
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఆర్భాటాలు చేయడం తప్ప అక్కడ జరుగుతున్నది ఏమీ లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సీఎల్‌పీ సమావేశంలో పాల్గొన్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై టీఆర్‌ఎస్ పార్టీ తీరును విమర్శించారు. కాళేశ్వరం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత వచ్చిందని టీఆర్‌ఎస్ చెబుతుండటం హాస్యాస్పదమని, విద్యుత్ వినియోగానికి భయపడే ప్రభుత్వం నీటిని ఎత్తివేయలోక పోతుందని అన్నారు. ఇప్పటి వరకు 45 టీఎమ్‌సీల నీటిని ఎగువకు పంపే అవకాశం ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
‘కాళేశ్వరం నుంచి బొట్టు నీరు కూడా వినియోగంలోకి రాలేదు. ఎగువకు తరలించేందుకు నీరు అందుబాటులో ఉన్నా నీరంతా వృధాగా కిందకు వదులుతున్నారు. ఇది ఎవరి అవగాహనా రాహిత్యం. ఎంత నీరు అందుబాటులో ఉందో అంత నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వ శ్రద్ధ కొరవడినందువల్లే ఉపయోగించుకోలేకపోతున్నారు. పైనుంచి ఆదేశాలు లేకనే తాము ఏమీ చేయలేకపోతున్నామని అధికారులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నీటిని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని’ జీవన్‌రెడ్డి సూచించారు. (చదవండి : ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతిపై ప్రస్తావన లేదు)
Comments
Please login to add a commentAdd a comment