిగా అనిపించింది. టీయస్సార్ నేను ఊళ్లో లేనప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత నీకీ బిరుదు ఇస్తున్నాం అంటే కాదనలేకపోయాను’’ అన్నారు మంచు మోహన్‌బాబు. టి.సుబ్బిరామి రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూర్, ముంబై, ఢిల్లీ.. ఇలా పలు ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ 17న హైదరాబాద్‌లో ‘కాకతీయ కళా వైభవ మహోత్సవం’ నిర్వహించనున్నారు. ఈ విశేషాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీయస్సార్ మాట్లాడుతూ– ‘‘దాదాపు 600 ఏళ్ల క్రితం ఓరుగల్లు ముఖ్య పట్టణంగా కాకతీయ రాజులు తెలుగు కళలను, నాగరికతను అద్భుతంగా ప్రోత్సహించారని ప్రసిద్ధి. వారి పాలన స్వర్ణ యుగం అని కవులు వర్ణించారు. ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఎంతో ప్రోత్సహించారు. ఈసారి మేం టీయస్సార్ కాకతీయ లలిత కళా పరిషత్ ఏర్పాటు చేశాం. తెలంగాణ ముఖ్య ప్రాంతాలలో కాకతీయ కళా వైభవోత్సవాలు చేయాలి, తెలుగు ప్రజల్ని మరోసారి రంజింపజేయాలని నిశ్చయించుకున్నాం. ఇందులో భాగంగా ముందు హైదరాబాద్‌లో ఈ నెల 17న భారీ కార్యక్రమం ఏర్పాటు చేశాం. 42 ఏళ్లుగా ఏకధాటిగా నటిస్తూ, 560 సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి, తనకంటూ ఓ స్థాయి క్రియేట్ చేసుకున్న మోహన్‌బాబుకు ‘విశ్వ నట సార్వభౌమ’ బిరుదును ప్రదానం చేయబోతున్నాం. ఆ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుగారు వస్తున్నారు’’ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘సుబ్బిరామి రెడ్డిగారి ఇంటి పేరు ‘టి’ అని కాకుండా కళా అని పెట్టి ఉంటే బావుండేది. కళాకారులను సత్కరించి తాను సంతృప్తి పొందుతుంటాడు. కాకతీయ శబ్దాన్ని కళా పరిషత్‌లోకి తీసుకొచ్చారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని చేసిన రాజ్యాధినేత రుద్రమదేవి. కాకతీయ ద్వారంలోనే కళ కనపడుతుంది. మోహన్‌బాబు తెర మీద కనపడగానే ఈలలు కొడతారు. ఆయన మమల్ని ఆప్యాయంగా అగ్రజా అని పిలుస్తుంటారు. ఆయనకు సన్మానం జరుగుతుంది అంటే మాకు జరిగినట్టే. ఆ బిరుదుకు మోహన్‌బాబు అర్హుడు’’ అన్నారు. రాజేంద్రప్రసాద్, విష్ణు, మనోజ్, పోసాని కృష్ణమురళి, అలీ, జయప్రద, జయసుథ, లక్ష్మీప్రసన్న, శ్రియ తదితర సినీరంగ ప్రముఖులు, మధుసూ«ధనాచారి, కె. స్వామిగౌడ్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. -
‘టీఆర్ఎస్కు మజ్లిస్ అంటే భయం’
పరకాల : తెలంగాణ ఉద్యమంలో ఆత్మ గౌరవ పోరాటం అన్న కేసీఆర్ ఇప్పుడు విమోచన దినాన్ని మరవడం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. పరకాల అమరధామం వద్ద శనివారం సాయంత్రం జరిగిన పార్టీ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విమోచన పోరాటాన్ని కనీసం పాఠ్యాంశాల్లో చేర్చక పోవడం దారుణమని, ఉద్యమ సమయంలో సీఎం రోశయ్యను డిమాండ్ చేసిన కేసీఆర్ ..ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినాన్ని ఎందుకు జరపటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడిన మజ్లిస్ మెప్పు కోసం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సీఎం కేసీఆర్ తాకట్టు పెడుతున్నారని, ప్రజలు ముఖ్యమా..లేక మజ్లీసా తేల్చుకోవాలని హెచ్చరించారు. మెజారిటీ ఉన్న టీఆర్ఎస్ మజ్లిస్ కు భయపడటం సిగ్గు చేటన్నారు. ‘అధికారికంగా సెప్టెంబర్ 17 జరపక పోతే... తెరాస ఓటమి పరకాల నుంచే ప్రారంభమవుతుంది. 2019 లో బీజేపీ అధికారం లోకి వస్తుంది, అప్పుడు మేమే హామీ నెరవేరుస్తాం’’ అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 న జాతీయ పతాకం ఎగురవేయటం సీఎం నైతిక బాధ్యతని గుర్తుచేశారు. చరిత్రను ఓట్ బ్యాంక్ రాజకీయాలతో ముడిపెట్టకూడదని, పరిస్థితి మారకుంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ చరిత్ర హీనుడుగా మిగులుతారని విమర్శించారు. -
విశాఖలో టిఎస్ఆర్ మహా కుంభాభిషేకం
-
ఎన్టీఆర్‌కి దాన వీర శూర కర్ణ బాలకృష్ణకి శాతకర్ణి...
–టీఎస్సార్ ‘‘తెలుగు సినిమా చరిత్రలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఓ మైలురాయి. తెలుగు వారికి తెలియని ఓ తెలుగు వీరుణ్ణి క్రిష్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఎన్టీఆర్‌గారిని ‘దాన వీర శూర కర్ణ’గా ప్రేక్షకులు గుర్తించుకున్నట్లు.. బాలకృష్ణను ‘గౌతమిపుత్ర శాతకర్ణి’గా గుర్తు పెట్టుకుంటారు. ఈ సినిమా తర్వాతి తరాలకు ఒక పాఠ్యాంశంలా నిలుస్తుంది’’ అని ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. బాలకృష్ణ, శ్రియ జంటగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విజయం సాధించిన సందర్భంగా ఆ చిత్ర యూనిట్‌ను టీఎస్సార్ సన్మానించారు. బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నటించడం నా పూర్వజన్మ సుకృతం. నాన్నగారు ‘శాతకర్ణుడి’ చరిత్రతో సినిమా చేద్దామనుకున్నారు. ఆ అవకాశం నాకు వచ్చిందంటే ఆయన ఆశీస్సులే. కళలను ప్రోత్సహిస్తున్న సుబ్బరామి రెడ్డిగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘తెలుగు సినిమా చరిత్రపై బాలకృష్ణ గారి వేలిముద్ర ‘గౌతమిపుత్ర శాతకర్ణి’’ అని క్రిష్ అన్నారు. బాలకృష్ణ, క్రిష్, నిర్మాతలు జాగర్లమూడి సాయిబాబు, బిబో శ్రీనివాస్, రచయిత బుర్రా సాయిమాధవ్, సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్, సంగీత దర్శకులు చిరంతన్ భట్ తదితరులను టీఎస్సార్ సన్మానించారు. దర్శకులు కె.రాఘవేంద్ర రావు, కోదండరామిరెడ్డి, ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, పీవీపీ, సాయి కొర్రపాటి, హీరోలు వెంకటేష్, మంచు విష్ణు, మనోజ్, నటి జయసుధ, హీరోయిన్ తమన్నా పాల్గొన్నారు. -
మెగాస్టార్‌ను సన్మానించిన టీఎస్సార్
-
వైభవంగా నలభై నట వసంతాల వేడుక
‘‘శివాజీ గణేశన్, ఆశాభోంస్లే, రాధిక, బాలమురళీకృష్ణ, జానకి , పి.సుశీల వంటి వారెందర్నో నా ఆధ్వర్యంలో సత్కరించడం ఒక ఎత్తై.. మోహన్‌బాబును సత్కరిస్తుండ డం మరో ఎత్తు. ఆయన గ్రేట్ ఆర్టిస్ట్. నాకు మంచి ఆత్మీయుడు. నటుడిగా, నిర్మాతగా కళారంగానికి సేవ చేస్తున్నాడు. విద్యాసంస్థలు స్థాపించి పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నాడు’’ అని కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. మోహన్‌బాబు నటుడిగా నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం వైజాగ్‌లో సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ‘నలభై నట వసంతాల వేడుక’ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా టీయస్సార్ మాట్లాడుతూ- ‘‘ఈ వేడుకకు దక్షిణ, ఉత్తరాది నుంచి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. దాసరి నారాయణరావు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, శ్రీదేవి, జయప్రద, జయసుధ, అనుష్క, కాజల్ తదితరులు పాల్గొంటారు’’ అని చెప్పారు. హీరోలు విష్ణు, మనోజ్ మాట్లాడుతూ- ‘‘సుబ్బరామిరెడ్డి అంకుల్ పుట్టినరోజున నాన్నగారి వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని పెద్దలతో పాటు నాన్నగారితో, మాతో పాటు కలిసి నటించిన యాక్టర్స్ హాజరవుతారు’’ అని చెప్పారు. -
సస్పెండ్ చేసే అధికారం మండల శాఖలకు లేదు
