కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ జెండాలతో ఆయా పార్టీ కార్యకర్తలు
సాక్షి, బెంగళూరు: సరిగ్గా కౌంటింగ్‌కు ముందే కర్ణాటక ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జేడీఎస్ మద్ధతు అనివార్యమయ్యే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులను మార్చాలని కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల్లోనూ కొత్త నేతల పేర్లు తెరపైకి వచ్చాయి.
సిద్ధరామయ్య స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జీ పరమేశ్వర, మల్లికార్జున ఖర్గే(ఖర్గే ఇది వరకే వార్తను ఖండించారు) పేర్లు వినిపిస్తుండగా, బీజేపీ నుంచి యాడ్యురప్ప స్థానంలో అనంత కుమార్ లేదా రాములు పేర్లు తెరపైకి వచ్చాయి. జేడీఎస్ మద్ధతు తప్పనిసరి అయితే దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణను డిప్యూటీ సీఎం చేస్తామన్న హామీని ఇరు పార్టీలు ఇస్తున్నట్లు సమాచారం. దళిత సీఎం ప్రతిపాదన, హంగ్ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ మార్పులు సంభవించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాములు పేరును బీజేపీ శ్రేణులు డిప్యూటీ సీఎంగా ప్రచారం చేస్తున్నాయి. ఏదిఏమైనా ఈ నెల 17న తానే సీఎంగా ప్రమాణం చేస్తానని యెడ్యూరప్ప ఘంటాపథంగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment