
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జేడీఎస్ నేత కుమారస్వామికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ‘కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేసిన కుమారస్వామి, పరమేశ్వరలకు శుభాకాంక్షలు. వారి పదవీకాలం సజావుగా సాగాలని కోరుకుంటున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి బీజేపీ దూరంగా ఉంది.
కమల్ శుభాకాంక్షలు
చెన్నై: కొత్త సీఎం కుమారస్వామికి మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘కొత్త ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఇరురాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు ఇది మంచి ఆరంభం’ అని ట్వీట్ చేశారు. కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా, రాహుల్, ఏచూరి, కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యలతో కమల్ సమావేశమయ్యారు.