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు హన్మకొండ : టీఆర్ఎస్ నేతల విషయం లో మండల శాఖలు తీసుకునే సస్పెన్షన్ల నిర్ణయాలు చెల్లవని పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. టీఆర్ఎస్ నియమావళి ప్రకారం నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అధికారం మండల శాఖలకు లేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలపై ఆరోపణలు, వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఈ సమాచారాన్ని టీఆర్ఎస్ జిల్లా శాఖకు తెలియజేయాలని... అన్నింటినీ పరిశీలించి జిల్లా స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇలా కాకుండా మండల స్థాయిలో పార్టీ అధ్యక్షులు తీసుకుంటున్న సస్పెన్షన్ నిర్ణయాలు చెల్లుబాటుకావని పేర్కొన్నారు. టీఆర్ఎస్ జిల్లా శాఖతో సంబంధం లేకుండా సస్పెన్షన్ నిర్ణయాలు తీసుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని మండల పార్టీ అధ్యక్షులను ఈ సందర్భంగా ఆయ న హెచ్చరించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం జఫర్‌గఢ్ మండల టీఆర్ఎస్ శాఖ గాదెపాక అయోధ్యను, రఘునాథపల్లి మండల శాఖ బానోతు భిక్షపతిని, లింగాలఘనపురం మండల శాఖ ఏదునూరి వీరయ్యను సస్పెండ్ చేసినట్లు ఇటీవల ప్రకటించాయని... ఈ నిర్ణయాలు చెల్లుబాటు కావని ఆయన తెలిపారు. ఈ ముగ్గురు నేతలు టీఆర్ఎస్ సభ్యులుగానే ఉంటారని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో రవీందర్రావు వివరించారు. -
విశాఖ ప్రజలకు నిరంతర సేవలందిస్తా
పేదల పరిస్థితులు నన్ను కదిలించాయి తన శివార్చన ఫలితమే విశాఖకు హుద్‌హుద్ గండం నుంచి రక్షణ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి ఏయూక్యాంపస్: సేవ చేయడంలోనే పూర్తి సంతృప్తి లభిస్తుందని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామి రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఏయూ స్నాతకోత్సవ మందిరంలో టీఎస్ఆర్ ఉచిత వైద్య సేవా కార్యక్రమం ద్విదశ వార్షికోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ నగరంలోని మురికి వాడల ప్రజల జీవనం తనను కదిలించిందన్నారు. వీరికి ఇంటి వద్దకే వైద్యం అందించాలనే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నామన్నారు. కేజీహెచ్ అభివృద్ధికి, క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు తాను పూర్తిస్థాయిలో పనిచేశానన్నారు. తాను ఏటా సముద్ర తీరంలో చేస్తున్న శివార్చన ఫలితంగా హుద్‌హుద్ ప్రభావం నుంచి విశాఖ సురక్షితంగా బయట పడిందన్నారు. విశాఖ ప్రజలకు పూర్తిస్థాయిలో నిరంతర సేవలు అందిస్తానన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండటమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పారు. పిఠాపురం స్వామీజీ డాక్టర్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ ఆధ్యాతిక, సామాజిక సేవను రెండు కళ్లుగా భావించి సుబ్బరామిరెడ్డి ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఈ సేవలు సాగడం శుభపరిణామమన్నారు. సామాజిక సేవ మహాశక్తిని అందిస్తుందన్నారు. సాయం పొందిన వారు అందించే ఆశీస్సులే మనతో ఎప్పుడూ ఉంటాయన్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ కళలు, వైద్య సేవలతో సుబ్బరామిరెడ్డి విశాఖ ప్రజలకు మన్ననలు అందుకున్నారన్నారు. తమ వర్సిటీలో రాజనీతిశాస్త్రం, ఎంబీఏ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించాలని కోరారు. మాజీ శాసన సభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ సుబ్బరామిరెడ్డికి విశాఖ నగరం మానస పుత్రికగా నిలుస్తుందన్నారు. విశాఖలో ఆధ్యాత్మిక పునాదులు వేసిన వ్యక్తిగా ఆయన నిలుస్తారన్నారు. మానవతావాదిగా అందరి హదయాలను గెలుచుకున్నారన్నారు. వైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య టి.రవి రాజు మాట్లాడుతూ ఉదాత్తమైన ఆదర్శంగా విద్య, సాంస్కతిక, ఆధ్యాత్మిక రంగాలో విశేష సేవలు అందిస్తున్నారన్నారు. