
సింగపూర్: తానే గనుక ప్రధానమంత్రి అయి ఉండి ఉంటే నోట్ల రద్దు ప్రతిపాదనను చెత్తబుట్టలో విసిరేసే వాడినని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడం వల్ల ప్రజలకు ఏమాత్రం మేలు చేయదన్నారు.
ఆగ్నేయాసియా పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. అక్కడ ఆయన వివిధ వర్గాలకు చెందిన ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. నోట్ల రద్దు ప్రతిపాదన వస్తే మీరు ఏం చేసి ఉండే వారని అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు.