ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన జంటనగరాల ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
చంద్రబాబు ప్రోత్సహిస్తున్న చిల్లర రాజకీయాల కారణంగా అనవసరంగా ఘర్షణలు పడొద్దు. ఆయన స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడికి వచ్చారు. ఏం అవసరముందండి చంద్రబాబుకి? ఇంత కుట్ర చేయాల్నా? ఆయనకు రాష్ట్రం లేదా? అక్కడ కాకుండా ఇక్కడ ఈయనొచ్చి పోటీ చేసే స్థానాలు ఎన్నండి? 13 స్థానాలు. ప్రభుత్వం స్థాపిస్తడా? ఆరుస్తడా? తీరుస్తడా? ఈ మకిలి నకిలీ రాజకీయాలు ఎందుకండి? నగరంలో ఉండే విజ్ఞులు.. ముఖ్యంగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతీయులు ఆలోచించాలె. ఏ కుటిలం, కుళ్లు కాకబోతే ఏ రాజకీయాలు ఆశించి ఆయన వస్తున్నాడండి? తెలుగు ప్రజల మీద ప్రేమ ఉంటే ఇక్కడికొచ్చి చిచ్చు పెట్టాల్నా? శాంతంగా బతికే ప్రజలను విడదీయాల్నా? ఆనందంగా ఉన్నవారి మధ్య పంచాయితీలు పెట్టాల్నా? దేనికోసం వస్తున్నరు? విజ్ఞులైన నగర ప్రజలు ఆలోచించాలి. తెలంగాణలో స్వచ్ఛమైన రాజకీయాలుంటయి. కులం, మతం చూడరు. అంశాల ఆధారంగా రాజకీయాలుంటయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సభలో కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ‘స్వార్థ, కుటిల, కుళ్లు రాజకీయాల కోసం హైదరాబాద్‌లో ఉన్న తెలుగు ప్రజల మధ్య విభేదాలు పెడుతున్నది చంద్రబాబునాయుడు కాదా? అందరూ ఆలోచించాలి. ఆయనకు బుద్ధి చెప్పాలి’’అని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు జంట నగరాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘అయ్యా.. చంద్రబాబు నాయుడూ.. నీకో నమస్కారం. తెలుగుజాతి అని నువ్వేదైతే మాట్లాడుతున్నవో అది హైదరాబాద్‌లో చాలా సంతోషంగా ఉంది. ఏపీ వాళ్లు హ్యాపీగా ఉన్నరు. చిల్లర రాజకీయాల కోసం చిచ్చు పెట్టొద్దు’అని పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన జంట నగరాల ప్రజా ఆశీర్వాద సభలో టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు.
ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ప్రజలు
‘చంద్రబాబు ప్రోత్సహిస్తున్న చిల్లర రాజకీయాల కారణంగా అనవసరంగా ఘర్షణలు పడొద్దు. ఆయన స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడికి వచ్చారు. ఏం అవసరముందండి చం ద్రబాబుకి? ఇంత కుట్ర చేయాల్నా? ఆయనకు రాష్ట్రం లేదా? అక్కడ గాకుండా ఇక్కడ ఈయనొచ్చి పోటీ చేసే స్థానాలు ఎన్నండీ? 13 స్థానా లు. ప్రభుత్వం స్థాపిస్తడా? ఆరుస్తడా? తీరుస్తడా? ఈ మకిలి నకిలీ రాజకీయాలు ఎందుకండి? నగరంలో ఉండే విజ్ఞులు.. ముఖ్యంగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతీయులు ఆలోచించాలె. ఏ కుటిలం, కుళ్లు కాకబోతే ఏ రాజకీయా లు ఆశించి ఆయన వస్తున్నాడండి? తెలుగు ప్రజల మీద ప్రేమ ఉంటే ఇక్కడికొచ్చి చిచ్చు పెట్టాల్నా? శాంతంగా బతికే ప్రజలను విడదీయాల్నా? ఆనందంగా ఉన్నవారి మధ్య పంచా యతీలు పెట్టాల్నా? దేనికోసం వస్తున్నరు? తెలంగాణలో స్వచ్ఛమైన రాజకీయాలుంటయి. కులం, మతం చూడ రు. అంశాల ఆధారంగా రాజకీయాలుంటయి. కానీ అన్నీ కుళ్లు రాజకీయాలు చేస్తున్నరు’అని ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే...
వేదికపై టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్యనేతలు తలసాని, మహమూద్ అలీ, కేకే, నాయిని, కేటీఆర్, పద్మారావు, దానం నాగేందర్ తదితరులు
అందరూ తెలంగాణ బిడ్డలే..
‘గతంలో తెలంగాణ ఏర్పడే సమయంలో చా లా అపోహలు, అనవసర భయాలు సృష్టించిండ్రు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అలాంటిదేమీ లేదని రుజువు చేసింది. సమైక్య రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి చాలామంది ఇక్కడ బతకడానికి వచ్చిండ్రు. మీరందరూ కూడా తెలంగాణ బిడ్డలే. కాబట్టి అందరం ఆనందంగా ఉందామని చెప్పినం. చెప్పడమే కాదు, రాష్ట్రం వచ్చిన తదుపరి ప్రభుత్వాధినేతగా ఆచరణ చేశాం. అనవసరంగా చంద్రబాబు ఇక్కడకొచ్చి తమకు ఒక ట్రేడ్ పెట్టి, తమ నెత్తికి ఓ బోర్డు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది ఆంధ్ర ప్రాంత మిత్రులు నాతో అన్నరు. టీఆర్‌ఎస్‌కు ఎలాంటి భేదాలూ లేవు. ఏ ప్రాం తం వాసులు అని చూడకుండా జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టికె ట్లు ఇచ్చినం. వాళ్లందరూ గెలిచినరు. ఇవాళ ఎమ్మెల్యేలుగా నిలబడిన మిత్రులున్నరు. హైదరాబాద్‌లో ఉన్న అన్ని వర్గాల ప్రజలు.. ఆంధ్ర, రాయలసీమ నుంచి వచ్చి బతుకుతున్నవా రికి అప్పీల్ చేస్తున్న.. మీరు, మేము వేరు అన్న భావన వీడండి. ట్రై టు బీ హైదరాబాదీస్. ప్రౌడ్ టూ బీ హైదరాబాదీస్. కేసీఆర్ విల్ బీ విత్ యూ. గర్వకారణంగా మేము హైదరాబాదీలమని చె ప్పండి. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో హై దరాబాద్‌కు ఆ బ్రాండ్ ఇమేజీ ఉంది. నేను కూడా హైదరాబాద్‌కు చెందినవాడిని కాను. నేను పాత మెదక్ జిల్లా వాడిని. కేశవరావు కూడా నగరానికి చెందిన వారు కాదు. అంద రం ప్రశాంతంగా కలిసి బతుకుదాం. హైదరాబాద్ విశ్వనగరం. నిజాం, కులీ కుతుబ్‌షాహీల కాలం నుంచే సర్వమతాలకు, సర్వ కులాలకు, సర్వప్రజలకు ఆలవాలంగా ఉంది. మార్వాడీలు, గుజరాతీ లు, రాజస్థానీయులు, మహారాష్ట్రీయులు, మలయాళీలు, తమిళులు, ఒరియాలు ప్రతిరాష్ట్రంవారు హైదరాబాద్‌లో ఉన్నారు. వారందరి కమ్యూనిటీ హాల్స్‌కు స్థలాలిచ్చాం. ఆంధ్ర, రాయలసీమ నుంచి వచ్చిన సోదరులు సంతోషంగా ఈ నగరంలో ఉన్నరు.
పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన సభలో మహిళల కోలాహలం
గత పాలకులు విధ్వంసం సృష్టించారు
గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో ఈ నగరాన్ని చాలా విధ్వంసం చేసినయి. ప్రజలు నివసించే ప్రాంతంగా కాకుండా వ్యాపార దృక్పథంతో వ్యవహరించినయి. నగరంలో వరద నీరు పోవట్లేదు. కార్లన్నీ బోట్లవుతున్నయి. అసెంబ్లీ, రాజ్‌భవన్ ముందుకు కూడా నీళ్లు ఆగుతు న్నాయి. దీన్ని దూరం చేయలేరా అని సీఎం అయిన కొత్తలో అధికారులను అడిగితే.. వర్షం నీరు తీసుకెళ్లే నాలాలను ధ్వంసం చేశారని జవాబొచ్చింది. చుక్క నీళ్లు లేకుండా వెళ్లిపోవాలంటే రూ.15వేల కోట్ల నుంచి 20 వేల కోట్ల ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, 3 నుంచి 5 వేల ఇళ్లను కూల్చాల్సి ఉంటుందని అధికారులు చెప్పిండ్రు. కోటి పైచిలుకు జనా భా ఉన్న నగరంలో లక్ష మందికి ఒకటి చొప్పున కనీసం వంద కూరగాయలు, మాంసం మార్కెట్లు ఉండాలె. కానీ 7 మాత్రమే ఉన్నయి. బాధ్యతారాహిత్యంగా జీహెచ్‌ఎంసీని విస్తరింపజేసి మంచి నీటిసదుపాయం లేకుండానే 12 మునిసిపాలిటీలు కలిపేసిండ్రు. మేం స్వల్ప, దీర్ఘకా లిక లక్ష్యాలతో ప్రయాణం మొదలుపెట్టినం.
నగరం బాగైంది..
హైదరాబాద్ నగరం అంటే మత ఘర్షణలు. నిమిషాల్లో కర్ఫ్యూలు పెట్టేవారు. షాయినాయత్‌గంజ్ వంటి కొన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఏడాదంతా కర్ఫ్యూ ఉండేది. కానీ గత నాలుగున్నరేళ్లలో ఒక్క మత హింస ఘటన లేదు. ప్రజలు శాంతియుతంగా బతుకుతున్నరు. మత కల్లోల్లాలు లేవు. గుడుంబా అమ్మకాలు, పేకాట క్లబ్బులు లేవు. పీడీ యాక్ట్ కింద గూండాలందరినీ లోపల పెట్టినం. భూ కబ్జాలు కూడా లేవు. ఇక శివారు మునిసిపాలిటీల్లో నీటికి చాలా కటకట ఉండేది. పేదలు కూడా వాటర్ ట్యాంకర్లు కొనే దుస్థితి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా స్వచ్ఛమైన నీళ్లు సరఫరా అవుతున్నయి. అద్భుతమైన స్వచ్ఛమైన మూసీని గత పాలకులు మురికి మూసీగా మార్చిండ్రు. రూ.1,000 కోట్లతో మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి పనులు చేపట్టినం. ప్రతి రోజూ 50 వేల మందికి పేదలకు రూ.5కే అన్నపూర్ణ భోజనం లభిస్తోంది. 33 బస్తీ దవాఖానాలు ప్రారంభించినం. మీరు ఆశీర్వదించి మళ్లీ గెలిపిస్తే మరో 500 దవాఖానాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతా ఉంది. కొల్లూరులో రూ.1300 కోట్లతో 15,600 ఇళ్లతో పేదల కోసం అపార్ట్‌మెంట్ కాలనీ వస్తోంది.
కారు గుర్తుకు ఓటు వేయాలని కేటీఆర్ ప్లకార్డును ప్రదర్శిస్తున్న మహిళ
డూప్లికేట్ సర్వేతో బాబు కుట్ర...
నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. టీఆర్‌ఎస్‌కు సంఖ్య రానట్టు రేపో ఎల్లుండో డూప్లికేట్ సర్వే వెలువరిస్తరు. ఒక మీడియా సంస్థ వారు, చంద్రబాబు, కొంత మంది కాంగ్రెస్ నాయకులు కలిసి కుట్ర చేస్తున్నరు. నేను ఇవాళ కేసీఆర్‌గా డిక్లేర్ చేస్తున్న సర్వే.. ఈ రోజు కూడా మూడు నాలుగు నియోజకవర్గాలు తిరిగి వచ్చాను. వంద సభల ప్రజలను టచ్ చేసిన తర్వాత డిక్లేర్ చేస్తున్న.. కచ్చితంగా 100కు పైగా సీట్లతో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాబోతోంది. జంట నగరాల్లో కూడా జీహెచ్‌ఎంసీ తీర్పు రిపీట్ కాబోతోంది. ఇందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఈ ఎన్నికలు గెలవడమే కాదు, పార్లమెంట్ ఎన్నికల్లోనూ క్రియాశీల పాత్ర పోషించి కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ తేవడానికి కృషి చేయాలె. మత సామరస్యం, శాంతిభద్రతలు, ఆర్థిక పురోగతితో ముందుకు పోతున్న ఈ రాష్ట్రాన్ని దీవించి పార్టీ అభ్యర్థులను గెలిపించాలి’.
కరెంట్ కోతల్లేకుండా చేసినం...
గత ప్రభుత్వాల హయాంలో నగరంలో విపరీతంగా కరెంట్ కోతలుండేవి. ఒక్కో అపార్ట్‌మెంట్‌వాళ్లు డీజిల్ కోసం రూ.లక్షలు ఖర్చు చేసేవారు. ఏ అపార్ట్‌మెంట్‌కు వెళ్లినా డీజిల్ కంపు ఉండేది. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు పెట్టేవారు. నగరంలో చుట్టూ ఉన్న పరిశ్రమలకు విపరీతమైన పవర్ హాలీడే ఉండేది. మాకు కరెంట్ ఇవ్వండి.. పరిశ్రమలు మూతబడుతున్నాయి అని పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. పరిశ్రమలకు కూడా 24 గంటల పవర్ సప్‌లై ఇస్తున్నం. బ్రహ్మాండంగా మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదిగినం. మహిళల భద్రతకు తీసుకొచ్చిన షీ టీమ్స్ మీ కళ్ల ముందు ఉంది. లక్షలాది ఎల్‌ఈడీ లైట్లతో ఈ నగరం జిగేల్‌మని మెరుస్తోంది. ప్రపంచంలో అత్యత్తుమ పోలీస్ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్‌ను 24 అంతస్తులతో నిర్మిస్తున్నం.
Comments
Please login to add a commentAdd a comment