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ కేన్సర్ ఆస్పత్రి విశాఖ రావడానికి టీఎస్సార్ ఎంతో కషిచేశారంటూ అభినందించారు. ఏయూ పాఠశాలల భవనాల నిర్మాణానికి సైతం నిధులను అందించి ఏయూపై తన అభిమానాన్ని చాటుకున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, డి.వరదా రెడ్డి, ఎస్.కె భాషా, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూధన్ బాబు, మంత్రి రాజశేఖర్, మాజీ శాసన సభ్యుడు చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. అవార్డుల ప్రదానం.... ఈ సందర్భంగా కేజీహెచ్ డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ జి.అర్జున్, డాక్టర్ సి.ఎం.ఎ. జహీర్ అహ్మద్, డాక్టర్ బి.ఆశాలత, డాక్టర్ కె.ఎస్.ఎన్ మూర్తిలకు టీఎస్ఆర్ అవార్డులను ప్రదానం చేశారు. ఏయూ వీసీ నాగేశ్వరరావు, డాక్టర్ ఉమర్ ఆలీషా, డాక్టర్ రవిరాజులను ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి సత్కరించారు. -
డైనమైట్ హాలీవుడ్ స్టయిల్లో ఉంది
‘‘విష్ణు అద్భుతంగా నటించాడు. ఇంత మంచి సినిమా చేసినందుకు తనను అభినందించాలి’’ అని కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి అన్నారు. దేవా కట్టా దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన ‘డైన మైట్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని టి. సుబ్బిరామిరెడ్డి కోసం ఆదివారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ -‘‘హాలీవుడ్ స్టయిల్లో ఉన్న టాలీవుడ్ చిత్రంఇది. మంచి యాక్షన్ ఎంటర్టైనర్. మొదట్నుంచీ చివరి వరకూ చక్కగా సస్పెన్స్ మెయిన్టైన్ చేశారు. ఫైట్స్ బాగా డిజైన్ చేశారు. పాటలు బాగున్నాయి’’ అన్నారు. లవ్... యాక్షన్... ‘అనుక్షణం’, ‘రౌడీ’, ‘డైనమైట్’... ఇలా ఈ మధ్యకాలంలో మంచు విష్ణు చేసినవన్నీ సీరియస్ మూవీసే. ‘డైనమైట్’లో అయితే తక్కువ రొమాన్స్, ఎక్కువ యాక్షన్ చేశారు. అందుకే, ఈసారి లవ్, యాక్షన్ రెండూ సమపాళ్లల్లో ఉండే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండింటికీ అదనంగా వినోదం కూడా ఉంటుంది. జి. కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో డి. కుమార్, పల్లి కేశవరావు నిర్మించనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ నెల 10న జరగనుంది. ‘జాదుగాడు’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సోనారిక ఇందులో విష్ణు సరసన కథానాయికగా నటించనున్నారు. ‘‘ఇది లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఓ ప్రముఖ కథానాయిక కూడా ఇందులో నటిస్తారు’’ అని నిర్మాతలు తెలిపారు. బ్రహ్మానందం, రాజా రవీంద్ర, పృథ్వీ, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: విజయ్ సి. కుమార్, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, ఆర్ట్: రామాంజనేయులు, ఫైట్స్: విజయ్, నిర్మాణ నిర్వహణ: సోమా విజయప్రకాశ్. -
కా.పా. వ్యవహారాల కమిటీ సభ్యునిగా టీఎస్సార్
న్యూఢిల్లీ: ఉభయసభల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సభ్యునిగా ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి నియమితులయ్యారు. కమిటీ చైర్మన్లుగా సోనియా, రాహుల్ ఉన్నారు. అదేవిధంగా మల్లికార్జున్‌ఖర్గే, కమల్‌నాథ్, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, ఆనంద్‌శర్మ, అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్, అంబికా సోని, జైరాం రమేష్ కూడా కమిటీ సభ్యులుగా నియమితులైనట్టు సుబ్బిరామిరెడ్డి తెలిపారు. -
వైజాగ్‌లో టిఎస్ఆర్కు లైన్ క్లియర్