లింగాయత్ నేత అశోక్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కుటుంబం శాశ్వతం గా తెలంగాణ ప్రయోజనాల కోసమే పని చేస్తుం దని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు ఆటలు సాగవని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తునకు పునాది లేదని అన్నారు. ఇన్నాళ్లు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని మాట్లాడిన వారు ఇప్పుడు టీడీపీని పిల్ల కాంగ్రెస్‌గా మార్చారని చంద్రబాబును ఎద్దేవా చేశారు. పలువురు లింగాయత్ నేతలు తెలం గాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన కేటీఆర్ వీరినుద్దేశించి మాట్లాడా రు. ‘ఉమ్మడి ఏపీలో పాలకులు తెలంగాణలోని కులాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. కేసీఆర్ అందరి ఆత్మాభిమానాన్ని పెంచే పనులు చేశా రు. కేసీఆర్ గెలిస్తే తెలంగాణ మరిం త అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి చేసే ప్రభుత్వం కావాలా? అంధకారంలోకి నెట్టే ప్రభుత్వం కావాలా? ఓట ర్లు ఆలోచించి ఓటేయాలి’ అని కేటీఆర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment