
సాక్షి, హైదరాబాద్: తలకు పగిడీలు చుట్టుకుని, అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడితే అధికారంలోకి వస్తారా అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద ప్రశ్నించారు. సోమవారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి.. ఇప్పుడు మాట్లాడటం ఆశ్చర్యకరమన్నారు.
ప్రజల్లోకి వెళ్లకుండా, గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌నేతలు ఇంకా ఊహాలోకాల్లో విహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఆదరణను కాంగ్రెస్ నేతలు ఓసారి గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై స్పందిస్తూ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment