‘నల్లగొండకు ఏం చేశావని 12 సీట్లొస్తాయ్‌’ | Komatireddy Venkat Reddy Critics On KCR Over Comments On Mahakutami | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 5 2018 1:34 PM | Last Updated on Fri, Oct 5 2018 1:44 PM

Komatireddy Venkat Reddy Critics On KCR Over Comments On Mahakutami - Sakshi

సాక్షి, నల్లగొండ : కాంగ్రెస్‌ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించానని చెప్పుకుంటున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నల్లగొండను ఎందుకు మరచిపోయాడని అన్నారు. జిల్లా అభివృద్ధిని పట్టించుకోని కేసీఆర్‌ ‘నల్లగొండలోని 12కు 12 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తున్నాం’  అని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి వర్గంలో ఒక్క మహిళా మంత్రిని లేకుండా చేసి.. బతుకమ్మ చీరల గురించి కేసీఆర్‌ గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, టీడీపీల మహాకూటమిపై నల్లగొండ ఆశీర్వాద సభలో కేసీఆర్‌ చేసిన విమర్శలను ఆయన ఖండించారు. (మహాకూటమా.. కాల కూట విషమా?)

కమీషన్లు రావనే నిర్లక్ష్యం...
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ వేల కోట్లు దోచుకుంటున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. మూడేళ్లలో శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్ఎ‌ల్‌బీసీ) సొరంగమార్గం పూర్తి చేస్తానని హామినిచ్చిన కేసీఆర్‌ నాలుగున్నరేళ్ల పాలనలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని ధ్వజమెత్తారు. ఎస్ఎ‌ల్‌బీసీలో కమీషన్లు రావనే పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. నల్లగొండను నాశనం చేసిన కేసీఆర్‌ పతనానికై పనిచేస్తానని ఆయన వ్యాఖ్యానించారు.

(చదవండి : ‘సాగర్‌’ నుంచే మనకు అన్యాయం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement