
సాక్షి, తూర్పు గోదావరి: పెన్షన్ దారులతో మళ్లీ తమకే ఓట్లు వేయాలంటూ టీడీపీ నేతలు ఒట్లు చేయించుకోవటం(ప్రమాణం చేయించుకోవడం) మంచి పద్ధతి కాదని వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఇటువంటి టీడీపీ సెంటిమెంటు కార్యక్రమాలను ఖండిస్తున్నామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పన్నుల రూపంలో వచ్చిన ప్రభుత్వ ఆదాయంతో ఓట్లు కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టారన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
జగనన్న బాటలో చంద్రన్న నడుస్తున్నారంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా తన వేషాలు ఆపాలని, ప్రజలు చాలా అసహ్యించుకుంటున్నారని చెప్పారు. స్పీకర్ సీట్లో నలచొక్కా వేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే కూర్చునేంతగా చట్ట సభల విలువలను దిగజార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment