సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్ 58 స్థానాల్లో(ఉదయం 11.30గంటలకు) స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఢిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉన్నారు. ఆప్ మంత్రులు కూడా ఆయా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆప్ భారీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలకు సిద్దమయ్యారు.
(చదవండి : ఆప్ విజయంలో ‘బిర్యానీ’ పాత్ర)
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. పార్టీ విజయోత్సవాల్లో భాగంగా టపాసులు కాల్చవద్దని కార్యకర్తలకు ఆదేశించారు. టపాసుల స్థానంలో స్వీట్లు పంపిణీ చేయండి అని ఢిల్లీ సీఎం చెప్పారు. ఢిల్లీ వాయు కాలుష్యం దృష్ట్యా సీఎం కేజ్రీవాల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆప్ పేర్కొంది. సీఎం కేజ్రీవాల్ ఆదేశాల మేరకు ఆప్ శ్రేణులు టపాసులు పేల్చడం లేదు. టపాసులకు బదులు బెలూన్లను గాల్లోకి వదిలి, స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment