
సాక్షి, గుంటూరు : రాష్ట్రం లోని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. జాతీయ మీడియా సర్వేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని తేల్చిచెప్పాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాలాంటి వారిపై దుష్ప్రచారం చేస్తున్నారు.. కానీ ప్రజలు వాటిని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. గతంలో ఇచఇచ్చిన హామీలనే చంద్రబాబు అమలు చేయలేదని.. మళ్లీ ఇప్పుడు అబద్దపు హామీలు ఇస్తున్నారని విమర్శించారు.
వైఎస్‌జగన్ ప్రకటించిన నవరత్నాలపై అన్ని వర్గాల ప్రజలు ఒక అవగాహనకు వచ్చారని.. వైఎస్సార్‌సీపీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతోందని జోస్యం చెప్పారు. తనలాంటి ఆడవారిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు గద్దెనెక్కారని విమర్శించారు. ఆ కుటుంబంలోని ఆడవారి సంగతి తెలుసునని.. చంద్రబాబు భార్య హిస్టరీ తన దగ్గర ఉందని అన్నారు. మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు.