
హాంకాంగ్: నేరస్తుల అప్పగింత బిల్లు నిరసనలతో హాంకాంగ్ అట్టుడుకుతోంది. చైనా జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రొడెమోక్రసీ సభ్యులు చేస్తున్న ఆందోళనలు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. కొన్నివేలమంది నిరసనకారులు హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోకి చొచ్చుకెళ్లారు. హాంకాంగ్ సురక్షితం కాదు, పోలీసు వ్యవస్థ తీరు బాగోలేదంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులతో విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. దీంతో సోమవారం నుంచి హాంకాంగ్‌లో విమాన సేవలు నిలిచిపోయాయి. రెండోరోజు మంగళవారం కూడా విమానాశ్రయంలో ఆందోళనకారుల నిరసన కొనసాగుతుండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో సౌకర్యాలు కల్పించలేమంటూ .. అధికారులు విమాన రాకపోకలను రద్దు చేశారు. ఇప్పటికే హాంకాంగ్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాలతోపాటు ఆ దేశానికి వచ్చే విమానాలను కూడా రద్దు చేసినట్టు స్పష్టంచేశారు. ప్రయాణికులందరూ విమానాశ్రయ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాల్సిందిగా అధికారులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment