
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ ప్రత్యర్థులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గండ్ర వెంకటరమణారెడ్డిల మధ్య ఆదివారం అసెంబ్లీ ప్రాంగణంలో సరదా సంభాషణ జరిగింది. ఉదయం సభా ప్రారంభానికి ముందు సీఎల్పీ కార్యాలయం వద్ద గండ్ర, మాజీమంత్రి హరీశ్‌రావు పలకరించుకున్న సమయంలో అక్కడకు ఎర్రబెల్లి వచ్చారు. రాగానే ఆయన ఏం బుద్ధిమంతుడిలా ఉన్నావ్.. అని గండ్రనుద్దేశించి అన్నారు. ఇందుకు స్పందించిన గం డ్ర ‘నేనెప్పుడూ బుద్ధిమంతుడినే అన్నా.. అయినా అన్నీ నీ నుంచి నేర్చుకున్నవే కదా.. నువ్వే మార్గదర్శకుడివి అన్నా’అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి.
గుత్తాకు ఉత్తమ్ కంగ్రాట్స్..
సభ ముగిసిన తర్వాత అసెంబ్లీ లాబీల్లో నల్లగొండ నేతలు ఉత్తమ్, గుత్తా సుఖేందర్‌రెడ్డిల మధ్య కూడా సరదా చర్చ జరిగింది. తనకు తారసపడిన ఉత్తమ్‌ను గుత్తా పలకరించగా కంగ్రాట్స్ గుత్తాగారూ అంటూ ఉత్తమ్ వ్యాఖ్యానించారు. కంగ్రాట్స్ ఎందుకు చెబుతున్నారో అర్థంకానట్లు గుత్తా సైలెంట్‌గా నవ్వి ఊరుకున్నారు. గుత్తా మంత్రి కాబోతున్నారని, అందుకే ఉత్తమ్ కంగ్రాట్స్ చెప్పినట్టున్నారని అక్కడున్న జర్నలిస్టులు చర్చించుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment