న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని మొద్దు నిద్ర నుంచి తట్టిలేపామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 99% వస్తువులు 18% లోపు జీఎస్టీలోనే ఉండేలా కసరత్తు చేస్తున్నామన్న ప్రధాని ఇటీవలి వ్యాఖ్యలపై రాహుల్ పైవిధంగా స్పందించారు. ‘మేం గతంలో ఇదే విషయాన్ని చెబితే.. ప్రధాని దాన్ని కాంగ్రెస్ పార్టీ మూర్ఖపు ఆలోచన అంటూ కొట్టిపారేశారు. మేం అప్పుడు చెప్పిన విషయాన్నే ఇప్పుడు అమలు చేస్తామంటున్నారు’ అని రాహుల్ గురువారం ట్వీట్ చేశారు. ‘గబ్బర్ సింగ్ ట్యాక్స్(జీఎస్టీకి రాహుల్ పెట్టిన పేరు)కు సంబంధించి నరేంద్రమోదీజీని మొద్దు నిద్ర నుంచి మేల్కొలిపాం. ఆయన ఇంకా మత్తులోనే ఉన్నారు. అయినా, మేం గతంలో సూచించిన.. ఆయన అప్పుడు కొట్టిపారేసిన కాంగ్రెస్ పార్టీ మూర్ఖపు ఆలోచనను ఇప్పుడు అమలు చేయాలనుకుంటున్నారు. అస్సలు చేయకపోవడం కన్నా ఆలస్యంగానైనా సరైన చర్యలు చేపట్టడం మంచిదే’ అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment